Chikballapur
-
కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్’
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్ మద్దతుదారులు ఆయన ఎన్నికల్లో గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసుల చేత బహిరంగంగా మద్యం పంపిణీ చేయించటం తాజాగా వివాదాస్పదం అయింది. దీంతో ఎంపీ సుధాకర్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘బీజేపీ ఎంపీ విజయోత్సవ కార్యక్రమంలో బహిరంగంగా మద్యం పంపిణీ చేయటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సమాధానం ఇవ్వటం కాదు.. జాతీయ అధ్యకక్షుడే స్పష్టత ఇవ్వాలి. ఇది బీజేపీ బీజేపీ కల్చర్’’ అని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద ప్రభుత్వం ఈవ్యవహారంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. చర్యలు తీసుకోవటం అనేది తర్వాత అంశం. ముందు బీజేపీ పార్టీ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని అన్నారు.చిక్కబళ్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఎంపీ సుధాకర్ విజయోత్సవ కార్యక్రమంలో పోలీసు మద్యం పంచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమం గురించి సదరు ఎంపీ పోలీసులకు మందుగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆహారం, మద్యం పంచటంలో సాయం అందించాలని ఆయన ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం. అయితే ఇలాంటి కార్యక్రమానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు. అదీకాక పోలీసులే మద్యం పంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.మద్యం పంపిణీ వ్యవహారం వివాదం రేపటంతో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సీఎన్ అశ్వనాథ్ నారాయణ్ స్పందించారు. ‘ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించకముందే మేము ఎవరీని నిందించలేము. ఇటువంటి వ్యవస్థ ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమంలో తప్పు జరిగిందని భావిస్తే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సుధాకర్ గెలుపొందారు. సుమారు 1.6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎస్ రక్షా రామయ్య ఓడించారు. -
ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదు.. బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యలహంకలో ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల నగదును ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై కేసు నమోదు చేశారు.చిక్కబల్లాపుర ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ. 4.8 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకుందని, చిక్కబల్లాపుర నియోజకవర్గం ఎస్ఎస్టీ బృందం బీజేపీ అభ్యర్థి కె.సుధాకర్‌పై గురువారం మదనాయకనహల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ద్వారా శుక్రవారం ప్రకటించారు.కాగా గోవిందప్ప అనే వ్యక్తికి చెందిన నివాసంలో అధికారులు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమానిని విచారించిన తరువాత బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. The FST of Chikkaballapura seized cash worth 4.8 Crores. An FIR also has been lodged by the SST team of Chikkaballapura Constituency against K Sudhakar, BJP Candidate on 25.04.2024 at Madanayakanahally Police Station.— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) April 26, 2024 -
మా కోసం చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు: రాజమౌళి
సాక్షి, బెంగళూరు: ‘‘ఆర్ఆర్ఆర్’ స్వాతంత్య్ర పోరాట యోధుల సినిమా కాబట్టి నేను ఈ వేడుకకు వచ్చాను. ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్రం తెచ్చారు. వారి గురించి, ఆ పోరాటం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగింది. శనివారం జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ – ‘‘దేశం గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించారు రాజమౌళి. దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి. కన్నడలోనూ ఈ సినిమా రావడం గర్వంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విజయవంతమై చరిత్రలో నిలిచిపోవాలి. ఈ సమయంలో పునీత్ రాజ్‌కుమార్‌ను మరవడం సాధ్యం కాదు. విజేతలు మరణించాక కూడా జీవిస్తారనే వివేకానందుడి మాటలు పునీత్ జీవితంలో నెరవేరాయి. పునీత్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును త్వరలో ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తాం’’ అన్నారు. ‘‘ఆర్ఆర్ఆర్ అంటే రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్ ఒక్కటే’’ అని మరో అతిథి, కర్నాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. ‘‘కొంచెం సంతోషం, కొంత బాధగా ఉంది. మా తమ్ముడు పునీత్ మరణంతో నాలుగు నెలలుగా సినీ పరిశ్రమ, కన్నడనాడు దుఃఖంలో ఉంది. రామ్‌చరణ్, తారక్ (ఎన్టీఆర్)లో పునీత్‌ను చూస్తున్నాను. దక్షిణాది నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒక దర్శకుడు (రాజమౌళి) ఎదగడం గర్వంగా ఉంది’’ అన్నారు మరో అతిథి, కన్నడ హీరో శివరాజ్‌కుమార్. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘పునీత్ అందరి మనసుల్లో ఉన్నారనడానికి ఇటీవల విడుదలైన ఆయన ‘జేమ్స్’ సినిమా విజయమే నిదర్శనం. ‘ఆర్ఆర్ ఆర్’ తెలుగు సినిమాకి గర్వకారణం కాబట్టి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారికి, మంత్రి పేర్ని నాని, కొడాలి నానీగార్లకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి, ఎంపీ సంతోష్‌కుమార్‌గారికి, ప్రకాశ్‌రాజ్‌కి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మాట్లాడి టికెట్ రేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మమ్మల్ని నెగ్గించేందుకు చిరంజీవిగారు చాలామందితో ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే ఆయనకు ఇష్టం ఉండదు. కానీ నేను మాత్రం ఆయన్ను ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. నేను అడిగిన వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నా రాముడు (రామ్‌చరణ్), నా భీముడు (ఎన్టీఆర్) శరీరంలోని ప్రతి అణువును పెట్టారు’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీ, తెలంగాణ తర్వాత కర్నాటక పెద్ద మార్కెట్. ప్రతి ఒక్కరూ థియేటర్లోనే సినిమా చూడాలి’’ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ప్రాంతీయ సినిమాల అడ్డంకులను చెరిపివేసి తన సినిమాల ద్వారా భారతదేశ ఐక్యతను చాటుదామనుకుంటున్న ఓ గొప్ప దర్శకుడి కల ‘ఆర్ఆర్ఆర్’. ఇది ఒక భారతదేశ సినిమా అని గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి... ముగ్గురూ అత్యుత్తమ ప్రదర్శనను ఈ సినిమాలో కనబరిచారు’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి . ‘‘ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిగారికి, మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిగార్లకు ధన్యవాదాలు. తెలంగాణ సీఎం కేసీఆర్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్రనిర్మాత దానయ్య. సినిమాను కర్ణాటకలో విడుదల చేస్తున్న వెంకట నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్’ అనే అక్షరానికి ఎంతో పవర్ ఉంది. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీ ఆర్, కర్నాటకలో రాజ్‌కుమార్, హిందీలో రాజ్‌కపూర్.... ఇలా ‘ఆర్’కు ఎంతో పవర్ ఉంది. అలాంటిది ఇప్పుడు మూడు ‘ఆర్’లు కలసి వస్తున్నారు’’ అన్నారు. -
ఘోరం: జీపును ఢీకొన్న సిమెంట్ లారీ.. 8 మంది మృత్యువాత
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో? చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం -
కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం
సాక్షి, కర్ణాటక : కోళ్లఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య గొడవల్లో కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. చిక్క తాలూకా పరిధిలోని రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాలలో ఫారం కోడిపిల్లలను వేలాదిగా వదిలి వెళ్లగా పట్టుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. వివరాలు.. చిక్క పరిసరాల్లోని కోళ్ల ఫారాలకు బడా కంపెనీలు కోడి పిల్లలను అందజేస్తాయి. అవి పెద్దయ్యాక వచ్చి తీసుకెళ్తారు. ఇందుకుగాను ఫారం యజమానులకు కోడికి ఇంత అని డబ్బు చెల్లిస్తాయి. అయితే ఇటీవల కంపెనీ సిబ్బంది లేనిపోని కిరికిరి చేయడం షురూ చేశారు. సరైన తూకం లేవని పెద్దసంఖ్యలో కోళ్లను, కోడిగుడ్లను తీసుకోకుండా మొండికేస్తున్నారు. దీంతో పెంపకందారులు కంపెనీల మాట వినేది లేదంటూ వారు ఇచ్చిన పిల్లలను శుక్ర, శనివారాల్లో సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది తెలిసిన ప్రజలు బ్యాగులు, పెట్టెలు తీసుకెళ్లి కోడిపిల్లలను పట్టుకెళ్లారు. -
కర్ణాటకలో ఘోర ప్రమాదం..12 మంది మృతి
బెంగళూరు : కర్ణాటకలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ప్రైవేటు బస్సు టాటా ఏస్‌ను ఢీ కొన్న ఘటనలో 12 మంది ఘటనస్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఓ చిన్న పాప కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిక్‌బళాపూర్ నుంచి చిరంజీవి పోటీ?
-
చిక్‌బళాపూర్ నుంచి చిరంజీవి పోటీ?
బెంగళూరు: కేంద్ర మంత్రి చిరంజీవి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు? సాధారణంగా అయితే సీమాంధ్ర నుంచి పోటీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. నాయకుల వలసలతో ఈ పార్టీ రోజురోజుకూ ఖాళీ అయిపోతోంది. కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఘోర పరాభవం తప్పదంటూ ఆ పార్టీ నాయకులే విమర్శిస్తూ ఇతర పార్టీల్లోకి దూకేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కర్ణాటక నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బెంగళూరుకు సమీపంలోని చిక్‌బళాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవి విజయం సాధించే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కాగా ఈ స్థానానికి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.