ఈ-కామర్స్కు ‘నోటు’ పోటు
• క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల తాత్కాలిక నిలిపివేత..
• నియంత్రణల విధింపు
న్యూఢిల్లీ: మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ-కామర్స్ కంపెనీల వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు నగదు రూపంలో చెల్లింపులు (సీఓడీ) చేసే ఆర్డర్ల డెలివరీకి బ్రేక్ పడింది. అమెజాన్, పేటీఎం తదితర ఆన్‌లైన్ విక్రయ సంస్థలు సీఓడీ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారుు. అరుుతే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి మరికొన్ని సంస్థలు సీఓడీ ఆర్డర్ విలువపై పరిమితులు విధించారుు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం ఈ-కామర్స్ లావాదేవీల్లో 70 శాతం నగదు రూపంలోనే జరుగుతున్నారుు.
దీనిబట్టి చూస్తే, పెద్ద నోట్ల రద్దు ఉదంతం ఈ కంపెనీలకు కొంతకాలంపాటు ఎదురుదెబ్బేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘కొత్త ఆర్డర్లకు సంబంధించి క్యాష్ చెల్లింపులను తాత్కాలికంగా ఆపేశాం. అరుుతే, మంగళవారం(8న) అర్థరాత్రికి ముందు సీఓడీ ఆర్డర్‌ను చేసిన కస్టమర్లకు మాత్రం డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా చెల్లుబాటు అయ్యే డినామినేషన్‌లలో మాత్రమే చెల్లింపులకు అనుమతిస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు సీఓడీ ఆర్డర్ల విలువను రూ.1,000; రూ.2,000కు మాత్రమే పరిమితం చేశారుు. అది కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లించాలని సూచించారుు. ఉబెర్, బిగ్‌బాస్కెట్‌లు కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లింపులు జరపాలని కోరారుు.