విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాల పని తీరుపై కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌తో పాటూ మిగిలిన సందర్భాల్లోనూ వస్తున్న అంగన్‌వాడీల పనితీరు సక్రమంగా లేవనే ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని.. అసలు సీడీపీఓలు ఏం చేస్తున్నారని ఐసీడీఎస్ పీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. క్షేత్ర పర్యటనలు పెంచి సక్రమంగా పని చేయని అంగన్‌వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో ఏజేసీ నాగేశ్వరరావుతో కలిసి ఐసీడీఎస్ అధికారుల తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామా ల్లో కేంద్రాలను సక్రమంగా తెరవడం లేదని, సరుకులు అందించడంలో విఫలమవుతున్నార ని వస్తున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిం చాలని ఆదేశించారు. ఇకపై అటువంటి ఫిర్యాదులు వస్తే సీడీపీఓలపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లల హాజరుతో పాటు బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. అంగన్ వాడీలు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించి న వారిపై వేటు వేయాలన్నారు.
నాబార్డు ఆర్‌ఐడీఎఫ్ కింద మంజూరైన అంగన్‌వాడీ భవన నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు 171భవనాలు మంజూ రు కాగా కేవలం 121 భవనాలు మాత్రమే గ్రౌండ్ అవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఈఈ వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ తక్షణమే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాంభం కాని భవనాలను మార్చిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
భవన నిర్మాణాలు పూర్తి చేయాలి
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ కింద మంజూరైన పాఠశాలల అదనపు తరగతుల గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం పలుశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభం కాని నాలుగు భవనాలు పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి సిద్ధం చేయాలని డీఈఓ కృష్ణారావును ఆదేశించారు. 331 వంట గదులు మంజూరు కాగా కేవలం 13 మాత్రమే పూర్తి కావడంపై పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థలాల విషయమై జనవరి 9లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. 86 పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టడానికి రూ1.87కోట్లు మంజూరైనట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన తహశీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిధులతో నిర్మిత భవనాల ప్రగతి పర్యవేక్షించాలని సబ్‌కలెక్టర్ శ్వేతామహంతికి సూచించారు. కాగా, ఎస్సీ ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల నిర్మాణానికి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఆమోదం తెలిపింది. పాచిపెంట, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి నియోజక వర్గ కేంద్రాల్లో వీటిని నిర్మించనున్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, సోషల్‌వెల్ఫేర్ డీడీ ఆదిత్యలక్ష్మి పాల్గొన్నారు.
అంగన్‌వాడీల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి
Published Thu, Dec 19 2013 3:21 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement