సాక్షి, హైదరాబాద్: సాగుభూమి లేకున్నా రైతు సమన్వయ సమితి సభ్యులుగా ఎంపికైన వారిపై వేటు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లకు లేఖ రాశారు. ‘రైతు సమన్వయ సమితుల ఏర్పా టుకు జారీచేసిన ఉత్తర్వుల్లో సాగు భూమి లేని రైతులను సభ్యులుగా తీసుకోకూ డదని నిబంధన పెట్టుకున్నాం. కానీ అనేక చోట్ల ఆ నిబంధనను ఉల్లంఘించినట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి గ్రామ, మండల సమన్వయ సమితుల జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించి సాగుభూమి లేని రైతు లెవరైనా ఉంటే వారిని తొలగించండి..’ అని ఆ లేఖలో సూచించారు. ఈ మేరకు అర్హత లేకున్నా ఎంపికైన వందలాది మంది రైతులను తొలగించేందుకు రంగం సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది.
‘కార్పొరేషన్’ యోచనతో డిమాండ్
రైతు సమన్వయ సమితులను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం ప్రకటించ డంతో సమితుల్లో చేరేం దుకు డిమాండ్ మరింతగా పెరిగింది. గుత్తా సుఖేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమి స్తారని భావిస్తుండగా.. డైరెక్టర్లుగా కొందరు టీఆర్‌ఎస్ సీనియర్లకు చోటు లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమితికి పోటీ పెరిగింది.
రాజకీయ ఒత్తిళ్లతో ఎంపికలు
రైతులను సంఘటితపర్చి వారికి అవసరమైన సేవలు అందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ సమితిలో 15 మంది, మండల, జిల్లా సమితుల్లో 24 మంది చొప్పున, రాష్ట్రస్థాయి సమితిలో 42 మంది సభ్యులు ఉంటారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష మందికి పైగా గ్రామ, మండల సమితులకు సభ్యు లను, సమన్వయకర్తలను నియమించారు. ఇక జిల్లా, రాష్ట్రస్థాయి సమితులను ఏర్పాటు చేయాలి. అయితే అధికార పార్టీ నేతల ప్రతిపాదనల మేరకే గ్రామ, మండల సమితి సభ్యులను మంత్రులు ఎంపిక చేశారు. కొందరికి సాగుభూమి లేకపోయినా రాజ కీయ అవసరాల రీత్యా జాబితాల్లో చేర్చారు. కానీ దీనివల్ల అసలుకే మోసం వస్తుందన్న భావనతో అర్హత లేనివారిపై వేటేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment