వసతిగృహాలకు ‘పెద్ద’ కష్టం | Big Difficult to the hostels | Sakshi
Sakshi News home page

వసతిగృహాలకు ‘పెద్ద’ కష్టం

Published Sun, Nov 20 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

వసతిగృహాలకు ‘పెద్ద’ కష్టం

వసతిగృహాలకు ‘పెద్ద’ కష్టం

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు
- పిల్లల భోజనంలో మాయమైన గుడ్డు, పండ్లు
- సాయంత్రం ఇచ్చే చిరుతిళ్లకు బ్రేక్
- గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో డైట్ బిల్లులు
- దాదాపు రూ.180 కోట్ల బకాయిలు
- ఆందోళనలో వసతిగృహ సంక్షేమాధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావం సంక్షేమ వసతి గృహాలపై తీవ్రంగా ఉంది. విద్యార్థులకు అందించే భోజనం మెనూలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పౌష్టికాహారం కింద ఇచ్చే గుడ్డు, పండ్లను పలువురు వసతిగృహ సంక్షేమాధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా బడి నుంచి వసతిగృహానికి చేరుకున్న తర్వాత ఇచ్చే చిరుతిళ్ల(స్నాక్స్)కు సైతం మంగళం పాడారు. దీంతో సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులు గత పది రోజులుగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్, సాయంత్రం భోజనంతో సరిపెట్టుకుంటున్నా రు. రాష్ట్రంలో 1,635 సంక్షేమ వసతి గృహాలు న్నారుు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ పరిధి లో 462 హాస్టళ్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కింద 454 హాస్టళ్లు, ఎస్సీ అభి వృద్ధిశాఖ పరిధిలో 719 వసతిగృహాలున్నారుు. వీటిలో రెండు లక్షలకు పైగా విద్యార్థులున్నారు.

ఇవన్నీ పాఠశాలస్థారుు హాస్టళ్లే. వీటిలో వసతి పొందే విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం.. ఉదయం వస తిగృహంలో బ్రేక్‌ఫాస్ట్(ఉప్మా, పులిహోర, కిచి డీలలో ఒకటి) చేస్తారు. మధ్యాహ్నం పాఠశా లలో మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తారు. బడి ముగిసిన తర్వాత సాయంత్రం వసతి గృహా నికి చేరుకుని స్నాక్స్(అటుకులు, చిక్కిలు, ఉడికించిన బొబ్బర్లు, పెసర్లలో ఒకటి) తీసు కోవడంతో పాటు రాత్రి భోజనం చేస్తారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వసతి గృహాల్లో మెనూ తలకిందులైంది. పెద్దనోట్లు మార్కెట్లో చెల్లుబాటు కాకపోవడంతో సంక్షే మాధికారులకు సరుకులు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోరుుంది.

గుడ్లు, పండ్లకు రోజువారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు కావడం, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో సంక్షేమాధికారులు రోజువారీ చెల్లింపులపై చేతులెత్తేశారు. ఫలితంగా విద్యార్థులకు ఇచ్చే కోడి గుడ్డు, పండుకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నాలుగు రోజుల వరకు గుడ్లు, పండ్లు పంపిణీ చేశామని, తర్వాతే ఇబ్బందులు వచ్చాయని వికారాబాద్ జిల్లా పరిగి వసతిగృహానికి చెందిన ఓ సంక్షేమాధికారి పేర్కొన్నారు. నిధుల సమస్యకు తోడు నోట్ల రద్దుతో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎస్సీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు చారు, మజ్జిగతో భోజనాన్ని వడ్డించారు.
 
 బకాయిలతో మరిన్ని ఇబ్బందులు
 వసతిగృహాల్లో డైట్ బిల్లుల చెల్లిం పులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.180 కోట్ల బకారుు లున్నారుు. ఈ నిధులను సంక్షేమ శాఖలు విడుదల చేసినప్పటికీ.. ట్రెజరీలు మాత్రం వాటిని సంక్షేమా ధికారుల ఖాతాల్లో జమ కాకుండా నిలిపేశారుు. సంక్షేమ హాస్టళ్లకు ప్రతినెలా పౌరసరఫరాల శాఖనుంచి బియ్యం కోటా విడుదల కావడంతో కొంత ఉపశమనం కలుగుతోంది. కానీ కిరాణా సరుకులు, కూరగాయలు, చిల్లర కొను గోళ్లకు డైట్‌చార్జీలే కీలకం. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో సంక్షే మాధికారులు అప్పులు చేయాల్సి వస్తోంది. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో రూ.2లక్షలు అప్పు చేసినట్లు  ఓ అధికారి  వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement