కోయంబత్తూర్ : డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి 250 రద్దైన రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్‌లో ఆనంద్‌కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్‌మురుగన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆదివారం రాత్రి ఆనంద్ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇంటి యజమాని ఆనంద్‌తో పాటు అద్దెకు ఉంటున్న రషీద్, షేక్‌లపై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆనంద్ ఇతరులతో కలిసి పాత నోట్లను తన నివాసంలో ఉంచి వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2016 నవంబర్‌లో రూ 1000, రూ 500 నోట్లను మోదీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment