ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యలహంకలో ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై కేసు నమోదు చేశారు.
చిక్కబల్లాపుర ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ. 4.8 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుందని, చిక్కబల్లాపుర నియోజకవర్గం ఎస్‌ఎస్‌టీ బృందం బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై గురువారం మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ద్వారా శుక్రవారం ప్రకటించారు.
కాగా గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిని విచారించిన తరువాత బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
The FST of Chikkaballapura seized cash worth 4.8 Crores. An FIR also has been lodged by the SST team of Chikkaballapura Constituency against K Sudhakar, BJP Candidate on 25.04.2024 at Madanayakanahally Police Station.
— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) April 26, 2024
Comments
Please login to add a commentAdd a comment