సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నా సమయంలో వెలువడింది. ఈసీ ప్రకటన చేశాక.. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఆరోజు సాయంత్రం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు, బంగారం, మద్యం.. ఇతరాలను సీజ్ చేయడం ప్రారంభించారు పోలీసులు. గురువారం సాయంత్రం దాకా.. అంటే ఈ మూడు రోజుల్లో సీజ్, కేసుల వివరాలు పరిశీలిస్తే..
- తెలంగాణ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు(కేవలం) : రు. 20,43, 38, 375
- అక్రమ సరఫరాలద్వారా పట్టుబడిన మద్యం స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రు. 86,92,533
- స్వాధీనం చేసుకున్న మొత్తం మత్తు పదార్థాల విలువ రు. 89,02,825
- స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం, వెండి, వజ్రాల విలువ రు 14,65,50,852.
- మొత్తం ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం విలువ రు.22,51,963
(ల్యాప్టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి మొదలైనవి) - నేరారోపణకు గురయిన వారు - 1196 మంది
సరిహద్దు చెక్ పోస్టులు
►అంతర్ రాష్ట్ర సరిహద్దులు: 89.
►ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు: 169
►ప్రజల ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు 34,338.
►ప్రజల ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 22,132.
►ప్రైవేటు ఆస్తులకు సంబంధించి నమోదయిన కేసులు : 11,434
►ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు: 7,322.
వారం తర్వాత కేంద్ర బలగాలు
తెలంగాణ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేటాయించింది కేంద్రం. అక్టోబర్ 20నాటికి ఈ బలగాలు తెలంగాణ అంతటా మోహరిస్తాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవి విధులు నిర్వహించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment