సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు.
విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం!
Comments
Please login to add a commentAdd a comment