దివాళీ సందర్భంగా ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2020-21 సంవత్సరానికి ఖాతాదారులకు 8.5శాతం వడ్డీని అందిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. తద్వరా 6 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ అకౌంట్ హోల్డర్లకు లబ్ధి చేకూరనుంది.
వడ్డీ రేట్లను కొనసాగిస్తుంది
ఈపీఎఫ్‌ఓ బోర్డ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు ఈపీఎఫ్‌ఓ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నట్లు, వారికి తక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ ఇవ్వడంపై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్‌ఓ సభ్యుడు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఆర్ధిక మాంద్యం ఉన‍్నప్పటికీ 2020-21 సంవత్సరానికి వడ్డీ రేట్లను కొనసాగించడంపై కేంద్రప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు.
ఈపీఎఫ్‌లో ఏదైనా సమస్య ఆన్‌లైన్‌లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి?
►మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి
►ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి.
►ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి.
►పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
►ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి.
►యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి.
►ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది)
►ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి.
►ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి.
►గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు.
►ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
►దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది.
చదవండి: తరచుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే!
Comments
Please login to add a commentAdd a comment