ఉల్లి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్ యార్డుల్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఈ నెల 24 వరకు బంద్ ప్రకటించడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, అనుబంధశాఖల కార్యదర్శి పార్థసారథి తెలి పారు. గురువారం మలక్‌పేట మార్కెట్ ఉల్లి కొనుగోలు ప్రక్రియను మార్కెటింగ్ శాఖ డైరక్టర్ లక్ష్మీబారుుతో కలసి పరిశీలించి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో పార్థసారథి భేటీ అయ్యారు.
రైతుల నుంచి రూ.8 సహేతుకమైన ధరకు మార్కెటింగ్ శాఖ ఉల్లి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రరుుస్తుందని ఆయన తెలిపారు. రైతులకు చెక్కులు, ఆన్‌లైన్, ఆర్‌జీటీఎస్ ద్వారా చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని మార్కెట్ యార్డులు తెరిచే ఉంచటంతోపాటు స్థానిక వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లతో సంప్రదించి క్రయవిక్రయాలు జరిగేలా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ జేడీ రవికుమార్, మార్కెట్‌యార్డు కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.