Provident Funds
-
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పెన్షన్, పీఎఫ్‌పై వివాదం.. స్పందించిన ఆర్మీ
అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన అన్షుమాన్ సింగ్‌కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసిందిఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు. ‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.అయితే కోడలు స్మృతి సింగ్‌పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA— The Hindu (@the_hindu) July 14, 2024 వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు. -
పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్ఆర్టీసీ కార్మికులకు పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను రాష్ట్ర బీజేపీ కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు రూ. 760 కోట్ల మేర పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు గత నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 2019 ఏడాదికిగానూ కార్మికులకు రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించాలని ఈపీఎఫ్‌వో డిమాండ్ నోటీసులు ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రికి బీజేపీ ఎంపీలు వివరించారు. -
పీఎఫ్ వడ్డీ రేట్లు 8.65 శాతానికి పెంపు
-
ఇక నుంచి ఒకే పీఎఫ్ నంబర్
► కంపెనీ మారినానంబరు మారదు ►పీఎఫ్ ఖాతాలేకపోతే ఫిర్యాదులు చేయండి ►పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్‌కుమార్ పటాన్చెరు: ఇక నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులందరికీ పర్మినెంట్‌గా ఒకే నంబర్ (యూనిక్)ను కేటాయిస్తున్నామని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్‌కుమార్ తెలిపారు. ఇక నుంచి ఖాతాదారులెవరూ కంపెనీలు మారినప్పుడల్లా కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదన్నారు. తమ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 1,88,327 మంది ఖాతాదారులందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను కేటాయించామన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ పీఎఫ్ ఖాతా నంబర్ తెలియని వారు వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని అడిగి నంబర్ తెలుకుకోవాలన్నారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల పీఎఫ్ నంబర్లను వారికి తెలపాలన్నారు. ఓ వ్యక్తి పేరు మీద పీఎఫ్ సొమ్ము నెలవారీగా అందితే అతనికి నిర్ణీత నంబర్ (పన్నెండకెల సంఖ్య)ను కేటాయించామని స్పష్టం చేశారు. గతంలో కాకుండా పీఎఫ్ క్లెయిమ్‌లను కూడా త్వరితగతిన చేపడుతున్నామన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కటింగ్ చేసి సదరు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో సొమ్ము జమచేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసలు పీఎఫ్‌లు కట్టని సంస్థలు 300 ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖాతాదారులందరూ ఆధార్ ఇవ్వాల్సిందే పీఎఫ్ ఖాతాదారులందరూ తమకు కేటాయించిన యూనిక్ నంబర్‌తో తమ ఆధార్ కార్డు నంబర్‌ను జత చేయాలన్నారు. అలాగే ఖాతాదారులందరూ తమ బ్యాంకు ఖాతాల అకౌంట్ నంబర్‌తో పాటు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ సమర్పించాలన్నారు. ఖాతాదారులందరూ తమ సంస్థల ద్వారానే వివరాలను పీఎఫ్ కార్యాలయానికి పంపాలన్నారు. ఇక నుంచి క్లెయిమ్ పరిష్కారం తర్వాత పీఎఫ్ మొత్తం నేరుగా ఖాతాదారుడి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఫిర్యాదు చేయండి పీఎఫ్ సమస్యలపై ఎవరైనా సరే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గ ణేష్‌కుమార్ సూచించారు. కాంట్రాక్టర్ చేసే మోసాలు, లేదా యా జమాన్యం చేస్తున్న మోసాలపై ఎప్పటికప్పుడు తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉద్యోగుల పేరిట పీఎఫ్ ఖాతా తెరవని సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులెవరైనా టటౌ.ఞ్చ్ట్ట్చఛిజ్ఛిటఠః ్ఛఞజజీఛీజ్చీ.జౌఠి.జీ కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అలాగే ప్రతి నెల 10వ తేదీన భవిష్యనిధి అదాలత్‌లో కూడా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. పీఎఫ్ పెన్షన్ రూ.1000 ఫీఎఫ్ ఖాతాదారులకు కనీసంగా రూ. వెయ్యి పింఛన్ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. 2014 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఖాతాదారులకు పెరిగిన పింఛన్ ఇవ్వడం లేదన్నారు. అక్టోబర్ నెల నుంచి పెంచిన పింఛన్ ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం బకాయిలన్నింటినీ విడుదల చేస్తామన్నారు. ఖాతాదారుల పింఛన్ స్థాయిని బట్టి పింఛన్ పెరుగుతుందన్నారు. కానీ కనీస పింఛన్ మాత్రం రూ.వెయ్యి ఉంటుందన్నారు.