
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిందంబరానికి బ్యాడ్ న్యూస్.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘన, కేసుకు సహకరించడం లేదని ఆరోపణలతో బుధవారం ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకుంది.
చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మారిషస్‌నుంచి పెట్టుబడులనుఅందుకునే విషయంలో ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఐఎన్ఎక్స్ మీడియా ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అలాగే ఐఎన్‌ఎక్స్ మీడియా డైరెక్టర్లు - పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా నిందితులపై ఎన్ఐఆర్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment