ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... | gouthu sivaji disappointed over cabinet reshuffle | Sakshi
Sakshi News home page

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా...

Published Sun, Apr 2 2017 4:03 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... - Sakshi

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా...

శ్రీకాకుళం: ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధిష్టానం కనికరించలేదని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ వాపోయారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తనకు పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన తండ్రికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో చెప్పాలని శివాజీ కుమార్తె, శ్రీకాకుళం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష డిమాండ్ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. కనీసం ఆయన పేరు పరిశీలనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేస్తారా అని సూటిగా నిలదీశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement