న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ(డిమానిటైజేషన్) 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని తాము పరిశీలిస్తామని తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 58 పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొంతకాలంగా విచారణ కొనసాగిస్తోంది. ఆర్‌బీఐ తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్లు పి.చిదంబరం, శ్యామ్ దివాన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ నెల 10వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా వాదనలు తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి: ఢిల్లీలో బీజేపీకి బ్రేక్.. ఫలించిన కేజ్రీవాల్ ప్లాన్స్
Comments
Please login to add a commentAdd a comment