Provident Fund Office
-
దివాళీ స్పెషల్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
దివాళీ సందర్భంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21 సంవత్సరానికి ఖాతాదారులకు 8.5శాతం వడ్డీని అందిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. తద్వరా 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లకు లబ్ధి చేకూరనుంది. వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది ఈపీఎఫ్ఓ బోర్డ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు ఈపీఎఫ్ఓ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నట్లు, వారికి తక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ ఇవ్వడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ సభ్యుడు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఆర్ధిక మాంద్యం ఉన్నప్పటికీ 2020-21 సంవత్సరానికి వడ్డీ రేట్లను కొనసాగించడంపై కేంద్రప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. ఈపీఎఫ్‌లో ఏదైనా సమస్య ఆన్లైన్లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి? ►మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి ►ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి. ►ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి. ►పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ►ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి. ►యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ►ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది) ►ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి. ►ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి. ►గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు. ►ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ►దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది. చదవండి: తరచుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే! -
పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తమ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దని, బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు/మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పేర్కొంది. లేదా ఆధార్‌తో కూడుకున్న బయోమెట్రిక్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పింవచ్చని ఈపీఎఫ్‌వో తెలిపింది. సాధారణంగా ఏటా నవంబర్/డిసెంబర్లో పెన్షనర్లు పీఎఫ్ ఆఫీసుల్లో లైఫ్ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లంతా ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్‌తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో వివరించింది. చదవండి: క్వారంటైన్లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సౌకర్యవంతంగా ఉండేలా సర్వీస్ డెలివరీ ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈపీఎస్ పెన్షనర్లు పొందేలా బహుళ సంస్థల ఏజెన్సీ (మల్టీ–ఏజెన్సీ) మోడల్‌ను ఈపీఎఫ్‌వో ఎంచుకున్నట్లు పేర్కొంది. దీనికోసం పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్బుక్కు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించింది. స్థానిక పోస్ట్‌మాన్/సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించడం లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో తమ చేతివేలిముద్ర స్కానింగ్‌ను పంపించడంతో సమర్పించవచ్చని పేర్కొంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా (కేవలం నవంబర్, డిసెంబర్లోనే కాకుండా) ఈపీఎస్ పెన్షనర్లు ‘డిజిటల్ జీవన్ ప్రమాణ్’ల సమర్పణకు కీలకమైన విధానమార్పును చేపట్టినట్లు తెలిపింది. ఈ విధంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే తేదీ నుంచి ఏడాది పాటు అది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం -
కోవిడ్-19తో ఈపీఎఫ్ ఉద్యోగి మృతి
ముంబై : మహారాష్ట్రలోని థానే నగరంలో కోవిడ్-19 బారినపడిన ప్రావిడెంగ్ ఫండ్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి (31) మంగళవారం మరణించారని అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో యాజమాన్యం విఫలమవడంతోనే ఈ విషాదం చోటుచేసుకుందని ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ముందు జాగ్ర్తత్త చర్యలు చేపట్టాలని యాజమాన్యానికి తాము పలు లేఖలు రాసినా పట్టించుకోలేదని అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్‌కు ఈపీఎఫ్ స్టాఫ్ యూనియన్ నేతలు సమర్పించిన మెమొరాండంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో తక్కువ సిబ్బందితో పనిచేయాలన్న కేంద్ర పీఎఫ్ కమిషనర్ ఆదేశాలను సైతం యాజమాన్యం విస్మరించిందని యూనియన్ ఆరోపించింది. థానే ఈపీఎఫ్ కార్యాలయంలో ఆరుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకిందని యూనియన్ నేతలు ఈ లేఖలో పేర్కొన్నారు. -
పీఎఫ్ వడ్డీ రేట్లు 8.65 శాతానికి పెంపు
-
పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015–16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016–17లో 8.65 శాతానికి, అటుపై 2017–18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి అధిక వడ్డీ రేటు ఇవ్వాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతాం. వారినీ ఒప్పిస్తాం‘ అని గంగ్వార్ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటునిస్తే.. ఈపీఎఫ్ వద్ద రూ.151.67 కోట్ల మిగులు ఉంటుందని అందుకే ఈ రేటును నిర్ణయించామని ఆయన చెప్పారు. అదే 8.7 శాతం ఇస్తే రూ.158 కోట్ల లోటు ఉంటుందని తెలియజేశారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించవచ్చంటూ ముందుగా వార్తలు వెలువడ్డాయి. అయితే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని పెంచవచ్చంటూ అధికార వర్గాల నుంచి సంకేతాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు. పింఛను పెంపుపై నిర్ణయం వాయిదా... కనీస నెలవారీ పింఛనును రూ.2,000కు పెంచాలన్న ప్రతిపాదనపై నిర్ణయాన్ని మార్చిలో జరిగే తదుపరి సమావేశం దాకా వాయిదా వేసినట్లు ఈపీఎఫ్‌వో ట్రస్టీ పీజే బానాసురే తెలిపారు. కనీస నెలవారీ పింఛనును రెట్టింపు చేయాలంటే అదనంగా రూ.3,000 కోట్లు అవసరమవుతాయి. అందుకని ఆర్థిక శాఖ అనుమతిస్తే తప్ప దీనిపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ పింఛను పథకం (పీఎంఎస్‌వైఎం) కింద అసంఘటిత రంగ ఉద్యోగులకు కనీసం రూ.3,000 నెలవారీ పింఛను ఇస్తామంటూ ఇటీవల మధ్యంతర బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పీఎఫ్ చందాదారుల పింఛనును కూడా రెట్టింపు చేయాల్సి రానుంది. ప్రభుత్వం నిర్వహించే అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఒకే మొత్తం పింఛను ఉండాలని, అందుకే ఈపీఎఫ్‌వో చందాదారులకు కూడా పింఛనును రూ. 3,000 చేయాలని తాము కోరుతున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జనరల్ సెక్రటరీ వీర్జేష్ ఉపాధ్యాయ్ చెప్పారు. -
సీబీఐకి చిక్కిన పీఎఫ్ ఉద్యోగి
నిజామాబాద్ క్రైం : ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ సోమవారం సీబీఐ అధికారులు చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం మర్కల్‌కు చెందిన గండ్రెడ్డి గంగాధర్ అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయ త్రి ఘగర్ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా 12 ఏళ్లు పనిచేశాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పీఎఫ్ కోసం నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి పలుమార్లు పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. గంగాధర్‌కు సంబంధించిన పత్రాలపై గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సంతకాలు సరిపోకపోవడంతో కార్యాల యం వారు పత్రాలను తిప్పి పంపారు. ఈ నెల 11న గంగాధర్‌కు సంబంధించిన పత్రాలను పీఎఫ్ కార్యాలయంలో అనుమతించి, అతని అకౌంట్ క్లియర్ చేశారు. రూ. లక్షా 67 వేల పీఎఫ్ డబ్బులు వచ్చాయని, కార్యాలయానికి వచ్చి డబ్బులు తీసుకెళ్లాలని కార్యాలయ ఉద్యో గి సమాచారం అందించాడు. అతడు జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్ గంగాధర్‌ను కలిశాడు. రూ. 7 వేలు లంచం ఇస్తేనే పీఎఫ్ డబ్బులు ఇస్తానని సదరు ఉద్యోగి చెప్పడంతో అంత ఇచ్చుకోలేనని పీఎఫ్ లబ్ధిదారుడు గంగాధర్ పేర్కొన్నాడు. ఇరువురి మధ్య రూ. 6 వేలకు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని గంగాధర్.. శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లి సీబీఐని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం పీఎఫ్ కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్‌కు డబ్బులు ఇచ్చాడు. సీబీఐ అధికారులు పీఎఫ్ ఉద్యోగిని పట్టుకుని, కేసు నమోదు చేశారు.