ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిందంబరానికి బ్యాడ్ న్యూస్.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘన, కేసుకు సహకరించడం లేదని ఆరోపణలతో బుధవారం ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకుంది.