అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు డిపాజిటర్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఇన్నాళ్లూ అగ్రిగోల్డ్ సంస్థను స్వాధీనం చేసుకుని (టేకోవర్ చేసి) డిపాజిటర్లకు న్యాయం చేస్తామని నమ్మబలుకుతూ వచ్చిన ఎస్సెల్ గ్రూప్.. ఒక్కసారిగా మాట మార్చడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.