సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు ఆ పార్టీలో అసంతృప్తి సెగ రాజేసింది. నోరు పారేసుకుని అటు అధికారులపైన, ఇటు ప్రజలపైన దూకుడుగా ఉండే కూన రవికుమార్ నియామకంపై సొంత పార్టీలోనే అసమ్మతి చోటు చేసుకుంది. బయటకు వ్యక్తం చేయలేకపోయినా లోలోపల పార్టీ శ్రేణులు మండిపడుతున్నా యి. ప్రజలకు ఏం సంకేతాలివ్వడానికి ఈ నియామకాలంటూ పెదవి విరుస్తున్న పరిస్థితి నెలకొంది. అందరి కంటే ముఖ్యంగా ఇంతవరకు అధ్యక్ష పదవిలో ఉన్న గౌతు శిరీష తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. తనకు మాటైనా చెప్పకుండా తీసేశారని మండిపడుతున్నారు. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న సమాచారం తెలుసుకుని చంద్రబాబు బుజ్జగింపు పర్వం ప్రారంభించారు. పార్టీ దూతలుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పంపించారు. అంతటితో ఆగకుండా తన కుమారుడు నారా లోకేష్ చేత కూడా ఫోన్ చేయించి, శిరీషను వారించారు. (చదవండి: సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత)
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ముందస్తు సమాచారంతో గౌతు శిరీష తండ్రి శ్యామ సుందర శివాజీ పాదాలకు కింజరాపు అచ్చెన్నాయుడు నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్న రోజుల వ్యవధిలోనే శిరీషను అధ్యక్ష పదవి పీకేయడంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గౌతు సానుభూతి పరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాకుండా కూన రవికుమార్ వ్యతిరేక వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. అధిష్టానం చెప్పినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతారనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడుకు, కూన రవికుమార్‌కు పెద్ద పీట వేయడానికి తమను అవమాన పరుస్తారా? అని గౌతు శిరీషతో పాటు ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మాటైనా చెప్పకుండా పదవి తీసేశారని ఆగ్రహానికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, 35 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తున్న శ్యామ సుందర శివాజీ ఫ్యామిలీకి పా ర్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న శివాజీకి ఒకే ఒకసారి మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఆ తర్వాత అధికారంలో ఉన్న ప్రతి సారి అవమానాలకు గురి చేశారని గౌతు వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలా మొక్కారు.. ఇలా తొక్కారు!)
ఈ కారణాలతోనే గౌతు శిరీష అలకబూనారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు బుజ్జగించేందుకు ఉ పక్రమించారు. తనకు విధేయులుగా చెప్పుకునే ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పార్టీ దూతలుగా విశాఖలో ఉన్న శిరీష ఇంటికి పంపించారు. బుజ్జగించేందుకు తన వద్దకు వచ్చి ఆ ఇద్దరు నేతల వద్ద ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన ఫ్యామిలీకి జరిగిన అవమానాలను వివరించి మండిపడ్డట్టు సమాచారం. అధ్యక్ష పదవి లేకపోయి నా పార్టీలో ఏదో ఒక గౌరవం కలి్పస్తామని ఆ నేతలు హా మీ ఇచ్చి బుజ్జగించారు. వీరెంత చెప్పినా శిరీష మౌనంగా విని ఉండటంతో నారా లోకేష్ చేత ఫోన్ చేయించారు. పా ర్టీలో తప్పనిసరిగా ప్రాధాన్యత కలి్పస్తామని, కొన్ని కారణాలతో మార్చాల్సి వచ్చిందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment