
కార్ల అమ్మకాలు పుంజుకున్నాయ్
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం తగ్గుతోందని, కార్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయని సియామ్ తెలిపింది. గత నెలలో ప్రయాణికుల వాహన విక్రయాలు 14 శాతం పుంజుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్)పేర్కొంది. వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించగలదన్న అంచనాలు పెరిగాయని వివరించింది. అయితే టూ–వీలర్ల అమ్మకాలు తగ్గడం కొనసాగుతోందని పేర్కొంది. 2015, జనవరిలో 1,68,303గా ఉన్న దేశీయ మార్కెట్లో కార్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో 11 శాతం వృద్ధితో 1,86,523కు పెరిగాయని తెలిపింది.