ఈ ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివి | Union Minister Venkaiah Naidu Statement on Currency issue | Sakshi
Sakshi News home page

ఈ ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివి

Published Sat, Nov 19 2016 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

ఈ ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివి - Sakshi

ఈ ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివి

‘నోట్ల’ రద్దుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వాఖ్యలు

 సాక్షి, బెంగళూరు: దేశాభివృద్ధికి ప్రధాన సమస్యగా మారిన నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందులు ప్రసవ వేదన లాంటివని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు.

ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా భవిష్యత్‌లో ఈ నిర్ణయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు.  ’నల్లధనం నియంత్రణ’ అనే అంశంపై బెంగళూరులోని భారతీయ విద్యాభవన్‌లో శుక్రవారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లధనంపై మోదీ నేతృత్వంలోని కేంద్రం యుద్ధం ప్రారంభించిందన్నారు. దీని వల్ల మొదట్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నా క్రమంగా వీటి ఫలితాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. పెద్దనోట్ల రద్దు రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement