సాక్షి, శ్రీకాకుళం : ‘ఏయ్ ఎవర్నువ్.. ఎలా అరెస్ట్ చేస్తావ్.. ఏమనుకుంటున్నావ్.. ఎవర్నీ వదల్ను.. మళ్లీ అధికారంలోకి వచ్చాక నేనే హోంమంత్రినౌతా.. అందర్నీ గుర్తు పెట్టుకుంటా.. సంగతి తేలుస్తా’ ఏయ్.. ఎక్స్టాలు చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు? నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? యూస్‌లెస్ ఫెలో’ పలుమార్లు ఎమ్మెల్యే.. ఓ సారి మంత్రి.. ఓ పారీ్టకి రాష్ట్ర అధ్యక్ష పదవి.. ఇంకా సీనియర్ రాజకీయనాయకుడన్న పేరు.. ఇన్ని భుజకీర్తులున్న ఓ వ్యక్తి మాటతీరిది. నోటి దురుసిది. ఇదేదో ఒకటి రెండు సంఘటనలకే పరిమితమైంది కాదని.. ఆ ప్రముఖుడు నోరు విప్పితే ఈ హుంకారాలే అహంకారపూరిత వ్యాఖ్యానాలే ప్రవాహంలా దూసుకొస్తాయని తెలుగు నేల నలుచెరుగులా ఏనాడో విదితమైంది.
అయితే రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ నోరు పారేసుకుంటూనే ఉన్న తీరు ఎన్నేళ్లయినా మారదని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. అందలమెక్కిన కాలంలో చెలాయించిన జులుం అధికారులకు, ఉద్యోగులకే కాదు.. సామాన్యులకు సైతం పీడకలలా వెంటాడుతునే ఉంది. రాజకీయం బలానికి దౌర్జనం తోడై.. అడ్డొచ్చేదెవరన్న దూకుడు కారణంగా ఎందరో ఎన్ని ఇక్కట్లు పడ్డారో బాధితులకే కాదు.. ప్రజలకు కళ్లెదుటూ కదలాడుతూనే ఉంది. అధికారం చేజారిన తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉంటే విస్తుపోవడం కూడా జనం వంతవుతూనే ఉంది. ఓ అభ్యరి్థని బెదిరించిన కేసులో మంగళవారం అరెస్టయిన వేళ.. ఆ నేత తీరు అందరినీ నిర్ఘాంత పరిచింది. ఇంత చెప్పాక.. ఈ ఘననేత అచ్చెన్నాయుడని వేరే చెప్పాల్సిన పనేముంది?
తప్పుల మీద తప్పులు చేయడం.. విచారణ కోసం అరెస్టు చేస్తే చేసిన ఆ తప్పుల్ని వదిలేసి అరెస్టులను పెద్దదిగా చూపించడం అచ్చెన్నాయుడుకు అలవాటుగా మారిపోయింది. దశాబ్దాలుగా ఊరిలో నియంతృత్వం సాగిస్తున్నా.. ఇన్నాళ్లూ చెల్లింది. ఇప్పుడు కొత్త గొంతులు ఆయనకు వ్యతిరేకంగా వినిపిస్తుండడంతో అచ్చెన్నలో అసహనం పెరిగిపోతోంది. ఈఎస్‌ఐలో రూ.150కోట్ల మేర కుంభకోణం చేసి విచారణలో బయటపడి అరెస్టయితే.. అది కక్ష సాధింపు అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. తాజాగా నిమ్మాడలో సర్పంచ్ పదవి కోసం తన కుటుంబీకులకు ప్రత్యరి్థగా పోటీ చేస్తున్న కింజరాపు అప్పన్నను బెదిరించి, దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఏ3గా అరెస్టు అయ్యారు. ఈ విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేసిందని గగ్గోలు పెట్టడం జిల్లా ప్రజానీకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సర్పంచ్ అభ్యరి్థపై దాడులకు దిగి నానా యాగీ చే సిన ఘటనలను మర్చిపోయి, కేవలం అరెస్టులను మాత్రం హైలెట్ చేయాలని చూడడం ఆయన అరాచక వైఖరికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తప్పంతా తన వైపే ఉంచుకుని ‘అధికారంలోకి వచ్చాక హోం మినిస్టరై నన్ను అరెస్టు చేసిన పోలీసులను వదిలి పెట్టనంటూ చిందులేయడం మరింత విస్మయపరుస్తోంది.
అంతా అరాచకీయమే..
అచ్చెన్నాయుడు రాజకీయ జీవితం అంతా బెదిరింపులు, దౌర్జ న్యాల మయమే. జిల్లాలో ముఖ్యంగా నిమ్మాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ఒక్కర్ని కదిపినా అచ్చెన్న తీరును ఇట్టే చెబుతా రు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నించేవాళ్లపై విరుచుకుపడటం, అడ్డు తగిలిన వాళ్లను తొలగించుకోవడం అచ్చెన్నాయు డి తరహా రాజకీయం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు అండగా ఉండటంతో అడిగేవాడు లేకుండా పోయారు. అడ్డొచ్చిన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావాల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పా ల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. ఇప్పుడవన్నీ బయటికొస్తున్నాయి. చేసిన తప్పులకు అచ్చెన్నాయుడు అరెస్టువుతుంటే అదేదో అధికార పక్షం కక్ష సాధింపు అంటూ గగ్గోలు పెట్టడం, పోలీసు అధికారులపై చిందులేయ డం చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అచ్చెన్నపై అనేక కేసులు
ఈఎస్‌ఐ కుంభకోణంలో అనేక కేçసులు ఎదుర్కొన్నారు. క్రైమ్ నంబర్ 04/ఆర్‌సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నిమ్మాడలో తనకు ప్రత్యరి్థగా నామినేషన్ వేసిన కింజరాపు అప్పన్నకు ఫోన్‌లో చేసిన బెదిరింపులు, వారి్నంగ్‌లు, నేరుగా జరిపిన దౌర్జన్యం, దాడుల ఘటనలో మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ఆయన సోదరుడు హరిప్రసాద్, సోదరుడి కుమారుడు సురే‹Ùతో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితుడు అప్పన్న కోట»ొమ్మాళి ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశాడు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149 ఐపీసీ అలాగే సెక్షన్ 123 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ దీ ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1995 కింద కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఏ1గా కింజరాపు హరిప్రసాద్, ఏ2గా కింజరాపు సురేష్, ఏ3గా కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం అచ్చెన్నాయుడును అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఏ1,ఏ2గా ఉన్న హరిప్రసాద్, సురేష్ పరారీలో ఉన్నారు. అభ్యరి్థని బెదిరించడం వల్లనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి. ఆడియో, వీడియోల ఆధారాలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలతో పోలీసులు అరెస్టు చేస్తే.. పోలీసు అధికారులపైనే అచ్చెన్న చిందులేశారు.
అనుచరులదీ అదే దారి..
అచ్చెన్న అనుచరులు కూడా ఈ తరహా రాజకీయ వ్యూహాలనే అనుసరిస్తున్నట్టున్నారు. ఆ మధ్య బుద్ధుడి విగ్రహం మణికట్టు చేయి ఎప్పుడో విరిగిపోతే దాన్ని రాజకీయం చేసి మత విద్వేషాలు రెచ్చగొడతామని యతి్నంచి దొరికిపోయారు. దీంట్లో తెరవెనక అచ్చెన్నా యుడు పాత్ర ఉందనేది ఆరోపణ. మొన్నటికి మొన్న సంత»ొమ్మాళి మండలం పాలేశ్వరపురం ఆలయంలో ని పాత నంది విగ్రహాన్ని టీడీపీ నేతలు పట్టపగలే తరలించి, నడిరోడ్డుపై ఉన్న సిమెంట్ దిమ్మపై ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రతిష్టించి అపచారానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాల పుటేజీతో అడ్డంగా దొరికిపోయి కూడా ఎదురుదాడికి దిగారు. దీంట్లో కూడా అచ్చెన్న పాత్ర ఉందన్న వాదనలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే విగ్రహం తరలిస్తే తప్పేంటి అంటూ ఓ వింతైన వాదన కూడా చేశారు. ప్రతి దాంట్లో వారే భాగస్వామ్యులై, ఆ పై అడ్డంగా దొరికిపోయి, అరెస్టులవుతుంటే అదంతా కక్ష సాధింపు అంటూ జనాన్ని ఏమార్చే వైఖరి ప్రజలకు అర్థమై పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment