dissatisfied
-
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
టీడీపీలో అసంతృప్తి సెగలు..
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో పదవుల పందేరంపై తముళ్లు భగ్గుమంటున్నారు. ప్రజల్లో లేనివారికి పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసమర్థులను అందలమెక్కిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..) నిలదీత.. టీడీపీ రాష్ట్ర కమిటీలో తిరుపతికి చెందిన కొంతమందికి పదవులు దక్కాయి. దీనిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ మోసాలకు పాల్పడిన వారు, ప్రజల్లోకి రాని వారికి చోటు కల్పించడం సిగ్గుచేటని బహిరంగంగా విమర్శించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, బుల్లెట్ రమణ, వియలక్ష్మి శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను నిలదీశారు. ఏ రోజూ ప్రజల్లోకి రాని వ్యక్తులకు పదవులు ఇవ్వడం ఏంటన్నారు. కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ విజయలక్ష్మి, ఆర్సీ మునికృష్ణ మండిపడ్డారు. సుగుణమ్మ స్పందిస్తూ తాను సిఫార్సు చేసిన వారికి పదవులు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేయండి అంటూ ఆమె అసహనం వెళ్లగక్కారు. చంద్రబాబుకు సన్నిహితుడైన జయరామిరెడ్డి భార్య రజనీ, వినుకొండ సుబ్రమణ్యం, సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్‌రెడ్డికి పదవులు కట్టబెట్టడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. (చదవండి: టీడీపీ సూపర్ జంబో రాష్ట్ర కమిటీ) -
టీడీపీలో అసంతృప్తి సెగ: అలిగిన శిరీష
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు ఆ పార్టీలో అసంతృప్తి సెగ రాజేసింది. నోరు పారేసుకుని అటు అధికారులపైన, ఇటు ప్రజలపైన దూకుడుగా ఉండే కూన రవికుమార్ నియామకంపై సొంత పార్టీలోనే అసమ్మతి చోటు చేసుకుంది. బయటకు వ్యక్తం చేయలేకపోయినా లోలోపల పార్టీ శ్రేణులు మండిపడుతున్నా యి. ప్రజలకు ఏం సంకేతాలివ్వడానికి ఈ నియామకాలంటూ పెదవి విరుస్తున్న పరిస్థితి నెలకొంది. అందరి కంటే ముఖ్యంగా ఇంతవరకు అధ్యక్ష పదవిలో ఉన్న గౌతు శిరీష తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. తనకు మాటైనా చెప్పకుండా తీసేశారని మండిపడుతున్నారు. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న సమాచారం తెలుసుకుని చంద్రబాబు బుజ్జగింపు పర్వం ప్రారంభించారు. పార్టీ దూతలుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పంపించారు. అంతటితో ఆగకుండా తన కుమారుడు నారా లోకేష్ చేత కూడా ఫోన్ చేయించి, శిరీషను వారించారు. (చదవండి: సబ్బం హరికి ఝలక్.. జేసీబీతో కూల్చివేత) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ముందస్తు సమాచారంతో గౌతు శిరీష తండ్రి శ్యామ సుందర శివాజీ పాదాలకు కింజరాపు అచ్చెన్నాయుడు నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్న రోజుల వ్యవధిలోనే శిరీషను అధ్యక్ష పదవి పీకేయడంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గౌతు సానుభూతి పరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాకుండా కూన రవికుమార్ వ్యతిరేక వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. అధిష్టానం చెప్పినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతారనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడుకు, కూన రవికుమార్‌కు పెద్ద పీట వేయడానికి తమను అవమాన పరుస్తారా? అని గౌతు శిరీషతో పాటు ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మాటైనా చెప్పకుండా పదవి తీసేశారని ఆగ్రహానికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, 35 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తున్న శ్యామ సుందర శివాజీ ఫ్యామిలీకి పా ర్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న శివాజీకి ఒకే ఒకసారి మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఆ తర్వాత అధికారంలో ఉన్న ప్రతి సారి అవమానాలకు గురి చేశారని గౌతు వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలా మొక్కారు.. ఇలా తొక్కారు!) ఈ కారణాలతోనే గౌతు శిరీష అలకబూనారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు బుజ్జగించేందుకు ఉ పక్రమించారు. తనకు విధేయులుగా చెప్పుకునే ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పార్టీ దూతలుగా విశాఖలో ఉన్న శిరీష ఇంటికి పంపించారు. బుజ్జగించేందుకు తన వద్దకు వచ్చి ఆ ఇద్దరు నేతల వద్ద ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన ఫ్యామిలీకి జరిగిన అవమానాలను వివరించి మండిపడ్డట్టు సమాచారం. అధ్యక్ష పదవి లేకపోయి నా పార్టీలో ఏదో ఒక గౌరవం కలి్పస్తామని ఆ నేతలు హా మీ ఇచ్చి బుజ్జగించారు. వీరెంత చెప్పినా శిరీష మౌనంగా విని ఉండటంతో నారా లోకేష్ చేత ఫోన్ చేయించారు. పా ర్టీలో తప్పనిసరిగా ప్రాధాన్యత కలి్పస్తామని, కొన్ని కారణాలతో మార్చాల్సి వచ్చిందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
అజిత్ దాదా పవర్ ఇదీ...
ముంబై: అజిత్ పవార్ తండ్రి అనంత్‌రావ్ పవార్ కొన్నాళ్లపాటు ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం దగ్గర పనిచేశారు. ఆ సినీ వాసనలేమైనా వంటబట్టాయో ఏమో, అజిత్ బాలీవుడ్ థ్రిల్లర్‌ని తలదన్నేలా మహా రాజకీయాన్ని నడిపారు. ఇన్నాళ్లూ చిన్నాన్న శరద్ పవార్ నీడలో నీడలా కలిసిపోయిన పవార్ ఆయనకే రాజకీయంగా గట్టి ఝలక్ ఇచ్చి ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించు కున్నారు. శరద్ అనే వటవృక్షం నీడ నుంచి తప్పుకోవాలని అజిత్ భావిస్తున్నారని ఎప్పట్నుంచో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజిత్ సొంత పార్టీ పెడతారనీ గతంలో వార్తలొచ్చాయి. మహారాష్ట్ర సీఎం కావాలని అజిత్ పవార్ ఎప్పట్నుంచో కలలు కంటున్నారు. 2004, 2009లో కాంగెస్, ఎన్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినా ఆయన కల నెరవేరలేదు. అప్పట్నుంచే తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి అజిత్ పవార్ పావులు కదుపుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. కుటుంబ తగాదాలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరుపై అజిత్‌కు ఎప్పట్నుంచో అసంతృప్తి నెలకొని ఉంది. పవార్ తన కుమార్తె సుప్రియా సూలెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, తన కుమారుడు పార్థ్ పవార్ విషయంలో చాలా అనాసక్తిగా ఉన్నారని అజిత్ లోలోపల రగిలిపోతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవార్ కుమారుడు పార్థ్ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. పార్థ్ ఓటమికి తన చిన్నాన్నే కారణమని అజిత్ నిందించినట్టుగా ఎన్సీపీలో పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు నేతలు చెబుతున్నారు. స్వతంత్రభావాలు, ప్రజాకర్షణ అజిత్‌కు అద్భుతమైన పాలనాదక్షుడు, సర్వ స్వతంత్ర భావాలు కలిగిన నాయకుడిగా పేరుంది. ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా పేరున్న అజిత్ పవార్ చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. పుణె జిల్లాలో బారామతి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ వరసగా ఏడుసార్లు అక్కడ నుంచే గెలుపొంది రికార్డు సృష్టించారు. 60 ఏళ్ల వయసున్న అజిత్ పవార్ ఈ సారి ఎన్నికల్లో 1.65 లక్షల మెజార్టీతో నెగ్గి నియోజకవర్గంపై తనకున్న పట్టుని మరోసారి చాటుకున్నారు. ఆయనకున్న నాయకత్వ లక్షణాల కారణంగా అభిమానులు ఆయనను దాదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. 1959, జులై 22న రైతు కుటుంబంలో పుట్టిన అజిత్ పవార్ విద్యాభ్యాసం అంతా బోంబేలోనే సాగింది. 1982లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ కోపరేటివ్ బోర్డు సభ్యుడయ్యారు. 1991లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు. అయితే తన చిన్నాన్న కోసం లోక్‌సభ పదవిని వదులుకొని అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రి పదవుల్ని సమర్థంగా నిర్వహించారు. 1991లో తొలిసారిగా సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వ హయాంలో మంత్రి అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ భూ పరిరక్షణ, విద్యుత్, సాగునీరు వంటి శాఖల మంత్రిగా పనిచేశారు. -
రసాభాసగా టిప్పు జయంతి వేడుకలు
బెంగళూరు: బీజేపీ, ఇతర హిందూ సంస్థల ఆందోళనల నడుమ 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు శనివారం కర్ణాటకలో రసాభాసగా జరిగాయి. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర రాలేదు. సీఎం ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ముస్లిం వర్గాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. అధికారిక కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలు డుమ్మాకొట్టడంపై ముస్లిం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన పార్టీకి పట్టున్న మైసూరు ప్రాంతంలో ఓటర్లను దూరం చేసుకోకూడదనే సీఎం ఈ కార్యక్రమానికి గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. కానీ టిప్పు గొప్ప పాలకుడని, ఆయన సేవలు కొనియాడుతూ కుమారస్వామి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లోపోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. టిప్పు మతఛాందసవాది అని పేర్కొన్న బీజేపీ ఆయన జయంతి వేడుకల్ని నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరింది. బెంగళూరు, మంగళూరు, చిక్మగ్లూర్, బళ్లారి, కార్వార్ తదితర ప్రాంతాల్లో నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రెండో సీటూ కావాలి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాముండేశ్వరి స్థానం నుంచే పోటీ చేస్తారా? లేక ఉత్తర కర్ణాటకలోని బాదామీ నుంచి కూడా పోటీ చేయనున్నారా? ఈ విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినా సీనియర్ నాయకులు ఖర్గే, మొయిలీల ఒత్తిడితో కాంగ్రెస్ అధిష్టానం ఆయనను చాముండేశ్వరి స్థానానికే పరిమితం చేసింది. బాదామీలో దేవరాజ్ పాటిల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తన అసంతృప్తిని ఇప్పటివరకు సిద్దరామయ్య బహిరంగంగా వెల్లడించలేదు కానీ.. బాదామీ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని వివిధ వేదికలపై వ్యక్తపరిచారు. బాదామీ నియోజకవర్గ నేతలు తనను పోటీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. అధిష్టానంతో చర్చలు రాహుల్ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ మొదట్నుంచీ రెండో స్థానంలో పోటీని తోసిపుచ్చింది. అయినా, బీసీల చాంపియన్‌గా పేరున్న సిద్దరామయ్యను నిరాశకు గురిచేస్తే ఫలితాలు వేరోలా ఉంటాయనే అభిప్రాయంలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అందుకే పాటిల్‌కు ఇంతవరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. అటు, సీఎం రెండో సీటు కోసం అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏడుసార్లు చాముండేశ్వరి నుంచి పోటీ చేసిన సీఎం ఐదుసార్లు గెలిచారు. ఈ సారి చాముండేశ్వరి నుంచి గెలవటం సులభం కాదనే అభిప్రాయంలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. -
ఆ ఆప్ ఎమ్మెల్యేలు అనర్హులే
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఆదివారం కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్లో రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ.. 20 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. రాష్ట్రపతి నిర్ణయంపై ఆప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నిర్ణయం బాధ కలిగించిందని.. తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి తమను సంప్రదించి ఉండాల్సిందని వేటుపడిన ఎమ్మెల్యే అల్కాలాంబా తెలిపారు. అందుకే దేవుడు 67 సీట్లిచ్చాడు ‘మూడేళ్ల తర్వాత 20 మంది అనర్హులవుతారని దేవుడికి ముందే తెలుసు అందుకే 67 సీట్ల భారీ మెజారిటీ కట్టబెట్టాడు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేంద్రం కుట్ర పన్నిందని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. -
టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి సెగలు
-
చంద్రబాబు తీరుపై కేఈ అసంతృప్తి
-
టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
► రాజీనామా చేస్తానంటూ బొండా ఉమా హడావుడి ► నీ చిట్టా నా వద్ద ఉందంటూ సీఎం సీరియస్ ► రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా : కాగిత రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చిచ్చురేపింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏకంగా సీఎంపై విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఎంపీలు బుజ్జగించినా మెట్టు దిగలేదు. అయితే సీఎం సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు జిల్లాలో సీనియర్ అయిన పెడన ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచరులు బంటుమిల్లిలో ఆందోళన నిర్వహించారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాగితపై ఒత్తిడి చేస్తున్నారు. కాపుల గొంతు కోశారు. రాజధానిలో ఉన్న నేను 13 జిల్లాల కాపు నాయకులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. ఏ సమస్య అయినా అన్ని జిల్లాల కాపు నాయకులు నా వద్దకే వస్తున్నారు. అందరికీ పనిచేసి పెడుతున్నా. పార్టీ పెద్దలు నన్ను, కాపులను వాడుకుని ఇప్పుడు వదిలేస్తున్నారు. కాపులను నాశనం చేస్తున్నారు. – బొండా ఉమా, సెంట్రల్ ఎమ్మెల్యే మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగినట్టేనా..? మీ భూకబ్జాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చేసేవన్నీ నాకు తెలుసు. గన్‌మన్‌పై దాడిచేసినా కేసులు పెట్టలేదు. కాపు సామాజికవర్గ అంశాన్ని వివాదంచేస్తే సహించను. పదవులు దక్కలేదని అందరూ ఇలాగే చేస్తున్నారా.. జాగ్రత్త. – ఇదీ బొండా ఉమాకు సీఎం వార్నింగ్ (విశ్వసనీయ సమాచారం ప్రకారం) శనివారం రాత్రి 9 గంటల వరకు జాబితాలో నా పేరు ఉంది. కొందరు కుట్రచేసి నా పేరును తొలగింపజేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని కొనసాగిస్తున్నారు. 30ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నా. ఇప్పటికీ మంత్రి పదవి రాకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. – కాగిత వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే సాక్షి, విజయవాడ/మచిలీపట్నం: సీనియారిటీకి చోటు లేదు. అధినేత అనుగ్రహం కోసం నిగ్రహం కోల్పోయి ప్రతిపక్ష నాయకులపై బండ బూతులు తిట్టినా ప్రయోజనం లేదు. పదవి కోసం విలువలకు తిలోదకాలిచ్చి పార్టీ ఫిరాయించినా ఫలితం దక్కలేదు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో జిల్లా నుంచి కొత్తగా ఎవరికీ అవకాశం కల్పించలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసినవారే 2019 ఎన్నికల టీమ్‌గా ప్రచారం జరగడంతో అసంతృప్త నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక తమకు ఇప్పట్లో మంత్రి అయ్యే అవకాశం ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏకంగా సీఎం చంద్రబాబుపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనుచరులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఉమా ఇంటి వద్ద డ్రామా... విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటి వద్ద ఆదివారం ఉదయం పెద్ద హైడ్రామా నడిచింది. మంత్రి పదవి లభించకపోవడంతో మనస్తాపానికి గురైన బొండా ఉమా టీడీపీకి రాజీనామా చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసింది. ఉమాకు మద్దతుగా 18 మంది కార్పొరేటర్లు, పలు డివిజన్ల పార్టీ అధ్యక్షులు కూడా రాజీనామా చేస్తారని కొందరు హడావుడి చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపులంతా తన వద్దకే వస్తున్నారని, అందువల్ల రాజధానిలో ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తే తమ సామాజికవర్గానికి ఉపయుక్తంగా ఉంటుందని బొండా ఉమా వాదిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఒక కాల్‌కు బదులిస్తూ ‘రాష్ట్రంలో కాపుల గొంతు చంద్రబాబు కోశారు. కాపులను నాశనం చేశారు. కాపులను వాడుకుని వదిలేస్తున్నారు..’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. అప్పటికే ఉమా ఇంటికి వచ్చి బుజ్జగిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ వారించారు. కొద్దిసేపు వారు చర్చించుకున్న తర్వాత అందరూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. పెడన నియోజకవర్గంలో రగడ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు నాగేశ్వరరావుపేటలోని కాగిత నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కృత్తివెన్ను ఎంపీపీ వలవల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు ఒడుగు తులసీరావు, బంటుమిల్లి జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కరుణజ్యోతి, కృత్తివెన్ను డీసీ చైర్మన్ నెక్కంటి భాస్కరరావు, కౌతవరం డీసీ చైర్మన్ శలపాటి ప్రసాద్, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు, ఇతర టీడీపీ శ్రేణులు కాగితకు తమ పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. టీడీపీ గూడూరు మండల అధ్యక్షుడు పోతన స్వామి కార్యాలయంలో సమావేశమైన నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో టీడీపీ నాయకులు ఆందోళన చేసి నిరసన తెలిపారు. కాగితకు మంత్రి పదవి వచ్చిందని... మంత్రి ఉమా అడ్డుకున్నారని కొందరు నాయకులు నినాదాలు చేశారు. అయితే కొందరు నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకు లేఖలు కూడా పంపినట్లు తెలిపారు. నేరవేరని జలీల్‌ఖాన్ కల ముస్లిం మైనారిటీ కోటాలో మంత్రి పదవిని ఆశించి పార్టీ ఫిరాయించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు నిరాశే మిగిలింది. తాను వైఎస్సార్ సీపీ తరఫున గెలిచినా... టీడీపీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఇప్పుడు షాక్ ఇచ్చారని జలీల్‌ఖాన్ మథనపడుతున్నట్లు తెలిసింది. ఆయన సోమవారం సీఎంను కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు సీరియస్ కాపుల గొంతు కోశారంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగినట్లేనా..’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీ భూ కబ్జాల చిట్టా మొత్తం నా వద్ద ఉంది. మీరు చేసేవన్నీ నాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. రవాణాశాఖ గన్‌మన్‌పై దాడికి ప్రయత్నించినా కేసు పెట్టనీయలేదు. కాపు అంశాన్ని వివాదం చేస్తే సహించబోను..’ అని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. సీనియర్లకు పదవులు దక్కలేదని, అందరూ ఇలాగే చేస్తున్నారా... అని బొండాను ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఉమా తోకముడిచి వెనక్కి వచ్చేశారని సమాచారం. కొందరు అడ్డుకున్నారు : కాగిత ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 9 గంటల వరకూ మంత్రివర్గ జాబితాలో తన పేరు ఉందని, కొందరు నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించి తొలగింపజేశారని చెప్పారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అయితే అవినీతి ఆరోపణలు ఉన్న వారిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని తెలిపారు. తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. గత 30 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్నానని, 2014లో మంత్రివర్గ కూర్పులోనూ తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నాయకులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల్లో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని కాగిత ప్రకటించారు. రాజకీయ, కుల సమీకరణల వల్లే బొండాకు అన్యాయం : కేశినేని కొన్ని రాజకీయ, కుల సమీకరణల మూలంగానే ఎమ్మెల్యే బొండా ఉమాకు న్యాయం చేయలేకపోయామని సీఎం చంద్రబాబు చెప్పారని ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. పది రోజుల్లో సరైన పదవితో బొండాకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. -
మరీ ఇంత పేలవమా?
♦ బడ్జెట్ భేటీల్లో కాంగ్రెస్ తీరుపై సొంత ఎమ్మెల్యేల పెదవి విరుపు ♦ టీఆర్ఎస్ను ఇరుకున పెట్టలేకపోయామని వ్యాఖ్యలు ♦ ఇతర విపక్షాలతో సమన్వయంలోనూ వైఫల్యమే సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం వ్యవహరించిన తీరుపై సొంత ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ వైఫల్యాలు, ధర్నాచౌక్ ఎత్తివేత తదితర సమస్యలెన్నో ఉన్నా వాటిని ఎత్తిచూపడంలో ప్రధాన విపక్షంగా విఫలమయ్యామని వారంటున్నారు. అధికారపక్షంపై దూకుడుగా వెళ్తామని, మిగతా విపక్షా లను సమన్వయం చేసుకుని వ్యూహాత్మకంగా వెళ్తామని ఆశిస్తే అది అడియాసే అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. అంతర్గత వ్యూహమంటూ లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. విపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో సీఎల్పీ ఘోరంగా విఫలమైం దని కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు ఒకరన్నారు. ‘‘టీఆర్ఎస్ హయాంలో ఇది నాలుగో బడ్జెట్. రైతులకు రుణ మాఫీ, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగులకు ఉపాధి వంటి కీలకమైన టీఆర్ఎస్ ఎన్నికల హామీలేవీ అమలుకు నోచుకోలేదు. భగీరథ, కాకతీయ వంటి పథకాల అమలులో చాలా సమస్యలున్నాయి. పైగా ప్రశ్నించే గొంతును నులిమేసేలా నిరసన హక్కునూ అణిచేస్తున్నారు. ఇందిరాపార్కు నుంచి ధర్నా చౌక్‌ను ఎత్తేశారు. ఇన్ని సమస్యలున్నా వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయాం. విపక్ష పార్టీల్లో పెద్దన్న పాత్ర పోషించలేకపోయాం. అసలు విపక్షం అసెంబ్లీలో గట్టిగా మాట్లాడు తోందన్న భావనను కూడా కల్పించలేపోయాం. మా పనితీరు సభలోనే ఇలా ఉంటే ఇక క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ఏం చెప్పగలం?’’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. బాహుబలి, సంపత్ రచ్చతోనే సరి టీఆర్ఎస్ను ఓడించడానికి బాహుబలి వస్తాడన్న జానారెడ్డి వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. కాంగ్రెస్‌లోకి ఎవరైనా పెద్ద నాయకులు వస్తున్నారా, ఏమైనా అంతర్గత పరిణామాలు ఉన్నాయా అనే కోణంలోనూ జోరుగా ఊహాగానాలు సాగాయి. ఎస్సీ, ఎస్టీ చట్టంపై చర్చలో తాను మాట్లాడే అవకాశం లేకుండా జానారెడ్డి చేశారన్న కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ఈ ఉదంతంతో తాము మరింత పలుచనయ్యామని కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. సభకు సంబంధంలేని ఈ రెండు అంశాలే తమ పార్టీకి సంబంధించి హైలైట్ కావడం పరిస్థితికి అద్దం పట్టిందని వారంటున్నారు. -
ఇదేం విభజన!
♦ కొత్త జిల్లాలపై టీఆర్ఎస్లో భిన్నస్వరాలు ♦ ఏకగ్రీవ తీర్మానాన్ని పట్టించుకోకపోవడంపై కినుక ♦ విడిపోయిన హైదరాబాద్‌లో మళ్లీ చేర్చడమేమిటని రుసరుస ♦ ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం, ఏకపక్షంగా జిల్లాను విడగొడుతూ అధికారులు ప్రతిపాదించడం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడడంలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోకి తూర్పు ప్రాంతాలను చేర్చడం సహేతుకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అధికారపార్టీలో అసంతృప్తిని రాజేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆపార్టీ నేతల అసంతృప్తికి కారణమైంది. ఇదే విషయాన్ని రాష్ట్రస్థాయి పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావు ముందు కుండబద్దలు కొట్టారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై ఎలాంటి భేదాభిప్రాయం లేకున్నా.. మిగతా నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలుపుతూ ముసాయిదా రూపొందించడాన్ని తప్పుబడుతు న్నారు. ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ అంశంపై.. నేడో, రేపో విలేకర్ల సమావేశం పెట్టి మరీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజనను రాజకీయ కోణంలో చూడకుండా.. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లా ఏర్పడిందని, మరోసారి తమను హైదరాబాద్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకర్ల సమావేశంలో తేల్చిచెప్పే అవకాశముంది. -
జానా తీరుపై దిగ్విజయ్ అసంతృప్తి?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షనేత జానారెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గురువారం ఆయనను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో జానా వ్యవహరించిన తీరుతో పార్టీకి నష్టం కలిగిందని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ రూ.ఐదు భోజనం తిని, చాలా బాగుందని జానా ప్రశంసించారని.. దాంతో నష్టం జరిగిందని వివరించారు. జానాని ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పించాలని కోరారు. దీంతో జానారెడ్డి తీరుపై దిగ్విజయ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో జానా అలా వ్యవహరించడం వెనుక కారణమేమిటని పార్టీ నేతలను ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవాలు తెలుసుకుందామని, ఆ తరువాత ఏం చేద్దామో నిర్ణయించుకుందామని దిగ్విజయ్ పేర్కొన్నట్లు తెలిసింది. -
ఉద్యోగాలివ్వండి మహాప్రభో...
-
బాబు తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి
-
బాబు తీరుపై ‘తమ్ముళ్ల’ అసంతృప్తి
గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంతో కంగుతిన్న టీటీడీపీ నేతలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబునాయుడు పూర్తిగా వదిలేసుకున్నారేమోనని తెలంగాణ టీడీపీ నేతలు ఆం దోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై చంద్రబాబు కనీస విమర్శలు కూడా చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ‘ఓటుకు కోట్లు’ కేసు భయమే కారణమని భావిస్తున్నారు. అసలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో బాబు నేరుగా మాట్లాడిన ఆడి యో టేపులు బహిర్గతం కావడం, ఏసీబీ తమ చార్జిషీటులోనూ చంద్రబాబు పేరు ప్రస్తావించి న నేపథ్యంలో... కేసీఆర్‌తో సఖ్యత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటున్నారు. మంగళవారం నిజాం కళాశాల మైదానంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగించిన తీరు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోందని పేర్కొంటున్నారు. ఇలాగైతే ఎలా..? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావడానికి తొలుత విముఖత చూపి, పార్టీ నేతల ఒత్తిడి మేరకు బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ముక్తసరి ప్రసంగం చేయడం వారికి ఏ మాత్రం మింగుడు పడడంలేదు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపలేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి పార్టీని ముందుకు నడిపించడం ఎలా సాధ్యమని టీడీపీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఇప్పుడు మా ముందు గ్రేటర్ ఎన్నికలున్నా యి. ఇప్పటికిప్పుడు మా వైఖరి మార్చుకోవడానికి అనువైన ప్లాట్‌ఫాం దొరకాలి కదా. మా నిర్ణయం ఏదైనా గ్రేటర్ ఎన్నికల తరువాతే’ అని తెలంగాణ టీడీపీలో సీనియర్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణలో టీడీపీ కోసం రక్తం ధారపోసిన కుటుంబాలున్నాయని, చంద్రబాబు వారిని తీసుకెళ్లి సీఎం కేసీఆర్‌కు బలిపెడతారనుకోవడం లేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఓ టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో దోస్తీ కడుతున్న బాబుకు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలే అంటున్నారు. దానికి తోడు టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ అధినాయకత్వం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, మంగళవారంనాటి సభలో నమస్కారం అం టూ ఆయన ముక్తసరిగా మాట్లాడటానికి ఇదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘మేమేమో నిత్యం కేసీఆర్‌తో, టీఆర్ఎస్తో గొడవ పడాలి. పార్టీ అధినేత మాత్రం సఖ్యత తో ఉంటారు. ఇదెలా సాధ్యం? పార్టీ కేడర్ మమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది’ అని ఎర్రబెల్లి సన్నిహితులవద్ద ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు-కేసీఆర్ కలసిపోయినప్పుడు మనిద్దరి మధ్య విభేదాలు ఎందుకంటూ ఎర్రబెల్లి, రేవంత్ సరదా వ్యాఖ్యలు కూడా చేసుకున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పారు. నేతల్లో నిస్పృహ పార్టీ అధినేత చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రహించిన మాజీ కార్పొరేటర్లు అనేక మంది గతవారం రోజులుగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ఏడుగురు మాజీ కార్పొరేటర్లు టీడీపీని వీడారు. ఇక చంద్రబాబు వైఖరి స్పష్టమైన తరువాత మిగిలిన వారు కూడా పార్టీలో కొనసాగుతారనుకోవడం లేదని పార్టీ నేతలు అంటున్నారు. పోటీ చేయడానికి ముందుకు వస్తున్నవారు కూడా తక్కువేనని... కొన్ని డివిజన్లలో మినహా టికెట్లకు పెద్దగా డిమాండ్ లేదని జీహెచ్ఎంసీ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ‘బాబు ఎంత బలవంతంమీద ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారో ఆయన ప్రసం గం చూస్తేనే అర్థమవుతుంది. ఇదేమీ మా కేడర్‌కు పనికొచ్చేదిగా లేదు. పైగా పార్టీలో ఉండడం ఎందుకన్న ఆలోచన కలిగించేలా ఉంది’ అని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదని టీడీపీ సీనియర్ నేత ఒకరు చంద్రబాబు ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వానికి సంబంధమేలేని ఔటర్ రింగ్‌రోడ్డు కూడా తమ ఖాతాలో వేసుకోవడంపైనా టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి. ‘ఓటుకు కోట్లు’ కేసు కోసమే బాబు కేసీఆర్‌తో సంధి కుదుర్చుకున్నారన్న ఆరోపణలకు ఆయన ప్రసంగం అద్దం పట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీలో అంతర్మథనం తరచూ సీఎం కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తున్న బీజేపీ నేతలు చంద్రబాబు వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టినవారంతా బాబు ప్రసంగంతో కంగుతిన్నారు. ‘‘ఆయన ప్రసంగం ఇలా ఉంటుందనుకోలేదు. వేదిక మీద ఉన్న మాకే ఏం చేయాలో పాలుపోలేదు. టీడీపీ కార్యకర్తలకు కూడా మింగుడు పడలేదు. దీని ప్రభావం మా పార్టీపై పడుతుందేమో’’ అని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు లేకుంటే బాగుండనేదాకా తమ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అయితే బుధవారం ఉదయం ఓ టీవీ చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. 15 నిమిషాల్లోనే ముగిసిన ప్రసంగం.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినా, చివరకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ అయినా సరే చంద్రబాబు గంటకు తక్కువ కాకుండా మాట్లాడతారు. ఇక బహిరంగ సభల్లో అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై, ప్రతిపక్షంలో ఉంటే అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం ఆయన నైజం. టీడీపీ నేతలే ప్రైవేట్ సంభాషణల్లో ‘మైకాసురుడు’గా పిలుచుకునే చంద్రబాబు... మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో 15 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించడం చూసి వేదిక మీద ఉన్న టీడీపీ, బీజేపీ నేతలే ఆశ్చర్యపోయారు. ఈ 15 నిమిషాల ప్రసంగంలోనూ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గానీ, సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని గానీ పల్లెత్తు మాట అనకపోవడం చూసి విస్తుపోయారు. తాము అధికారంలో ఉన్న ఏపీలో ఏవిషయంలోనూ ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయానికి విలువ ఇవ్వకపోగా, అదే పనిగా ఎదురుదాడికి దిగడమే అలవాటు చేసుకున్న చంద్రబాబు... తెలంగాణలో అధికారపక్షాన్ని మాటమాత్రంగానైనా విమర్శించలేదు. దీనికి ‘ఓటుకు కోట్లు’ కేసు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు ఆర్నెల్ల కింద హైదరాబాద్‌లో ఏపీ పోలీసు స్టేషన్ పెడతామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ తరువాత సీఎం కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేనంతగా మారిపోయారు. -
సీఎం ఆదేశాలపై ఉద్యోగుల అసంతృప్తి
-
'సూట్‌కేసులు మోసేవారికే టికెట్లు'
హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఆర్ ప్రతాప్ తన అసంతృప్తిని వెళ్లకక్కారు. సూట్‌కేసులు మోసేవారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌కు వచ్చిన ఆర్ ప్రతాప్ విలేకర్లతో మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం వ్యవహరించిన తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే వరంగల్ జిల్లా సీనియర్ నేతలు, కార్యకర్తలతో భేటీ అయి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆ క్రమంలో మాజీ ఎంపీలు వివేక్, రాజయ్య, సర్వే సత్యనారాయణ, జిల్లా నాయకుడు ఆర్ ప్రతాప్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వివేక్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధిష్టానానికి తెలిపారు. ఈ నేపథ్యంలో సర్వే, రాజయ్య పేర్లు వినబడుతున్నాయి. దీంతో ఆర్ ప్రతాప్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దాంతో ప్రతాప్ పై విధంగా స్పందించారు. అయితే ప్రతాప్ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన పేరు కూడా కాంగ్రెస్ అధిష్టానంకు పంపామని గుర్తు చేశారు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి....అనంతరం లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా వరంగల్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఆ క్రమంలో అధికార టీఆర్ఎస్ శుక్రవారం అభ్యర్థిని ప్రకటించింది. అలాగే టీడీపీ,బీజేపీ పోత్తు నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్న సంగతి తెలిసిందే. -
నిరాశే మిగిలింది
కేంద్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల అసంతృప్తి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో శనివారం ప్రవేశపెట్టిన 2015-16 సాధారణ బడ్జెట్‌పై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు అవుతాయని ఆశగా ఉన్న ప్రజలకు బడ్జెట్ చూసి నిరాశ చెందారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లాను స్మార్ట్ జిల్లాగా మారుస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కనీస వనరులపై కూడా దృష్టిసారించకపోవడంపై పెదవి విరిచారు. ఆదాయ పన్ను మినహాయింపు పెంచకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. - పాలకొండ ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేదు మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టినప్పటికీ ఆశిం చిన స్థాయిలోలేదు. రాజ దాని నిర్మాణానికి ఎటువంటి కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించడం దారుణం. విభజన చట్టంలో ఉండే అంశాలకు తక్కువ నిధులు కేటాయించడం దారుణం. వ్యవసాయరంగాన్ని విస్మరించడం దారుణం. బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేది శూన్యం. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. - ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర విభజనకు కారణమైన టీడీపీ నవ్యాంధ్ర నిర్మాణం కోసం నిధు లు రాబట్టడంలో, ప్రత్యేకహోదాను తెప్పించుకోవడంలో గానీ పూర్తిగా విఫలం చెందింది. రాష్ట్ర విభజన వల్ల కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం రూ. 16 వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉంది. లోటు భర్తీకి కావాల్సిన నిధులు విడుదల చేయించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడం దారుణం. - రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు వేతనదారులు, మధ్య తరగతి వారి నడ్డివిరిచే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వేతనదారులు, మధ్యతరగతి ప్రజానీకం నడ్డి విరిచేదిగా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరిగినప్పటికీ పన్ను పరిమితి పెరగకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఆర్థిక పరిస్థితి ఆగమ్మగోచరం అవుతుంది. పన్ను పరిమితి రూ.2.50 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పొదుపు పరిమితి రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షలకు పెంచితే బాగుండేది. వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలకు ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించక పోవడం దారుణం. - మజ్జి చినబాబు, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పేదలకు అన్యాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాధారణ బడ్జెట్లో పేద ప్రజలకు అన్యాయం జరిగింది. కార్పొరేట్ వర్గాలు, ధనికులకు కొమ్ముకాసేలా బడ్జెట్ ఉంది. రెండు రోజుల క్రితం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లోను, ఇప్పటి సాధారణ బడ్జెట్‌లోను ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే జరిగింది. మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పింది. - కలమట వెంకటరమణ, ఎమ్మెల్యే, పాతపట్నం అన్ని వర్గాలకు నిరాశే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాలకు నిరాశే మిగిలింది. ప్రధానంగా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఆ దిశగా చర్యలు లేవు. రైతుల కోసం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు లేవు. సాగునీటి వనరుల ప్రస్తావన లేదు. కొత్తగా విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు కోసం నిధుల కేటాయింపులు లేవు. బడ్జెట్ కేటాయింపులు కేవలం కార్పొరేట్‌కు అనుకూలంగా ఉంది. - విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ వ్యవసాయ రంగాన్ని విస్మరించారు కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకే అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణం. పేద, మధ్యతరగతి వారిని నిరుత్సాహ పరిచింది. కార్పొరేట్ల సహకారంతో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం వారి రుణం తీర్చుకునే విధంగా నిధులు కేటాయింపు ంది. - కె.మోహనరావు, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి సాగునీటి ప్రాజెక్టుల మాటే లేదు బడ్జెటలో సాగునీరు ప్రాజెక్టుల మాటే లేదు. ఇప్పటికే మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పనులు పూర్తికాక సగంలో నిలిచిపోయాయి. వాటిపై కనీసం నోరెత్తిన వారే లేరు. నదులు అనుసంధానానికి, సాగునీరు అందించే విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం. - చాపర సుందర్‌లాల్, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎటువంటి ప్రయోజనం లేదు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆదాయపన్ను పరిమితి గతంలో రూ. రెండున్నర లక్షలు ఉండేది. ప్రస్తుత బడ్జెట్లో ఎటువంటి మార్పు చేయకపోవడం వలన పన్ను భారం అందరిపైనా పడే అవకాశం ఉంది. - హనుమంతు సాయిరాం, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విభజన నష్టం పూడ్చే చర్యలు లేవు రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదాతో బడ్జెట్లో నిధుల కేటాయింపులు భారీగా ఉంటాయని అందరూ అశించారు. బీహర్, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాలతో పాటు ఆర్థిక ప్యాకేజీ అందజేస్తామని ప్రభుత్వం భావించటం న్యాయం కాదు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించక పోవటం అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. -ప్రొఫెసర్ గుంటతులసీరావు, ప్రిన్సిపాల్, బీఆర్‌ఏయూ పోలవరానికి పూర్తి నిధులు కేటాయించాల్సింది జాతీయ హోదా కల్పించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు సైతం కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు సరిపడవు. ప్రాజెక్టుకు రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాల్సింది. - తమ్మినేని కామరాజు, విభాగాధిపతి, బీఆర్‌ఏయూ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉంది. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రజలు ఆధార పడ్డ ప్రాథమిక రంగంపై నిర్లక్ష్యం తగదు. -బిడ్డిక అడ్డయ్య,అర్థశాస్త్ర విభాగాధి పతి, బీఆర్‌ఏయూ సంక్షేమ పథకాలు ఉండవు కేంద్ర బడ్జెట్ చూస్తే భవిష్యత్‌లో సంక్షేమ పథకాలు ఉండవనే నుమానం కలుగుతోంది. అరుణ్‌జైట్లీ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం పూర్తిగా రాయితీలు ఎత్తేసే దిశగా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం పూడ్చే చర్యలు కనీసం చేపట్టలేదు. - గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు బడ్జెట్లో సంక్షేమ పథకాల కంటే సంస్కరణ లకు ప్రాధాన్యమిచ్చారు. అర్థిక సంస్కరణలు అమలైతే ద్రవ్యలోటు తగ్గి అర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. - వి.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అర్థశాస్త్రం, బీఆర్‌ఏయూ సంతృప్తికరంగా లేదు బడ్జెట్ ్ల సంతృప్తి పరచలేదు. బంగారంపై సుంకం పెంచారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా కనీసం రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమకూర్చుకోలేకపోవడం చేతకానితనానికి నిదర్శనం. - మండవిల్లి రవి, వ్యాపారవేత్త -
ఎమ్మెల్యేలూ! ఎలుగెత్తండి!
పదవులు చేపట్టి ఆరు నెలలైనా.. నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు.. ఎన్నికల ప్రచారం నాటి చురుకుదనంలో వందోవంతు చూపడం లేదని జిల్లా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలేమో నియోజకవర్గ నిధులు విడుదల కాకపోవడంతో ఏ పనులూ చేపట్టలేకపోతున్నా అంటున్నారు. నిధుల గోల తమకెందుకంటున్న జనం పేరుకుపోయిన సమస్యల్లో కొన్నింటికైనా పరిష్కారం లభించాలని ఆశిస్తున్నారు. గురువారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన సమస్యలను ప్రస్తావించాలని, తమ వాణిని వినిపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను ప్రజల తరఫున ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలని ‘సాక్షి’ సంకల్పించింది. ప్రజలకు వారిచ్చిన హామీల్ని గుర్తు చేసి, నెరవేర్చేలా చేయాలన్న ప్రయత్నమే ఇది.. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో విస్తరణ శిక్షణా కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, కోళ్ల వ్యాక్సిన్ సెంటర్ ఉండటం వల్ల వీటికి అనుబంధంగా వ్యవసాయ విశ్యవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. ఇందుకు అనువుగా విస్తరణ శిక్షణా కేంద్రానికి 100 ఎకరాలు భూమి ఉంది. మెట్ట ప్రాంత రైతుల కోసం ఏర్పాటైన దుంప పరిశోధన కేంద్రాన్ని తిరిగి పెద్దాపురం తీసుకు రావాలనేది ఇక్కడి రైతుల డిమాండ్. అందుకు ఆయన హామీ ఇచ్చారు కూడా. మెట్ట ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న ఏలేరు ఆధునికీకరణ పనులు ప్రారంభించేలా ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో ప్రస్తావించాలని మెట్ట రైతులు కోరుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో సుమారు రూ.130 కోట్లతో శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగని వైనాన్ని ఎత్తిచూపాలంటున్నారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాధారంగా రైతులు పండించే కర్రపెండలానికి రుణమాఫీ వర్తింపజేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ హయాంలో ఏటిగట్ల ఆధునికీకరణకు సుమారు రూ.100 కోట్లు విడుదల చేయగా ఆయన మరణానంతరం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఆ పనులు పరుగులుపెట్టేలా అసెంబ్లీలో ఎలుగెత్తాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ప్రజలు కోరుతున్నారు. కొత్తపేటలో నిలిచిపోయిన బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి, ఆత్రేయపురం మండలం పేరవరం, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలకు నిధులు రాబట్టాలని రైతులు కోరుతున్నారు. తుని నియోజకవర్గంలో హుద్ హుద్ తుపాను పంటనష్టం పరిహారం జాబితా అవకతవకలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అసెంబ్లీలో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నేతలు, వారి అనుచరులు వరి పంటను అరటి తోటలుగా నమోదు చేసి పరిహారం మెక్కేందుకు ప్రయత్నిస్తున్న వైనాన్ని చాటాలనుకుంటున్నారు. కాగా తాండవలో అనుమతి లేకుండా జరుగుతున్న ఇసుక దందాను కూడా ప్రస్తావించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అసెంబ్లీలో ప్రయత్నించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజనులకు 2009లో అటవీ హక్కులు కల్పిస్తూ అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి అటవీహక్కుల చట్టం అమలులోకి తెచ్చారు. కానీ వెదురును నరుక్కుని అమ్ముకునే హక్కులకు అటవీ అధికారులు అడ్డుకుంటున్న విషయాన్ని ప్రస్తావించాలని గిరిజనులు కోరుతున్నారు. అమలాపురం గ్రేడ్-1 మున్సిపాలిటీకి గత ప్రభుత్వం రూ.100 కోట్లతో 30ఏళ్ల కాలానికి ఉపయోగపడేలా మంజూరు చేసిన బృహత్తర తాగునీటి ప్రాజెక్టు పెండింగ్‌లో పడింది. ఎన్నికల్లో తాగునీటి ప్రాజెక్టుకు నిధులు తెస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనందరావు ఆర్నెళ్లయినా ఆ ఊసెత్త లేదు. అసెంబ్లీలో ప్రస్తావించైనా నిధులు రాబట్టాలని కోరుతున్నారు. ఓడలరేవులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రూ.3 కోట్ల జెట్టీ నిర్మాణం గురించీ ఎలుగెత్తాలంటున్నారు. పుష్కరాలకు సిద్ధమవుతున్న రాజమండ్రి నగరంలో రూ.500 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మించి ట్రీట్మెంటు చేసిన మురుగు నీటిని మంచినీటి ఇన్‌టేక్ వెల్లకు దూరంగా ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో గోదావరిలో కలపాలని కోరుతున్నారు. కార్పొరేషన్లో 21 గ్రామాల విలీనానికి అనుకూలంగా గత ఏడాది కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ పని చూడాల్సి ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోకి వచ్చే తొమ్మిది డివిజన్లలో మురుగు కాలువల సమస్యను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రస్తావించాల్సి ఉంది. కడియం నర్సరీలకు ఉచిత విద్యుత్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడాది పాటు కొనసాగగా, అదే తీరులో ఇప్పుడు కూడా ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లోని 35 వేల ఎకరాలకు సాగు నీరందించే చాగల్నాడు ఎత్తిపోతల పథకంపై ఇద్దరు ఎమ్మెల్యేలూ అసెంబ్లీలో ప్రస్తావించాలని రైతులు కోరుతున్నారు. మరమ్మతులకు ప్రతిపదించిన రూ.9.25 కోట్లు విడుదల చేసేలా ప్రయత్నించాలని కోరుతున్నారు. గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పామాయిల్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు ప్రయోజనం కల్పించే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్థల వివాదాన్ని పరిష్కరించి, 300 ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వాన్ని కోరాలంటున్నారు. రామచంద్రపురం పట్టణంలో 17 వేల కుటుంబాలకు చెందిన 50 వేల మందికి తాగునీరందించేలా రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన వెల్ల రక్షిత మంచినీటి పథకానికి నిధులు రాబట్టే విషయాన్ని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. మండపేటలో సుమారు 8 వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కేటాయించి 172 ఎకరాలను రూ. 20 కోట్ల వ్యయంతో చదును చేయాల్సి ఉంది. తమ సొంతింటి కల నెరవేర్చేందుకు అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యే జోగేశ్వరరావును పేదలు కోరుతున్నారు. రాజమండ్రి-కాకినాడ రోడ్డుపై ద్వారంపూడి వద్ద రూ.32 కోట్లతో చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రాజోలు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్, డ్రైనేజీ ఆధునికీకరణ పనుల పూర్తిపై అసెంబ్లీలో చర్చించేందుకు అక్కడి ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రయత్నిస్తున్నారు. రూ.200 కోట్లపెండింగ్ పనుల పూర్తికి, సఖినేటిపల్లి- నర్సాపురం వంతెన పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే కృషి చేయాలని జనం కోరుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తీరప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్న కర్మాగారాల కాలుష్యంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే అనంతలక్ష్మి ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. ఊకతో నడుస్తున్న కర్మాగారాలన్నింటినీ గ్యాస్ ఆధారితంగా మార్చేందుకు కృషి చేయాలంటున్నారు. తమ్మవరంలో ఏపీఐఐసీ సేకరించిన ో 295 ఎకరాలకు నష్టపరిహారం ఇప్పించేందుకు లేదా తమకు తిరిగి ఇచ్చేసేందుకు ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు. పి.గన్నవరం నియోజక వర్గంలో గోదావరి నదీపాతం నివారణపై ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి గళం వినిపించాలని గోదావరి పరివాహక ప్రాంతాలు కోరుతున్నాయి. వరదల సమయంలో లంక గ్రామాలకు ముంపు సమస్య నుంచి మోక్షం కల్పించేందుకు వంతెనలతో పాటు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి నిధుల కోసం ఒత్తిడి తీసుకురావాలంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పిఠాపురం బ్రాంచి కెనాల్ ఆధునికీకరణ చేపట్టేలా అసెంబ్లీలో ఎమ్మెల్యే వర్మ ప్రస్తావించాలని రైతులు కోరుతున్నారు. ఉప్పాడ వద్ద తీరంలో రక్షణగోడ పూర్తిస్థాయిలో నిర్మాణానికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటున్నారు.కాకినాడ నగరంలో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు రాబట్టాలంటున్నారు. బ్రిటిష్ కాలం నాటి మంచినీటి పైపులైన్ల మార్పునకు కృషి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ హయాంలో తలపెట్టిన అన్నంపలి అక్విడెక్టు పూర్తికి నిధులు రాబట్టేలా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు తన వాణిని అసెంబ్లీలో వినిపించాలని రైతులు కోరుతున్నారు. గోదావరిపై గోగుల్లంక -గుత్తులదీవి మధ్య వంతెన నిర్మాణానికి నిధులు రాబట్టే బాధ్యత కూడా ఆయనపై ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పుష్కర కాలువల కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకూ నీరందించే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కోరుతున్నారు. అలాగే సుబ్బారెడ్డిసాగర్ కింద కాలువలు అభివృద్ధి చేయించాలని కోరుతున్నారు. -
వాళ్లకెందుకు ఇష్టం లేదు ?
భారత్‌తో వన్డే సిరీస్‌పై శ్రీలంక సీనియర్ క్రికెటర్ల అసంతృప్తి వెస్టిండీస్ జట్టు భారత్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన కొన్ని గంటలకే బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఖరారు చేసింది. ఈ రెండు బోర్డుల మధ్య ఉన్న స్నేహం దృష్ట్యా లంక బోర్డు కూడా వెంటనే ఒప్పుకుంది. కానీ శ్రీలంక సీనియర్ క్రికెటర్లు మాత్రం ఈ పర్యటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సాక్షి క్రీడా విభాగం శ్రీలంక జట్టు భారత్‌లో ఇప్పుడు వన్డేలు ఆడటం వల్ల ఇటు బీసీసీఐకి అటు లంక బోర్డుకు కూడా లాభమే. ఇప్పుడు సిరీస్ ఆడినందుకు ప్రతిఫలంగా వచ్చే ఏడాది ఆ దేశంలో టెస్టులు ఆడేందుకు బీసీసీఐ అంగీకరించింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న లంక బోర్డుకు భారత్‌తో సిరీస్‌ను నిర్వహిస్తే చాలా లాభం. ఇటు వెస్టిండీస్ వెళ్లిపోయినందున... శ్రీలంక ఐదు వన్డేలు ఆడటం వల్ల ప్రసారదారులకు ఒప్పందం ప్రకారం మ్యాచ్‌లు ఇచ్చే అవకాశం బీసీసీఐకి దక్కింది. అయితే ఈ సిరీస్ ఖరారయ్యే సమయానికి కండిషనింగ్ క్యాంప్‌లో ఉన్న శ్రీలంక క్రికెటర్లకు మాత్రం ఇది నచ్చలేదు. స్వదేశంలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలతో ఆడిన సిరీస్‌లలో శ్రీలంక ఫీల్డింగ్ చాలా దారుణంగా ఉంది. అదే సమయంలో చాలామంది క్రికెటర్లు చిన్న చిన్న గాయాలతో బాధపడుతున్నారు. ప్రపంచకప్‌కు సమాయత్తం కావడం కోసం శ్రీలంక కొత్త కోచ్ ఆటపట్టు ఒక ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆరువారాల పాటు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్నెస్ మీద క్యాంపులో ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. భారత్‌తో సిరీస్ కోసం ఈ శిబిరాన్ని అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వస్తోంది. ‘ఒక నెల రోజుల పాటు చేయాల్సిన పనిని ఇప్పుడు వారం రోజుల్లోనే చేయాల్సి వస్తోంది. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన మా సన్నాహాలకు ఇది విఘాతం కలిగిస్తోంది. మా బోర్డు ఆటగాళ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా భారత్‌తో సిరీస్‌ను ఒప్పుకుంది’ అంటూ సీనియర్ ఆటగాడు సంగక్కర బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు ముందు 19 వన్డేలు శ్రీలంక జట్టు ప్రపంచకప్ కోసం మంచి షెడ్యూల్‌నే రూపొందించుకుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు వన్డేలు ఆడనుంది. అలాగే ప్రపంచకప్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన న్యూజిలాండ్ వెళ్లి మరో ఏడు వన్డేలు ఆడుతుంది. ఈ 14 వన్డేలతో తాము పూర్తిస్థాయిలో సిద్ధం అవుతామని భావించారు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఐదు వన్డేలువచ్చాయి. దీంతో మొత్తం 19 వన్డేలు అయ్యాయి. ‘ప్రపంచకప్‌కు ముందు 14 వన్డేలు ఆడటమే చాలా ఇబ్బంది. ఇక 19 వన్డేలు ఆడితే పూర్తిగా అలసిపోతారు. ఈ సిరీస్ లేకపోతేనే బాగుండేది’ అని మరో సీనియర్ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత్‌తో శ్రీలంక రికార్డు చాలా పేలవంగా ఉంది. మళ్లీ ఇప్పుడు సన్నాహాలు సరిగా లేకుండా ఆడటం ఇబ్బందే అనేది కెప్టెన్ మాథ్యూస్ అభిప్రాయం. ‘ఇంత తక్కువ సమయంలో భారత్‌లాంటి జట్టుతో సిరీస్ ఆడటం చాలా కష్టం’ అని మాథ్యూస్ అన్నాడు. పూర్తి జట్టు రావాల్సిందే! అయితే ఈ సిరీస్ కోసం కొంతమంది సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాలనే సూచన ఆటగాళ్ల నుంచి వచ్చింది. కానీ దీనికి లంక బోర్డు ఒప్పుకోలేదు. ‘దిల్షాన్, సంగక్కర, జయవర్ధనే ముగ్గురూ ప్రపంచకప్‌కు చాలా కీలకం. ఆ పర్యటన సమయానికి వీళ్లు మంచి ఫిట్నెస్తో ఉండాలి. కాబట్టి వీళ్లకు విశ్రాంతి ఇస్తే బాగుంటుంది’ అని ఓ సెలక్టర్ సూచించారు. కానీ ఈ ముగ్గురూ లేకుండా భారత్‌కు జట్టును పంపితే అది ద్వితీయ శ్రేణి జట్టే అవుతుంది. స్పాన్సర్లకు ఆసక్తి ఉండదు. కాబట్టి బీసీసీఐ దీనికి అంగీకరించదు. దీనిని దృష్టిలో ఉంచుకుని లంక క్రికెట్ బోర్డు పూర్తి స్థాయిలో సీనియర్ జట్టునే పంపిస్తోంది. మలింగ గాయం కారణంగా అందుబాటులో లేడు. హెరాత్‌కు మాత్రం విశ్రాంతి ఇచ్చారు. అయితే సీనియర్లకు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే ఏడు వన్డేల సిరీస్‌లో అవసరమనుకుంటే విశ్రాంతి ఇస్తామని లంక బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీనియర్లు కాస్త మెత్తబడ్డారు. స్నేహం కొనసాగాలి ఆటగాళ్లలో అసంతృప్తి ఉన్నా భారత్‌తో మంచి సంబంధాలు ఉండాలని శ్రీలంక బోర్డు కోరుకుంటోంది. ఇందులో తప్పేంలేదు. వాళ్లకు ఉన్న ఆర్థిక సమస్యల దృష్ట్యా... బీసీసీఐతో ఎంత సన్నిహితంగా ఉంటే అంత మంచిది. ‘1996 ప్రపంచకప్‌కు ముందు కొన్ని దేశాలు శ్రీలంకలో క్రికెట్ ఆడేందుకు రాలేదు. ఆ సమయంలో భారత్ తమ క్రికెటర్లను ఇక్కడికి పంపించి ఆడించింది. కాబట్టి వెస్టిండీస్ వెళ్లిపోయిన లోటును భర్తీ చేయడం ద్వారా మేం కొంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అని శ్రీలంక బోర్డు అధికారి ఒకరు చెప్పారు. అయితే 1996లో శ్రీలంకలో క్రికెట్ ఆడేందుకు భారత్‌తో పాటు పాకిస్థాన్ క్రికెటర్లు కూడా వెళ్లారు. అజహరుద్దీన్ సార థ్యంలో పాక్, భారత్ ఆటగాళ్లు కలిసి ఒక జట్టుగా ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. శ్రీలంకలో భద్రత సమస్యలు లేవని చెప్పేందుకు దీనిని నిర్వహించారు. అయితే మరి అప్పుడు సాయం చేసిన పాక్... ఇప్పుడు ఎన్నిసార్లు రమ్మని పిలిచినా శ్రీలంక ఆ దేశం వైపు చూడటం లేదు. వెళ్లే సాహసం చేయడం లేదు. మరి పాక్ రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదా? అని లంక పత్రికలు ఆ దేశ బోర్డును విమర్శించాయి. కారణాలు ఏవైనా... ఎవరికి ఇష్టం లేకపోయినా భారత్‌తో శ్రీలంక ఐదు వన్డేలు ఆడటం ఖాయం. ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో భారత్ జట్టు ఆడబోయే ఆఖరి సిరీస్ ఇది. దీనిలో గెలవడం చాలా అవసరం. వెస్టిండీస్‌తో పోలిస్తే శ్రీలంక మెరుగైన జట్టు. కాబట్టి మన యువ జట్టు సత్తాకు ఈ సిరీస్ పరీక్షే అనుకోవాలి. -
అంగన్వాడీల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల పని తీరుపై కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌తో పాటూ మిగిలిన సందర్భాల్లోనూ వస్తున్న అంగన్వాడీల పనితీరు సక్రమంగా లేవనే ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని.. అసలు సీడీపీఓలు ఏం చేస్తున్నారని ఐసీడీఎస్ పీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. క్షేత్ర పర్యటనలు పెంచి సక్రమంగా పని చేయని అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తన చాంబర్లో ఏజేసీ నాగేశ్వరరావుతో కలిసి ఐసీడీఎస్ అధికారుల తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామా ల్లో కేంద్రాలను సక్రమంగా తెరవడం లేదని, సరుకులు అందించడంలో విఫలమవుతున్నార ని వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిం చాలని ఆదేశించారు. ఇకపై అటువంటి ఫిర్యాదులు వస్తే సీడీపీఓలపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లల హాజరుతో పాటు బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంగన్ వాడీలు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించి న వారిపై వేటు వేయాలన్నారు. నాబార్డు ఆర్ఐడీఎఫ్ కింద మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు 171భవనాలు మంజూ రు కాగా కేవలం 121 భవనాలు మాత్రమే గ్రౌండ్ అవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఈఈ వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ తక్షణమే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాంభం కాని భవనాలను మార్చిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు పూర్తి చేయాలి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కింద మంజూరైన పాఠశాలల అదనపు తరగతుల గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం పలుశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభం కాని నాలుగు భవనాలు పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి సిద్ధం చేయాలని డీఈఓ కృష్ణారావును ఆదేశించారు. 331 వంట గదులు మంజూరు కాగా కేవలం 13 మాత్రమే పూర్తి కావడంపై పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాల విషయమై జనవరి 9లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. 86 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టడానికి రూ1.87కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిధులతో నిర్మిత భవనాల ప్రగతి పర్యవేక్షించాలని సబ్‌కలెక్టర్ శ్వేతామహంతికి సూచించారు. కాగా, ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల నిర్మాణానికి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఆమోదం తెలిపింది. పాచిపెంట, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి నియోజక వర్గ కేంద్రాల్లో వీటిని నిర్మించనున్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సోషల్వెల్ఫేర్ డీడీ ఆదిత్యలక్ష్మి పాల్గొన్నారు.