న్యూఢిల్లీ: రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను ముక్కలు చేసి ఇటుకలు (బ్రిక్స్)గా మారుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ కరెస్పాండెంట్ అడిగిన సమాచారాన్ని ఈ మేరకు వెల్లడించింది. ‘రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను లెక్కించి, అధునాతన కరెన్సీ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. పలు ఆర్బీఐ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ష్రెడ్డింగ్, బ్రిక్వెట్టింగ్ యంత్రాల ద్వారా ముక్కలు చేసి బ్రిక్స్‌గా మారుస్తున్నాం’ అని వివరించింది. బ్రిక్స్ తయారు చేసిన వెంటనే టెండర్లు పిలిచి విక్రయిస్తున్నామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment