చిక్బళాపూర్ నుంచి చిరంజీవి పోటీ? | Chiranjeevi to contest from Chikballapur? | Sakshi
Sakshi News home page

చిక్బళాపూర్ నుంచి చిరంజీవి పోటీ?

Published Mon, Mar 10 2014 7:31 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

చిక్బళాపూర్ నుంచి చిరంజీవి పోటీ? - Sakshi

చిక్బళాపూర్ నుంచి చిరంజీవి పోటీ?

బెంగళూరు: కేంద్ర మంత్రి చిరంజీవి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు? సాధారణంగా అయితే సీమాంధ్ర నుంచి పోటీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. నాయకుల వలసలతో ఈ పార్టీ రోజురోజుకూ ఖాళీ అయిపోతోంది. కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఘోర పరాభవం తప్పదంటూ ఆ పార్టీ నాయకులే విమర్శిస్తూ ఇతర పార్టీల్లోకి దూకేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కర్ణాటక నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

బెంగళూరుకు సమీపంలోని చిక్బళాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవి విజయం సాధించే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కాగా ఈ స్థానానికి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement