seized cash
-
ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదు.. బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యలహంకలో ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై కేసు నమోదు చేశారు.చిక్కబల్లాపుర ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ. 4.8 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుందని, చిక్కబల్లాపుర నియోజకవర్గం ఎస్ఎస్టీ బృందం బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై గురువారం మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ద్వారా శుక్రవారం ప్రకటించారు.కాగా గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిని విచారించిన తరువాత బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. The FST of Chikkaballapura seized cash worth 4.8 Crores. An FIR also has been lodged by the SST team of Chikkaballapura Constituency against K Sudhakar, BJP Candidate on 25.04.2024 at Madanayakanahally Police Station.— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) April 26, 2024 -
TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నా సమయంలో వెలువడింది. ఈసీ ప్రకటన చేశాక.. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఆరోజు సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు, బంగారం, మద్యం.. ఇతరాలను సీజ్ చేయడం ప్రారంభించారు పోలీసులు. గురువారం సాయంత్రం దాకా.. అంటే ఈ మూడు రోజుల్లో సీజ్, కేసుల వివరాలు పరిశీలిస్తే.. తెలంగాణ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు(కేవలం) : రు. 20,43, 38, 375 అక్రమ సరఫరాలద్వారా పట్టుబడిన మద్యం స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రు. 86,92,533 స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ రు. 89,02,825 స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం, వెండి, వజ్రాల విలువ రు 14,65,50,852. మొత్తం ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం విలువ రు.22,51,963 (ల్యాప్‌టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి మొదలైనవి) నేరారోపణకు గురయిన వారు - 1196 మంది సరిహద్దు చెక్ పోస్టులు ►అంతర్ రాష్ట్ర సరిహద్దులు: 89. ►ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు: 169 ►ప్రజల ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు 34,338. ►ప్రజల ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 22,132. ►ప్రైవేటు ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు : 11,434 ►ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు: 7,322. వారం తర్వాత కేంద్ర బలగాలు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేటాయించింది కేంద్రం. అక్టోబర్ 20నాటికి ఈ బలగాలు తెలంగాణ అంతటా మోహరిస్తాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవి విధులు నిర్వహించనున్నాయి. -
ఆ డబ్బంతా నాది కాదు.. నాకేం తెలియదు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో దొరికిన డబ్బంతా తనది కాదని.. తాను లేనప్పుడు డబ్బంతా ఇంట్లో పెట్టారని ఆమె వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న అర్పితను మంగళవారం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళుతున్నప్పుడు ఆమె మీడియాతో మాట్లాడారు. కాగా, తన ఇంట్లో దొరికిన డబ్బంతా పార్థా ఛటర్జీదేనని ఈడీ విచారణలో అర్పితా ముఖర్జీ చెప్పినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. తన ఇంటిని మినీ బ్యాంక్‌లా ఆయన వాడుకున్నారని, డబ్బు దాచిన గదిలోకి తొంగి కూడా చూడకుండా తనను కట్టడి చేశారని వాపోయారు. అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించి 50 కోట్ల రూపాయలకు పైగా నగదు, ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అర్పిత చేసిన వ్యాఖ్యలను బట్టే చూస్తే పార్థా ఛటర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనబడుతోంది. ఈడీ విచారణలో పార్థా ఛటర్జీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. అయితే తనను ఈ కేసులో ఇరికించారని పార్థా ఛటర్జీ అంటున్నారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన డబ్బులు తనవి కాదని, సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలు బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. (క్లిక్: పార్థా ఛటర్జీకి అవమానం.. ముఖం మీదే చెప్పులు విసిరి..) -
భారీగా బంగారం, నగదు పట్టివేత
సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం, నగదును పోలీసులు పట్టుకున్నారు. రూ.3 కోట్ల 5లక్షల 35వేల 500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదు, బంగారం సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు తరలిస్తుండగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వాహనాలకు నకిలీ బీమా.. వారే సూత్రధారులు తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం -
తమిళనాడు ఎన్నికలు: గంటల వ్యవధిలో 428 కోట్లు సీజ్
చెన్నై: మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్ చేసింది. ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు 72 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వివరించింది. కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. చదవండి: బాక్సర్ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు.. -
ఆర్టీసీ బస్సులో భారీ నగదు
సాక్షి, కర్నూలు: ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో శనివారం రాత్రి కర్నూలు శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తున్న కుప్పం డిపో ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా.. రెండు లగేజీ బ్యాగుల్లో రూ.కోటీ 90 లక్షలు బయటపడ్డాయి. అనంతపురానికి చెందిన కమీషన్ ఏజెంట్ కోనేరి రామచౌదరి ఈ డబ్బును తీసుకెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలూ చూపకపోవడంతో నగదును సీజ్ చేసి కర్నూలు తాలూకా పోలీసులకు అప్పగించారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ ఆదివారం మీడియాకు ఈ నగదు వివరాలు వెల్లడించారు. పట్టుబడిన డబ్బు గుంతకల్లు పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగనాయకుడునాయుడుకు చెందినదని, హైదరాబాద్‌లో స్థలం కొనుగోలుకు తీసుకెళ్లి.. బేరం కుదరకపోవడంతో వెనక్కి తీసుకొస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించామని, ఆధారాలు చూపి తీసుకెళ్లొచ్చని చెప్పారు. -
భారీగా పట్టుబడ్డ పాత నోట్లు..
కోయంబత్తూర్ : డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి 250 రద్దైన రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్‌లో ఆనంద్‌కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్మురుగన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆదివారం రాత్రి ఆనంద్ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇంటి యజమాని ఆనంద్‌తో పాటు అద్దెకు ఉంటున్న రషీద్, షేక్‌లపై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆనంద్ ఇతరులతో కలిసి పాత నోట్లను తన నివాసంలో ఉంచి వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2016 నవంబర్‌లో రూ 1000, రూ 500 నోట్లను మోదీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
పట్టుకున్న డబ్బంతా ఎన్నికలదేనా?
ఎక్కడ ఏ డబ్బు చూసినా.. ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకెళ్తున్నదనే భావిస్తున్నారు. ముందు, వెనకా చూడకుండా ముందు స్వాధీనం చేసేసుకుంటున్నారు. ఆ తర్వాతే దానికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొంతమంది వ్యక్తులు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని 2 కోట్ల రూపాయలు తీసుకెళ్తుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఇంకేముంది, ఆ సొమ్ము మొత్తం ఒక పార్టీ ఎన్నికల్లో పంచిపెట్టడానికి తీసుకెళ్తున్నదేనంటూ వదంతులు వ్యాపించాయి. కానీ తీరా చూస్తే, ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఆ సొమ్ము డ్రా చేసినట్లు తర్వాత తేలింది. అలాగే, కృష్ణా జిల్లా నూజివీడులో మత్స్యకారుల సంఘానికి చెందిన 35 లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఈ డబ్బు నూజివీడు ప్రాంతంలోని 4 మండలాల్లో చేపల చెరువులకు సంబంధించినది. దాదాపు 170 కుటుంబాలకు చెందిన ఈ డబ్బు వారి యూనియన్ అధ్యక్షుడు షేక్ బాజీ దగ్గర ఉంది. చేపలు అమ్మగా వచ్చిన మొత్తం ఇలా అధ్యక్షుడి వద్ద ఉంచి, ఆరు నెలలకోసారి పంచుకోవడం వాళ్లకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. అలా పంచుకోవడానికి ఉంచిన డబ్బు గురించి ఎవరో ఫోన్ చేసి చెప్పడంతో.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా, లెక్కల్లోకి మాత్రం ఘనంగా 125 - 130 కోట్ల వరకు దొరికిందని ప్రకటిస్తున్నా, అందులో నిజంగా ఎన్నికల సొమ్ము ఎంతో, ఇతరత్రా సొమ్ము ఎంతో అనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.