కేంద్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో శనివారం ప్రవేశపెట్టిన 2015-16 సాధారణ బడ్జెట్‌పై జిల్లా వాసులు
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు అవుతాయని ఆశగా ఉన్న ప్రజలకు బడ్జెట్ చూసి నిరాశ చెందారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో
జిల్లాను స్మార్ట్ జిల్లాగా మారుస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కనీస వనరులపై కూడా దృష్టిసారించకపోవడంపై పెదవి విరిచారు. ఆదాయ పన్ను మినహాయింపు పెంచకపోవడంపై
ఉద్యోగులు మండిపడుతున్నారు. - పాలకొండ
ఆశించిన స్థాయిలో బడ్జెట్ లేదు
మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టినప్పటికీ ఆశిం చిన స్థాయిలోలేదు. రాజ దాని నిర్మాణానికి ఎటువంటి కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించడం దారుణం. విభజన చట్టంలో ఉండే అంశాలకు తక్కువ నిధులు కేటాయించడం దారుణం. వ్యవసాయరంగాన్ని విస్మరించడం దారుణం. బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒరిగేది శూన్యం. బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
- ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది
రాష్ట్ర విభజనకు కారణమైన టీడీపీ నవ్యాంధ్ర నిర్మాణం కోసం నిధు లు రాబట్టడంలో, ప్రత్యేకహోదాను తెప్పించుకోవడంలో గానీ పూర్తిగా విఫలం చెందింది. రాష్ట్ర విభజన వల్ల కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం రూ. 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉంది. లోటు భర్తీకి కావాల్సిన నిధులు విడుదల చేయించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకపోవడం దారుణం.
- రెడ్డి శాంతి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
వేతనదారులు, మధ్య తరగతి వారి నడ్డివిరిచే బడ్జెట్
కేంద్ర బడ్జెట్ వేతనదారులు, మధ్యతరగతి ప్రజానీకం నడ్డి విరిచేదిగా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరిగినప్పటికీ పన్ను పరిమితి పెరగకపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఆర్థిక పరిస్థితి ఆగమ్మగోచరం అవుతుంది. పన్ను పరిమితి రూ.2.50 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, పొదుపు పరిమితి రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షలకు పెంచితే బాగుండేది. వ్యవసాయ కార్మికులకు, పేద ప్రజలకు ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించక పోవడం దారుణం.
- మజ్జి చినబాబు, వైఎస్‌ఆర్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
పేదలకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాధారణ బడ్జెట్‌లో పేద ప్రజలకు అన్యాయం జరిగింది. కార్పొరేట్ వర్గాలు, ధనికులకు కొమ్ముకాసేలా బడ్జెట్ ఉంది. రెండు రోజుల క్రితం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లోను, ఇప్పటి సాధారణ బడ్జెట్‌లోను ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే జరిగింది. మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పింది.
- కలమట వెంకటరమణ, ఎమ్మెల్యే, పాతపట్నం
అన్ని వర్గాలకు నిరాశే
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాలకు నిరాశే మిగిలింది. ప్రధానంగా జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఆ దిశగా చర్యలు లేవు. రైతుల కోసం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు లేవు. సాగునీటి వనరుల ప్రస్తావన లేదు. కొత్తగా విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు కోసం నిధుల కేటాయింపులు లేవు. బడ్జెట్ కేటాయింపులు కేవలం కార్పొరేట్‌కు అనుకూలంగా ఉంది.
- విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ
వ్యవసాయ రంగాన్ని విస్మరించారు
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకే అనుకూలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం దారుణం. పేద, మధ్యతరగతి వారిని నిరుత్సాహ పరిచింది. కార్పొరేట్ల సహకారంతో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం వారి రుణం తీర్చుకునే విధంగా నిధులు కేటాయింపు ంది.
- కె.మోహనరావు, రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి
సాగునీటి ప్రాజెక్టుల మాటే లేదు
బడ్జెటలో సాగునీరు ప్రాజెక్టుల మాటే లేదు. ఇప్పటికే మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పనులు పూర్తికాక సగంలో నిలిచిపోయాయి. వాటిపై కనీసం నోరెత్తిన వారే లేరు. నదులు అనుసంధానానికి, సాగునీరు అందించే విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం.
- చాపర సుందర్‌లాల్, సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు
ఎటువంటి ప్రయోజనం లేదు
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆదాయపన్ను పరిమితి గతంలో రూ. రెండున్నర లక్షలు ఉండేది. ప్రస్తుత బడ్జెట్‌లో ఎటువంటి మార్పు చేయకపోవడం వలన పన్ను భారం అందరిపైనా పడే అవకాశం ఉంది.
- హనుమంతు సాయిరాం, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు
విభజన నష్టం పూడ్చే చర్యలు లేవు
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ప్రత్యేక హోదాతో బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు భారీగా ఉంటాయని అందరూ అశించారు. బీహర్, పశ్చిమబెంగాళ్ వంటి రాష్ట్రాలతో పాటు ఆర్థిక ప్యాకేజీ అందజేస్తామని ప్రభుత్వం భావించటం న్యాయం కాదు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించక పోవటం అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.
-ప్రొఫెసర్ గుంటతులసీరావు, ప్రిన్సిపాల్, బీఆర్‌ఏయూ
పోలవరానికి పూర్తి నిధులు కేటాయించాల్సింది
జాతీయ హోదా కల్పించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు సైతం కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు సరిపడవు. ప్రాజెక్టుకు రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాల్సింది.
- తమ్మినేని కామరాజు, విభాగాధిపతి, బీఆర్‌ఏయూ
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం
కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉంది. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రజలు ఆధార పడ్డ ప్రాథమిక రంగంపై నిర్లక్ష్యం తగదు.
-బిడ్డిక అడ్డయ్య,అర్థశాస్త్ర విభాగాధి పతి, బీఆర్‌ఏయూ
సంక్షేమ పథకాలు ఉండవు
కేంద్ర బడ్జెట్ చూస్తే భవిష్యత్‌లో సంక్షేమ పథకాలు ఉండవనే నుమానం కలుగుతోంది. అరుణ్‌జైట్లీ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం పూర్తిగా రాయితీలు ఎత్తేసే దిశగా ప్రయత్నిస్తుంది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం పూడ్చే చర్యలు కనీసం చేపట్టలేదు.
- గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త
సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు
బడ్జెట్‌లో సంక్షేమ పథకాల కంటే సంస్కరణ లకు ప్రాధాన్యమిచ్చారు. అర్థిక సంస్కరణలు అమలైతే ద్రవ్యలోటు తగ్గి అర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
- వి.మల్లికార్జున రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అర్థశాస్త్రం, బీఆర్‌ఏయూ
సంతృప్తికరంగా లేదు
బడ్జెట్ ్ల సంతృప్తి పరచలేదు. బంగారంపై సుంకం పెంచారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా కనీసం రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమకూర్చుకోలేకపోవడం చేతకానితనానికి నిదర్శనం.
- మండవిల్లి రవి, వ్యాపారవేత్త
నిరాశే మిగిలింది
Published Sun, Mar 1 2015 12:29 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement