చనిపోయిన మా నాన్న లాకర్‌లో పాతనోట్లు! | allow exchange of old notes found in dead father locker | Sakshi
Sakshi News home page

చనిపోయిన మా నాన్న లాకర్‌లో పాతనోట్లు!

Published Wed, Apr 12 2017 10:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

చనిపోయిన మా నాన్న లాకర్‌లో పాతనోట్లు! - Sakshi

చనిపోయిన మా నాన్న లాకర్‌లో పాతనోట్లు!

  • మార్చుకోవడానికి దయచేసి అవకాశం ఇవ్వండి!

  • న్యూఢిల్లీ: రద్దైపోయిన రూ. 500, వెయ్యి నోట్లను మార్చుకోవడానికి తమకు మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టును  ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ జాబితాలో తాజాగా ఓ పిటిషన్‌ ప్రత్యేకమైన కారణాలతో ముందుకొచ్చింది. ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ. 83వేలు మేర విలువైన పాతనోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించాలని, ఈ పాత నోట్లు చనిపోయిన తమ తండ్రి లాకర్‌లో గడువు తర్వాత దొరికాయని సవితా అనే మహిళ సుప్రీంకోర్టుకు  నివేదించింది.

    రద్దైన పాతనోట్లను మార్చుకోవడానికి డిసెంబర్‌ 30, 2016ను కేంద్ర ప్రభుత్వం గడువుగా విధించిన సంగతి తెలిసిందే. అయితే, తన తండ్రి ఆస్తి విషయంలో వాటా కోసం తన సోదరి నిధి గుప్తాతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని, ఈ కేసులో గత మార్చి 6న కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో తండ్రి బ్యాంకు లాకర్‌ తన వాటా కింద వచ్చిందని, దానిని తెరువగా, అందులో రద్దైన పాత నోట్లు ఉన్నాయని ఆమె సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది.

    ద్దయిన పాత నోట్లను మార్చుకునే అవకాశం మళ్లీ కల్పిస్తే, అది ప్రజలందరికీ వర్తించేలా ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మార్చి 6నే కోర్టు కేంద్రం, ఆర్‌బీఐలకు నోటీసులు పంపింది. నోట్లరద్దుకు సంబంధించి వచ్చిన పలు ఇతర పిటిషన్లను కూడా కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement