
టీడీపీ పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష(పాత చిత్రం)
శ్రీకాకుళం: పలాసలో ఎన్నికల నిఘా అధికారి డాక్టర్ నాగరాజుపై పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరీ దౌర్జన్యం చేశారు. అనుమతి లేని డమ్మీ ఈవీఎంలతో మందస వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్‌కి వెంకన్న చౌదరీ పట్టుబడ్డారు. దీంతో ఈవీఎంలను స్వాధీనం చేసుకునేందుకు నిఘా అధికారి డాక్టర్ నాగరాజు ప్రయత్నించగా వెంకన్న చౌదరీ దుర్భాషలాడారు.
ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోతూ వెంకన్న, నాగరాజుపై చేయి చేసుకున్నారు. దిక్కున్న చోట ఫిర్యాదు చేసుకో అని బండబూతులు తిట్టారు. అనంతరం వాహనంతో పరారయ్యారు. వెంకన్న చౌదరీ మాటలతో డాక్టర్ నాగరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment