పెద్దనోట్ల రద్దు అనంతరం తగినంతగా కరెన్సీ నోట్లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. చెల్లుబాటు అయ్యే కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ప్రజలు బ్యాంకులు ముందు నిత్యం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక స్టార్టప్ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. ఆన్‌లైన్‌లో మా ఉత్పత్తులు కొనండి.. అందుకు బదులుగా రూ. వెయ్యి వరకు చెల్లుబాటు అయ్యే కరెన్సీ నోట్లను మీ ఇంటికే వచ్చి అందిస్తామంటూ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
నోయిడాకు చెందిన స్టార్టప్ ‘టెయిల్.కామ్’ వినియోగదారులకు ఈ వినూత్న ఆఫర్ ఇచ్చింది. బియ్యం, పప్పుధాన్యాలు, పిండి తదితర వంటింటి వస్తువులను ఆన్‌లైన్‌లో ఈ స్టారప్ అమ్ముతున్నది. మా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే.. ఉచితంగా ఇంటికి కరెన్సీ నోట్లు డెలివరీ చేసే అవకాశం కల్పిస్తున్నామని టెయిల్‌మిల్.కామ్ సహ యజమాని అర్జున్ రంగ్తా తెలిపారు. ‘ఇది చాలా సింపుల్ ఫార్ములా. పెద్దనోట్ల రద్దు అనంతరం 15-20 రోజుల్లో మాకు వచ్చిన నగదును మేం మా వినియోగదారులకు అందజేయాలని నిర్ణయించాం. ఆన్‌లైన్‌లో మా ఉత్పత్తులు కొనేటప్పుడు వారు క్యాష్ డెలివరీ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. రోజుకు ఒక వినియోగదారుడికి రూ. వెయ్యిని పరిమితి అని తెలిపారు. ప్రజలు ఎక్కువగా కోరుతున్న రూ. 100 రూ. 500 నోట్ల రూపంలో కరెన్సీని డెలివరీ చేస్తున్నామని చెప్పారు. తమ క్యాష్ డెలివరీ కోసం వెబ్‌సైట్‌లో కనీస ఆర్డర్ రూ. 140 అని, మరోసారి కావాలనుకుంటే రూ. 160కిపైగా ఆర్డర్ చేయాలని, ఇది పూర్తిగా చట్టబద్ధంగా సాగుతున్నదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి తమ స్టార్టప్ కార్యకలాపాలు నోయిడాకు పరిమితమని చెప్పారు.
ఈ స్టార్టప్‌తో మీ ఇంటికే నోట్ల డెలివరీ!
Published Thu, Dec 1 2016 2:25 PM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
Advertisement
Advertisement