gouthu sirisha
-
క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే గౌతు శిరీష
-
క్షమాపణలు చెప్పించిన లోకేష్.. బీసీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం! -
మీరేమైనా పోటుగాల్లా.. తన హౌస్ అరెస్ట్ పై మండిపడ్డ సీదిరి
-
కూటమిలో కుమ్ములాటలు
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 17వ వార్డులో వైఎస్సార్ సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు.. అదే వార్డులోని టీడీపీ నాయకుడు, కూటమి నేతలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని చించివేయించడం కలకలం రేపుతున్నాయి. తొలుత ఎవరు కట్ చేశారో తెలియకపోయినా బుధవారం సోషల్‌మీడియాలో విడుదలైన వీడియోలు అసలు విషయాన్ని బయటపెట్టాయి. తన వార్డులో తన ఫొటోలు తప్పితే ఎవరి ఫొటోలు పెట్టినా ఊరుకోనని సదరు కౌన్సిలరే తన అనుచరులతో వీటిని చింపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు ఫ్లెక్సీ చింపే సన్నివేశం రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరి ప్రమాణ స్వీకారానికి వెళ్లిపోయి వారితో ఫోటోలకు ఫోజులు ఇస్తూ మరోవైపు దొంగచాటుగా ఫ్లెక్సీలు చింపించడం చర్చనీయాంశమైంది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉంచి నాయకుడి ఫొటో చింపేయడంతో కూటమిలో కుమ్ములాట ప్రారంభమైందని పలువురు చర్చించుకుంటున్నారు. -
ఏకైక మహిళా ఎమ్మెల్యే ..
అరసవల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న వారసురాలు, ఆయన మనవరాలు గౌతు శిరీష తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. 2014లో తొలిసారి ఆమె టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పలాస నుంచి ఎన్నికల బరిలో దిగినప్పటికీ గెలుపు సాధ్యం కాలే దు. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆమె మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై గెలుపొందారు. 1952 నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రలో ఈమె 16వ మహిళా ఎమ్మెల్యే కా గా...సంఖ్యా పరంగా 23వ మహిళా ఎమ్మెల్యేగా రికార్డులోకి ఎక్కారు. 1962లో తొలిసారి బ్రాహ్మణతర్ల నుంచి ఎమ్మెల్యేగా బెండి లక్ష్మీనారాయణమ్మ గెలుపొందగా, ఆ తర్వాత 1972లో నరసన్నపేట నుంచి బగ్గు సరోజినమ్మ, పాతపట్నం నుంచి చుక్క పగడాలమ్మ, ఉణుకూరు నుంచి పాలవలస రుక్మిణిలు గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావం 1983లో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా కావలి ప్రతిభాభారతి గెలిచారు. 1983, 1988, 1989, 1994, 1999లలో కూడా ఆమె ఎచ్చెర్ల ఎమ్మెల్యేగానే గెలుపొందారు. రాష్ట్ర అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్ కూడా ఎన్నికయ్యారు. అలాగే 1985లో టెక్కలి నుంచి వరద సరోజ, 1989లో టెక్కలి నుంచి దువ్వాడ నాగావళి, అలాగే 1989, 1999లలో పాలకొండ నుంచి పీజే అమృతకుమారి, 1996లో ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగానూ గెలుపొందారు.అనంతరం 2004లో కొత్తూరు ఎమ్మెల్యేగా మినతి గొమాంగో, 2004, 2009లలో ఆమదాలవలస ఎమ్మెల్యేగా బొడ్డేపల్లి సత్యవతి, 2009లో టెక్కలి ఎమ్మెల్యేగా కొర్ల భారతి, 2014లో, 2019లోనూ పాలకొండ ఎమ్మెల్యేగా విశ్వాసరాయి కళావతి, 2014లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవి, 2014లో పాతపట్నం ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జిల్లా నుంచి గెలుపొందిన ఏకై క మహిళా ఎమ్మెల్యేగా గౌతు శిరీష రికార్డులకెక్కారు. -
ఆ టాక్ నిజమేనా..?.. డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా?
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు అక్కడ అనేకసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవలందించారు. అయితే ఆయన వారసులు పెద్దాయన పరువు తీసేసారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఆ వారసుల్ని అందలం ఎక్కించినా పాత గుణం మానడం లేదట. అందుకే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను మార్చేయాలనుకుంటున్నారట చంద్రబాబు. చదవండి: ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ రచ్చ.. వెన్నుపోటుకు సిద్ధంగా ఆ వర్గాలు శ్రీకాకుళం జిల్లాలో సర్దార్ గౌతు లచ్చన్నకు ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. ఆయన కుమారుడు గౌతు శివాజీ, మనుమరాలు గౌతు శిరీష.. ఇప్పుడు లచ్చన్న ఇమేజ్‌కు ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి నియోజకవర్గంలో ఆమె సాగించిన పెత్తనాన్ని చూసిన ప్రజలు 2019లో ఘోరంగా ఓడించారు. ఎన్నికల్లో ఓడినా ఆమె వెనకటి గుణం మారలేదని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ్ముళ్ల నుంచి ఒత్తిడి మొదలయ్యే సరికి చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక పలాసలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఏడువందల కోట్ల రూపాయిలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, వంశధార నది నుండి పైపు లైన్ ల ద్వారా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్‌ను ఇంటింటికి అందిస్తున్నారు. కిడ్నీ రోగులకు నెలకు పదివేలు పెన్షన్ ఇవ్వడం వంటి అత్యంత కీలకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన 9 సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. దీంతో ఉద్దానం పల్లెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరి మనస్సుల్లో అభిమానాన్ని నింపుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో ఇతర పార్టీల గురించి ఇక్కడి ప్రజలు అలోచించే పరిస్థితి లేదు. టీడీపీ ఇమేజ్ అక్కడ రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. దీనికి తోడు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజును గౌతు శిరీష తరుచూ బాడీ షేమింగ్ చేయడం.. ఆయన నిర్వహిస్తున్న శాఖ పేరుతో అవమానకరంగా మాట్లాడటం పలాస ప్రజలకు నచ్చడం లేదు. మంత్రి అప్పలరాజు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని శిరీష ఇటీవల రచ్చరచ్చ చేశారు. భూ అక్రమణలపై విచారణ చేపట్టడంతో.. టీడీపీ దొంగల భూ అక్రమణలు బయటపడ్డాయి. మంత్రి మీద చేసిన ఆరోపణలు టీడీపీకి కలిసి రాకపోగా ఆ పార్టీనే మరింత నష్టపరిచింది. ఈ విషయమై పలాస నుండి ఒక టీం.. శిరీష వ్యవహరంపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాసారు. ఈ పరిణామాలతో చంద్రబాబు.. శిరీషను మార్చాలనే నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నుండి ఒక వైద్యుడిని, మరో ప్రముఖ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో గౌతు శివాజీ డ్యామేజి కంట్రోల్‌కు దిగారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కాదు, తానే పోటీ చేస్తానని కేడర్‌కు చెప్తున్నారట. జరిగిందేదో జరిగిపోయింది, నేనే పోటీ చేస్తాను అని చంద్రబాబుకు కూడా చెప్పుకున్నట్టు సమాచారం. అయితే గౌతు శివాజీ పోటీ చేసినా, కుమార్తె శిరీష హావా కొనసాగుతుందని... ఇక మాకు వీళ్ల సేవలు చాలని తమ్ముళ్లు అనుకుంటున్నారట. -
టీడీపీలో అసంతృప్తి సెగ: అలిగిన శిరీష
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు ఆ పార్టీలో అసంతృప్తి సెగ రాజేసింది. నోరు పారేసుకుని అటు అధికారులపైన, ఇటు ప్రజలపైన దూకుడుగా ఉండే కూన రవికుమార్ నియామకంపై సొంత పార్టీలోనే అసమ్మతి చోటు చేసుకుంది. బయటకు వ్యక్తం చేయలేకపోయినా లోలోపల పార్టీ శ్రేణులు మండిపడుతున్నా యి. ప్రజలకు ఏం సంకేతాలివ్వడానికి ఈ నియామకాలంటూ పెదవి విరుస్తున్న పరిస్థితి నెలకొంది. అందరి కంటే ముఖ్యంగా ఇంతవరకు అధ్యక్ష పదవిలో ఉన్న గౌతు శిరీష తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. తనకు మాటైనా చెప్పకుండా తీసేశారని మండిపడుతున్నారు. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న సమాచారం తెలుసుకుని చంద్రబాబు బుజ్జగింపు పర్వం ప్రారంభించారు. పార్టీ దూతలుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పంపించారు. అంతటితో ఆగకుండా తన కుమారుడు నారా లోకేష్ చేత కూడా ఫోన్ చేయించి, శిరీషను వారించారు. (చదవండి: సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ముందస్తు సమాచారంతో గౌతు శిరీష తండ్రి శ్యామ సుందర శివాజీ పాదాలకు కింజరాపు అచ్చెన్నాయుడు నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్న రోజుల వ్యవధిలోనే శిరీషను అధ్యక్ష పదవి పీకేయడంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గౌతు సానుభూతి పరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాకుండా కూన రవికుమార్ వ్యతిరేక వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. అధిష్టానం చెప్పినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతారనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడుకు, కూన రవికుమార్‌కు పెద్ద పీట వేయడానికి తమను అవమాన పరుస్తారా? అని గౌతు శిరీషతో పాటు ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మాటైనా చెప్పకుండా పదవి తీసేశారని ఆగ్రహానికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, 35 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తున్న శ్యామ సుందర శివాజీ ఫ్యామిలీకి పా ర్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న శివాజీకి ఒకే ఒకసారి మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఆ తర్వాత అధికారంలో ఉన్న ప్రతి సారి అవమానాలకు గురి చేశారని గౌతు వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలా మొక్కారు.. ఇలా తొక్కారు!) ఈ కారణాలతోనే గౌతు శిరీష అలకబూనారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు బుజ్జగించేందుకు ఉ పక్రమించారు. తనకు విధేయులుగా చెప్పుకునే ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పార్టీ దూతలుగా విశాఖలో ఉన్న శిరీష ఇంటికి పంపించారు. బుజ్జగించేందుకు తన వద్దకు వచ్చి ఆ ఇద్దరు నేతల వద్ద ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన ఫ్యామిలీకి జరిగిన అవమానాలను వివరించి మండిపడ్డట్టు సమాచారం. అధ్యక్ష పదవి లేకపోయి నా పార్టీలో ఏదో ఒక గౌరవం కలి్పస్తామని ఆ నేతలు హా మీ ఇచ్చి బుజ్జగించారు. వీరెంత చెప్పినా శిరీష మౌనంగా విని ఉండటంతో నారా లోకేష్ చేత ఫోన్ చేయించారు. పా ర్టీలో తప్పనిసరిగా ప్రాధాన్యత కలి్పస్తామని, కొన్ని కారణాలతో మార్చాల్సి వచ్చిందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
అలా మొక్కారు.. ఇలా తొక్కారు!
పై ఫొటో చూశారా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ఆలోచనతో కింజరాపు అచ్చెన్నాయుడు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మె ల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్న దృశ్యమిది. ఈ చిత్రం చూస్తే ఆయనపై అచ్చెన్నాయుడుకు ఎంతో వినయ విధేయతలు ఉన్నాయనుకుంటారు. కానీ గౌతు శ్యామసుందర్ శివాజీ ఆశీస్సులు తీసుకున్న వారం రోజుల లోపలే ఆయన కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఊడగొట్టారు. కూన రవికుమార్‌ను పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడి పేరుతో నియమించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. ఎవరికైతే నోరు ఉంటుందో వారిదే ఊరు అన్నట్లు పట్టం కడతారని, అవినీతి అక్రమాలు, ఇతరత్రా వ్యవహారాల్లో దూకుడుగా ఉండి కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తారని చంద్రబాబు మరోసారి నిరూపించారని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అచ్చెన్నాయుడి అభిప్రాయం తీసుకోకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారనుకుంటే పొరపాటే. రాష్ట్ర అధ్యక్షుడినే చేస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.. అచ్చెన్నకు తెలియకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారని ఏ ఒక్కరూ భావించరు. అంతా అచ్చెన్నాయుడికి తెలిసే జరిగిందనేది పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముందు పొగిడి.. గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం అంతా.. ఇంతా అంటూ పలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో కనీసం మాట మాత్రం చెప్పకుండా గౌతు శిరీషను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి గౌతు కుటుంబంపై చంద్రబాబుకు ఏమాత్రం అభిమానం ఉందో తెలిసిపోతుంది. పదవి పోయిన శిరీష కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మార్చాలనుకుంటే ఒక మాట చెప్పి చేస్తే బాగుండేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి గౌతు శ్యామ సుందర శివాజీ కాళ్లకు అచ్చెన్నాయుడు మొక్కిన కొన్ని రోజులకే ఆమె కుమార్తె పదవి పోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. (అచ్చెన్నపై యూటర్న్) టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కూన రవికుమార్ గతంలో ఆమదాలవలస శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్నికల అధికారిపై చేయిచేసుకున్న టీడీపీ అభ్యర్థి భర్త
-
అధికారిపై చేయిచేసుకున్న టీడీపీ అభ్యర్థి భర్త
శ్రీకాకుళం: పలాసలో ఎన్నికల నిఘా అధికారి డాక్టర్ నాగరాజుపై పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరీ దౌర్జన్యం చేశారు. అనుమతి లేని డమ్మీ ఈవీఎంలతో మందస వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్‌కి వెంకన్న చౌదరీ పట్టుబడ్డారు. దీంతో ఈవీఎంలను స్వాధీనం చేసుకునేందుకు నిఘా అధికారి డాక్టర్ నాగరాజు ప్రయత్నించగా వెంకన్న చౌదరీ దుర్భాషలాడారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోతూ వెంకన్న, నాగరాజుపై చేయి చేసుకున్నారు. దిక్కున్న చోట ఫిర్యాదు చేసుకో అని బండబూతులు తిట్టారు. అనంతరం వాహనంతో పరారయ్యారు. వెంకన్న చౌదరీ మాటలతో డాక్టర్ నాగరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. -
నియంతృత్వ పాలనకు గుడ్‌బై
సాక్షి, పలాస (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యమైన నాయకులంతా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కుటుంబ పాలన ఇంకెన్నాళ్లంటూ కార్యకర్తలు సైతం పార్టీని వీడుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు ఓటమి భయం వెంటాడుతోంది. గతంలో శివాజీ మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు మేలు చేయకపోయినా అంతగా సమస్యలు ఉండేవి కావని, ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తయారయ్యారని సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఎవరి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నామని లోలోపన మదనపడుతున్నారు. శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని అల్లుడు వెంకన్న చౌదరి చక్రం తిప్పడం, అతనికి వ్యాపార దృక్పథం తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు శిరీష ఎమ్మెల్యే అయితే పలాసలో ఉండరు సరికదా వెంకన్న వల్ల మరింతగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయని, ఇప్పటికే అతని వల్ల అవస్థలు పడిన ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు, ఎమ్మెల్యేకు మధ్య ఆది నుంచి కోల్డ్ వార్ జరిగి చివరకి పూర్ణచంద్రరావు పార్టీని విడిచిపెట్ట వలసి వచ్చింది. తోటి కౌన్సిలర్లతో కలసి పార్టీకి గుడ్‌బై చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం జెడ్పీటీసీ ఉప్పరపల్లి నీలవేణి భర్త ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ కూడా ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. శిరీష అభ్యర్థిత్వాన్ని, వెంకన్న చౌదరి పెత్తనాన్ని నిరసిస్తూ వజ్రపుకొత్తూరు మండలంలో బలమైన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఆ పార్టీకి దూరమైంది. మందస మండలం ఎంపీపీ కొర్ల కవిత భర్త కొర్ల కన్నారావు కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. వెంకన్నచౌదరి పెట్టిన ఇబ్బందుల వల్లే బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కన్నారావు పార్టీని వీడవలసి వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీరితో పాటు మందస మాజీ జెడ్పీటీసీ అందాల శేషగిరి, వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్య, పలాస మాజీ జెడ్పీటీసీ వరిశ హరిప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. ప్రస్తుతం హరిప్రసాద్, అందాల శేషగరి, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. నాయకులతో పాటు ముఖ్యమైన కార్యకర్తలంతా పార్టీకి దూరమవుతుండటంతో గౌతు కుటుంబా నికి ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో డబ్బులు ఎరజూ పుతూ అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. పలాస నియోజవర్గానికి గౌతు శిరీష స్థానికేతరం ఇక్కడి ప్రజల నుంచి స్పందన కరవవుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో తగిన ఆదరణ ఉండటంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి డాక్టరు సీదిరి అప్పలరాజు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గౌతు కుటుంబానికి ముచ్చెమట్లు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదుకునేవారినే ఆదరించండి పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లా స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా దువ్వాడ శ్రీను, పలాస అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలాస అసోషియేషన్ అధ్యక్షుడు మన్నేళ శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. – కాశీబుగ్గ వెంకన్న వేధింపులే కారణం పార్టీని వీడడానికి ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి వేధింపులే ప్రధాన కారణం. పార్టీలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వలేదు. రాజకీయంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టారు. శివాజీ దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే పార్టీలో ఉండలేక బయటకు రావాల్సి వచ్చింది. – కొర్ల కవిత, మాజీ ఎంపీపీ, మందస అభివృద్ధిని పట్టించుకోలేదు వజ్రపుకొత్తూరు మండలంలో ఎంతో అభివృద్ధి చేయాలని ఆశించాం. ఆశలన్నీ అడియాశలయ్యాయి. నామమాత్రంగానే జెడ్పీటీసీగా ఉండాల్సి వచ్చింది. అధికారాలన్నీ శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చేతిలో పెట్టుకున్నారు. రాకాసి గెడ్డ వంతెన నిర్మాణం చేయాలని కోరాను. పూండి మార్కెటును అభివృద్ధి చేయాలని చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మత్స్యకా రులకు ఎమ్మెల్యే టికెట్ గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఇస్తామన్నారు. ఇది కూడా నెరవేరలేదు. అం దుకే మత్స్యకారుల సామాజకవర్గానికి చెందిన డాక్టరు సీదిరి అప్పలరాజుకు మద్దతు ఇస్తున్నాం. – ఉప్పరపల్లి ఉదయకుమార్ (జెడ్పీటీసీ నీలవేణి భర్త), వజ్రపుకొత్తూరు అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు శివాజీ కుటుంబానికి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు. వారికి అదొక రాజకీయ సూత్రం. అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే వాటి వల్ల నాలాంటివాళ్లకు ప్రజాదరణ ఎక్కడ వచ్చేస్తుందోనన్న భయం వాళ్లది. అన్నీ అధికారాలు వారి వద్దనే ఉంచుకొని మిగిలిన వారిని ఆటబొమ్మల్లా చేసుకుంటారు. వారికి ఎవరూ పోటీ కాకూడదు. ముఖ్యంగా వెంకన్న చౌదరి వేధింపులు చాలా ఎక్కువ. – కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ చైర్మన్, పలాస కాశీబుగ్గ -
ఇక లాభం లేదు.. పోలీసులనే దించుదాం..!
సాక్షి, శ్రీకాకుళం : ఎన్ని అక్రమాలు, అరాచకాలు చేసైనా, చివరికి ప్రజలు ఛీకొట్టినా సరే అధికారం మాత్రం దక్కాలనే తీరుగా టీడీపీ వ్యవహరిస్తోంది. కరెన్సీ కట్టలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం నిఘా నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీసులనే రంగంలోకి దించారు పచ్చ నేతలు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తరపున పోలీసులు డబ్బులు పంచుతున్న వ్యవహారం బయటపడింది. వజ్రపుకొత్తూరుకు చెందిన పోలీసులు టీడీపీ నేతలతో కలిసి ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంటబడ్డారు. జిల్లా పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను హెడ్ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. అయినా పరిస్థితుల్లో ఏ మార్పు కానరావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అడుగడుగునా నిబంధనలకు పాతరేస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను కూడా తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ హైకోర్టులో సవాల్ చేసింది. (చదవండి : ఎన్నికల ప్రచారంలో..‘గౌతు’కు షాక్...!) -
ఎన్నికల ప్రచారంలో..‘గౌతు’కు షాక్...!
సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గుణుపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు చేదు అనుభవం ఎదురైంది. మీపై నమ్మకం పెట్టుకుని గత ఎన్నికల్లో ఓట్లు వేసి అధికారం అప్పగిస్తే మాకు మీరు ఒరగబెట్టింది ఏంటి? అంటూ గ్రామ మహిళలు ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో అర్హులైనవారికి ఇళ్లు ఇచ్చారా? పింఛన్లు ఇచ్చారా? కనీసం తిత్లీ పరిహారం కూడా ఇవ్వలేదు. తుఫాన్లో ఇళ్లుపోయి వీధినపడిన మాకు హుద్‌హుద్ ఇళ్లయినా ఇచ్చారా? అంటూ మహిళలు శిరీషను నిలదీశారు. మీ ప్రభుత్వంలో కేవలం మీ పార్టీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులకే పథకాలు అందించారు. పంచాయతీకి 4 హుద్‌హుద్ ఇళ్లు కేటాయిస్తే ఏ అర్హతా లేని మీ కార్యకర్తలే పంచుకున్నారు. తిత్లీ తుఫాన్‌తో సర్వం కోల్పోయిన మమ్మల్ని అదుకోవాల్సిన మీరు, మీ కార్యకర్తలకే పరిహారం అందించి చేతులు దులుపుకుంటారా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? అని మండిపడ్డారు. మీ కార్యకర్తలనే ఓట్లడగండి తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, మిమ్మల్ని గెలిపించేందుకు రాత్రి, పగలు కష్టపడిన మాకు కనీసం గౌరవం కుడా ఇవ్వలేదు. ఇంత కంటే దౌర్భాగ్యం ఇంకేముంది అంటూ గౌతు కుటుంబాన్ని ఎండగట్టారు. మా ఓట్లతో గెలిచి, ప్రభుత్వ పథకాలు అందించలేని మీరు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గ్రామంలో అడుగుపెట్టి ఓట్లు అడుగుతున్నారు. మీకు సిగ్గు లేదా? అంటూ గ్రామ మహిళలు చీదరించుకున్నారు. వెళ్లండి..వెళ్లి మీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులనే ఓట్లు అడగండి అంటూ పొమ్మన్నారు. దీంతో శిరీష గ్రామ మహిళలతో మాటలతో ఎదరుదాడికి దిగారు. కానీ మహిళలు, గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనుదిరిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయకుండా ప్రచారాన్ని మధ్యలో ఆపి తోకముడిచి గ్రామం దాటారు. టీడీపీ ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు జి.పాపారావు, కోడ రామన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. -
‘చంద్రబాబు నన్ను గుర్తించలేదు’
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణతో అధికార టీడీపీలో రేగిన అసంతృప్తి సెగలు చల్లారలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్దపీట వేసి తమకు విస్మరించడంతో టీడీపీ సీనియర్ నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. నిబద్ధతతో పనిచేసినా సీఎం చంద్రబాబు తనను గుర్తించలేదని వాపోయారు. రాజకీయాల నుంచి తనకు రిటైర్మెంట్ ప్రకటించారని ఆవేదన చెందారు. మొదట్నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నానని, అయినా తనకు తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనను విస్మరించారని మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి మంత్రి పనిచేసినా తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడంతో ఆయన అలకబూనారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో శివాజీకి మొండిచేయి చూపడాన్ని గౌతు కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఆయన కుమార్తె శిరీష సిద్ధమయ్యారంటూవార్తలు వచ్చాయి. తనకు కాకుండా కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో శివాజీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. -
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా...
శ్రీకాకుళం: ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధిష్టానం కనికరించలేదని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ వాపోయారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తనకు పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో చెప్పాలని శివాజీ కుమార్తె, శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష డిమాండ్ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కనీసం ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేస్తారా అని సూటిగా నిలదీశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.