అమర వీరుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీర్తి చక్ర అవార్డు బహుకరించిన సంగతి తెలిసిందే. గతేడాది జూలైలో సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరుడైన 26వ బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన అన్షుమాన్ సింగ్‌కు.. మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్రను ప్రకటించింది.
జూలై 5న ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. కొంత ఎక్స్ గ్రేషియాను అందించారు. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. కాగా అయితే పెళ్లైన అయిదు నెలలకే అన్షుమాన్ మరణించడం, వారి ప్రేమ, పెళ్లి, భవిష్యత్తు గురించి ఎంతో బాధతో ఆమె మాట్లాడిన మాటలు అందర్ని కంటతడి పెట్టించాయి. ఈ వీడియోను రక్షణశాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటీవల అన్షుమాన్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, మంజు సింగ్.. కోడలిపై మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. కోడలు అవార్డు, ఎక్స్ గ్రేషియా తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఎక్స్ గ్రేషియాను నెక్ట్స్ ఆఫ్ ది కిన్ (తదుపరి కటుంబ సభ్యులు)రూల్ ప్రకారం కోడలు, ఆమె కుటుంబీకులు తీసుకున్నారని చెబుతున్నారు. బిడ్డను కోల్పోయిన తమకు గోడ మీద ఫోటో తప్ప ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నిబంధనలను సవరించాలని కోరుతున్నారు.
కాగా వ్యక్తి సైన్యంలో చేరినప్పుడు.. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ (ఏజీఐఎఫ్), ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) , ఇతర స్థిరాస్తుల నుంచి బీమా పొందడం కోసం తమ తల్లిదండ్రులు, సంరక్షులు పేర్లు NOK (నెక్ట్స్ ఆఫ్ ది కిన్) నమోదు చేస్తారు. అయితే వీటన్నింటికీ ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. కానీ పెన్షన్ కోసం ఒకే నామినీ ఉంటారు. జవాను పెళ్లి అయిన తర్వాత ఆర్మీ నిబంధన ప్రకారం..తల్లిదండ్రులకు బదులుగా జీవిత భాగస్వామిని NOKకేగా పేర్కొంటారు.
‘నా కొడుక్కి వచ్చిన అవార్డును కోడలు తీసుకెళ్లింది. ఆమె మాతో ఉండటం లేదు. మేము కొడుకునే కాదు, అవార్డును కూడా కోల్పోయాం. కోడలు మాతో జీవించాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొడుక్కి వచ్చిన అవార్డుపై మాకూ అధికారం లేదా?‘ అని వాపోయారు. అయితే అత్తమామల ఆరోపణలపై సింగ్ భార్య స్మృతి సింగ్ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు.
అయితే కోడలు స్మృతి సింగ్పై దివంగత కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆర్మీ స్పందించింది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ ద్వారా వచ్చి రూ.1 కోటి eర్థిక సాయం.. సింగ్ భార్య, తల్లిదండ్రులకు 50-50 శాతం విభజించనున్నట్లు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే పీఎఫ్, పెన్షన్ మాత్రం భార్యకే చెందుతుందని తెలిపాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన రూ. 50 లక్షల సహాయంలో రూ. 35 లక్షలు అతని భార్యకు, రూ. 15 లక్షలు అతని తల్లిదండ్రులకు అందించనున్నట్లు పేర్కొన్నాయి.
Amid allegations made by the parents of late Captain Anshuman Singh against their daughter-in-law Smriti Singh, Army sources clarified that the AGIF of ₹1 crore was split between his wife and parents while the pension goes directly to the spouse. @dperi84 reports.… pic.twitter.com/UCJocN2TBA
— The Hindu (@the_hindu) July 14, 2024
వీలునామాలో సింగ్ భార్య నామినేట్ అయినందునా ఆమెకు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు అందనున్నాయి. అంతేగాక కెప్టెన్ సింగ్ తండ్రి ఆర్మీలో రిటైర్డ్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కావడంతో ఆయనకు స్వయంగా పెన్షన్ పొందున్నారు. మాజీ అధికారిగా ఇతర ప్రయోజనాలను కూడా అందుకుంటున్నారు. అయితే ఆర్మీ పాలసీ ప్రకారం ఒక అధికారి వివాహం చేసుకున్న తర్వాత, అతని భార్య పెన్షన్ కోసం నామినీ అవుతుందని ఆర్మీ వర్గాలు వివరించాయి.
అయితే సింగ్ తల్లిదండ్రుల ఆరోపణలపై పలువురు అధికారులు స్పందించారు. నామినీ అనేది ఖచ్చితంగా అధికారి ఎంపిక అని. అందులో జీవిత భాగస్వామి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే తల్లిదండ్రులు పూర్తిగా కుమారుడిపై ఆధారపడిన సమయంలో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్యలను ఆర్మీ యూనిట్ పరిష్కరిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment