E-commerce company
-
ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్‌పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
కొత్త ఈ-కామర్స్ కంపెనీ.. చవకా.. వీక్నెస్ పట్టేశారు!
దేశంలో సగటు కస్టమర్ల బలహీనతను కంపెనీలు పట్టేస్తున్నాయి. ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఈ-కామర్స్ విభాగాలను తెరుస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా "బజార్" అనే పేరుతో కొత్త చవక ఉత్పత్తుల విభాగాన్ని పరిచయం చేసింది. ఈ వినూత్న విభాగం కస్టమర్లకు అతి తక్కువ ధరలలో అన్‌బ్రాండెడ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తుంది. భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలు, ప్రాధాన్యతలను తీరుస్తుంది. ఈ కొత్త వెంచర్ ఇప్పుడు అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఈ-కామర్స్ దిగ్గజం రూ. 600లోపు ధర కలిగిన దుస్తులు, వాచీలు, బూట్లు, ఆభరణాలు, బ్యాగ్‌లతో సహా బ్రాండెడ్ ఉత్పత్తులను జాబితా చేయడానికి విక్రేతలను ఆన్‌బోర్డింగ్ చేసింది. వీటిని ఆర్డర్ చేసే ప్రైమ్ సభ్యులకు 4-5 రోజుల్లోనే డెలివరీ చేయనుంది. సాధారణంగా చవకైన ఉత్పత్తుల డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. ‘బజార్’ పరిచయాన్ని అమెజాన్ ఇండియా ప్రతినిధి ధ్రువీకరించారు. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, భారతదేశం అంతటా ఉన్న తయారీ కేంద్రాల నుండి విక్రేతలు అందించే ఫ్యాషన్, ఇతర వస్తువులను తక్కువ ధరలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. దేశంలో ఇప్పటికే ఇలాంటి లోకాస్ట్ ఈ-కామర్స్ సంస్థలు కొన్ని ఉన్నాయి. చవక ధర ఉత్పత్తులను విక్రయించడానికి మరో దిగ్గజ ఆన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కూడా షాప్సీ (Shopsy) పేరుతో వేరే యాప్‌ని నిర్వహిస్తుంది. దీంతోపాటు లోకాస్ట్ ఈ-కామర్స్ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న సాఫ్ట్‌బ్యాంక్-మద్దతు గల మీషోతోనూ అమెజాన్ బజార్ పోటీపడనుంది. -
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన కంపెనీ.. భారీ ఫైన్‌తో తిక్కకుదిరింది!
ఉద్యోగులపై అతి నిఘా పెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఫ్రాన్స్ గోప్యతా రక్షణ సంస్థ భారీ జరిమానా విధించింది. తమ వేర్‌హౌస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరు, కార్యాచరణను పర్యవేక్షించడానికి అత్యంత అనుచిత వ్యవస్థను ఉపయోగించినందుకు అమెజాన్‌పై 35 మిలియన్ డాలర్ల (రూ.290 కోట్లు) జరిమానా విధించింది. అమెజాన్ ఉపయోగిస్తున్న మానిటరింగ్ సిస్టమ్ ఫ్రాన్స్ లాజిస్టిక్ విభాగంలోని మేనేజర్లను ఉద్యోగులను చాలా దగ్గరగా పర్యవేక్షించడానికి అనుమతించిందని, ఇది యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన గోప్యతా ప్రమాణాలను ఉల్లంఘించిందని ఫ్రెంచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (CNIL) తన వెబ్సైట్లో పేర్కొంది. "స్టౌ మెషిన్ గన్" అని పిలిచే స్కానర్లతో ఉద్యోగులను పర్యవేక్షిస్తోంది. ఉద్యోగులు ఈ స్కానర్ల ద్వారా పార్సిళ్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పార్సిళ్లను చాలా త్వరగా అంటే 1.25 సెకన్ల కంటే తక్కువ సమయం చేస్తే వారి పనితీరులో లోపంగా కంపెనీ గుర్తిస్తోంది. ఈ పర్యవేక్షణ పద్ధతి ఉద్యోగి ఉత్పాదకతను, పని అంతరాయాలను కొలవడానికి ఉపయోగిస్తున్నారని సీఎన్ఐఎల్ ఆరోపిస్తోంది. అటువంటి వ్యవస్థను సెటప్ చేయడం యూరోపియన్ యూనియన్ గోప్యతా నియమాల ప్రకారం చట్టవిరుద్ధమని సీఎన్ఐఎల్ వాదిస్తోంది. అయితే ఈ వాదనలను అమెజాన్ తోసిపుచ్చింది. సీఎన్ఐఎల్ చేసిన ఆరోపణలతో తాము తీవ్రంగా విభేదిస్తున్నామని, అప్పీల్ ఫైల్ చేసే హక్కు తమకు ఉందని తెలిపింది. "వేర్‌హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లు పరిశ్రమ ప్రమాణాలు, కార్యకలాపాల భద్రత, నాణ్యత సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, సమయానికి, కస్టమర్ అంచనాలకు అనుగుణంగా ప్యాకేజీల నిల్వ, ప్రాసెసింగ్‌ను ట్రాక్ చేయడానికి అవసరమైనవి" అని అమెజాన్ తన ప్రకటనలో వివరించింది. -
అమెజాన్‌తో వాణిజ్య శాఖ ఒప్పందం
న్యూఢిల్లీ: దేశీయంగా 20 జిల్లాల్లోని చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) శిక్షణ కలి్పంచే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇమేజింగ్, డిజిటల్ క్యాటలాగ్‌లను రూపొందించడం, పన్నుల సంబంధమైన అంశాలను తెలుసుకోవడం మొదలైన వాటికి ఈ శిక్షణ ఉపయోగపడగలదని పేర్కొంది. ఎగుమతుల హబ్‌లుగా గుర్తించిన జిల్లాల్లో అమెజాన్, డీజీఎఫ్టీ కలిసి శిక్షణ, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాల కోసం ఫ్లిప్‌కార్ట్, ఈబే, రివెక్సా, షిప్‌రాకెట్, షాప్‌క్లూస్ వంటి వివిధ ఈ–కామర్స్ సంస్థలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) చర్చలు జరుపుతున్నట్లు వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశీ సంస్థలు అంతర్జాతీయంగా మరిన్ని ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయి. 2030 నాటికి ఈ–కామర్స్ ద్వారా 350 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకోవాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి 2 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. ఎగుమతులను సరళతరం చేయడం, 2025 నాటికి ఈ–కామర్స్ ఎగుమతులను 20 బిలియన్ డాలర్లకు చేర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వాకంకర్ తెలిపారు. -
పండుగ సీజన్ కోసం 2.5 లక్షల ఉద్యోగాలు.. అట్లుంటది అమెజాన్తోని!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ( Amazon) పండుగ సీజన్ కోసం యూఎస్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది. కస్టమర్లకు ఉత్పత్తులు కొనుగోలు చేసిన మరుసటి రోజే డెలివరీని అందించే లక్ష్యంతో అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 2,50,000 యూఎస్ వర్కర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించింది. ఇది గత రెండేళ్లలో నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య కంటే 67 శాతం ఎక్కువ. హాలిడే సీజన్ కోసం అమెజాన్ దూకుడుగా వెళ్తుంటే మరోవైపు యూఎస్‌లోని ఇతర రిటైలర్ల ప్రణాళికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 2023 సంవత్సరంలో అమ్మకాలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో తమ స్టోర్లు, వేర్‌హౌస్‌లలో నియామకాలను తగ్గించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం హాలిడే అమ్మకాలు గత సంవత్సరం కంటే సగానికి చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) అమెరికన్ రిటైల్ సంస్థ ‘టార్గెట్’ అంచనా ప్రకారం, అమెజాన్ హాలిడే షాపింగ్ సీజన్ కోసం 1,00,000 మంది ఉద్యోగులను నియమించుకుంటోంది. టార్గెట్ సంస్థ కూడా అక్టోబర్‌లో కస్టమర్లకు డిస్కౌంట్లను అందించాలని ప్లాన్ చేస్తోంది. కాగా మరో యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంకా హాలిడే హైరింగ్ ప్లాన్లను ప్రకటించలేదు. 2022లో ఈ కంపెనీ 40,000 మంది సీజనల్ వర్కర్లను నియమించుకున్నట్లు రాయిటర్స్ నివేదించింది. సేమ్ డే డెలివరీల దిశగా అమెజాన్ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్లో 50 కొత్త ఫిల్‌ఫుల్‌మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు ఏర్పాటు చేసింది. అక్టోబర్ 10-11 తేదీల్లో ‘ఫాల్ ప్రైమ్’ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి భారీ నియామక ప్రణాళిక రావడం గమనార్హం. (Amazon Jobs: అమెజాన్ శుభవార్త! అలాంటి వారికి ట్రైనింగ్‌తోపాటు జాబ్స్..) అమెజాన్ నియమించుకునే కొత్త సీజనల్ వర్కర్లను ఆర్డర్ల ఎంపిక, క్రమబద్ధీకరణ, ప్యాకింగ్, షిపింగ్ పనులకు వినియోగిస్తారు. వీరికి ఎంపిక చేసిన ప్రదేశాలలో 1,000 నుంచి 3,000 డాలర్లు సైన్-ఆన్ బోనస్‌గా చెల్లించనున్నారు. సీజనల్ వర్కర్లకు వారి పని, లొకేషన్‌ను బట్టీ సగటున గంటకు 17 నుంచి 28 డాలర్లు చెల్లించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
మీషోలో 11 లక్షల మంది విక్రేతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ సంస్థ మీషోలో విక్రేతల సంఖ్య 11 లక్షల పైచిలుకు చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన ఎనిమిదేళ్లలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ (10 లక్షల) విక్రేతల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ డైరెక్టర్ ఉత్కర్‡్ష గర్గ్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరిలో 80 శాతం మంది ఆన్లైన్లో తొలిసారిగా విక్రయిస్తున్నవారేనని చెప్పారు. తెలంగాణ నుంచి దాదాపు 17,000 పైచిలుకు చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయని గర్గ్ తెలిపారు. సున్నా కమీషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో గతేడాది రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంలో విక్రేతల సంఖ్య 20 శాతం పెరిగిందని చెప్పారు. ప్రాంతీయంగా హోమ్..కిచెన్, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోందని గర్గ్ తెలిపారు. మీషోలో సెల్లర్ల వ్యాపారం గత రెండేళ్లలో 82 శాతం పెరిగినట్లు గర్గ్ వివరించారు. గతేడాది తాము 91 కోట్ల ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ రంగం 2030 నాటికి ఆరు రెట్లు పెరిగి 300 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు (ఎస్ఎంబీ) అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తోడ్పాటునివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గర్గ్ తెలిపారు. తమ విక్రేతల్లో 50 శాతం మంది రాజ్‌కోట్, హుబ్లి తదితర ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి ఉంటున్నారని వివరించారు. -
డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:‘ఈ-కామర్స్ వేదికల్లో ఫ్లాష్ సేల్స్ గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వినియోగదారుల ఎంపికలను పరిమితం చేయడానికి ఈ-రిటైలర్లు ఉపయోగించే దోపిడీ ధర, ఇతర మోసపూరిత పద్ధతులకు తాము వ్యతిరేకం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం చేశారు. ‘ఫ్లాష్ సేల్స్ ప్రయోజనాలను పొందేందుకు తరచుగా ఈ-మార్కెట్ ప్లేస్ వేదికల్లోవస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్ ఇష్టపడే లేదా ప్రమోట్ చేసిన సంస్థల ఉత్పత్తుల వైపునకు మళ్లించబడుతున్నారు. ఇది మోసం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధం’ అని అన్నారు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) డిస్కౌంట్లతో మంచి డీల్.. ‘ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే నేనెందుకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులకు మంచి డీల్ లభిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తువులను డంపింగ్ చేయడం ద్వారా దోపిడీ ధరలను అనుసరించడం, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేసే పద్ధతుల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ-కామర్స్ విధానం ద్వారా అటువంటి మోసాలను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఫ్లాష్ సేల్స్ విషయంలో ఈరోజు వినియోగదారుడు ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ ఒక విధానకర్తగా నేను భారతీయ కస్టమర్లకు దీర్ఘకాలిక మంచిని చూడవలసి ఉంటుంది. దోపిడీ ధరలను లేదా ప్రజల ఎంపికలను మోసం చేసే విధంగా ఇటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాము’ అని మంత్రి తెలిపారు. (షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!) చిన్నవారిని రక్షించుకుంటాం.. ‘విదేశీ ఈ-కామర్స్ సంస్థల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిధులున్నాయి. వారికి భారతదేశంలో కొన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం, భారీ నష్టాలను నమోదు చేయడం సమస్య కాదు. ధర, వ్యయాలకు సంబంధం లేకుండా కస్టమర్లను సముపార్జించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలను ఈ–కామర్స్ సంస్థలు గౌరవించాల్సిందే. మార్కెట్ ప్లేస్ మార్కెట్ ప్లేస్‌గా మాదిరిగానే పనిచేయాలి. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబ వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న రిటైల్ వ్యాపారులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చివరివరకు వారికి అండగా ఉంటుంది. చిన్న వ్యాపారులను రక్షించే ఈ ప్రయత్నానికి భారత్ లేదా విదేశీయులైనా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. -
11 లక్షల వర్తకులతో మీషో
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ కంపెనీ మీషో వేదికపై వర్తకుల సంఖ్య 11 లక్షలు దాటింది. గడిచిన ఏడాదిలో 6 లక్షల పైచిలుకు చిన్న వర్తకులు చేరారని కంపెనీ ప్రకటించింది. ఎనమిదేళ్లలోనే ఈ మైలురాయికి చేరుకున్నట్టు తెలిపింది. ‘విక్రేతల్లో సగం మంది ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారు ఉన్నారు. మొత్తం సెల్లర్స్‌లో 80 శాతం పైచిలుకు మంది ఈ–కామర్స్‌కు కొత్తగా చేరినవారే. మీషో ద్వారానే ఆన్లైన్ వ్యాపారంలోకి వీరు అడుగుపెట్టారు. కశ్మీర్‌లోని పుల్వామా, హిమాచల్ ప్రదేశ్ ఉనా, కర్ణాటక నాగమంగళ, మేఘాలయ జోవాయ్, రాజస్తాన్‌లోని మౌంట్ అబు నుంచి సైతం విక్రేతలు నమోదయ్యారు. ఇంటర్నెట్ వాణిజ్యాన్ని మారుమూల ప్రాంతాలకూ చేర్చడం, చిన్న అమ్మకందారులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలన్న సంస్థ లక్ష్యానికి ఇది నిదర్శనం’ అని మీషో వివరించింది. వార్షిక ప్రాతిపదికన 14 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు 2022లో కంపెనీ ప్రకటించింది. విక్రేతల సగటు ఆదాయం మూడింతలు పెరిగిందని తెలిపింది. -
డెలివరీ గర్ల్స్
ఫుడ్ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్లే సత్తా మగవారికే ఉందనుకునే ఈ రంగంలో ఇప్పుడు మగువలు తమ తెగువను చూపుతున్నారు. ఫుడ్ డెలివరీని ‘ఎనీ టైమ్’ అంటూ ఇంటింటి గడపకు చేర్చడానికి సిద్ధమయ్యారు. దీనికి ఉదాహరణగా ఇటీవల మన హైదరాబాద్‌లోనూ డెలివరీ గర్ల్స్ దూసుకువస్తున్నారు. మరికొందరు మగువలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మొట్టమొదటి డెలివరీ గర్ల్ కరోనా కాలం ముగిసాక దేశంలో అక్కడక్కడా డెలివరీ గర్ల్స్ను కూడా చూస్తున్నాం. ఇందుకు వారి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి ‘కాలం’ ఇచ్చిన సమాధానాన్ని ధైర్యంగా భుజానికెత్తుకుంటున్నారు. ఈ జాబితాలో దేశంలో మొదటిసారి కలకత్తా నుంచి రూపా చౌదరి డెలివరీ గర్ల్‌గా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఏకంగా 2,000 మంది ఫుడ్ డెలివరీ గర్ల్స్‌కి ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి స్విగ్గీ ప్రకటనకు రూపాదేవి ప్రేరణ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఫుడ్ డెలివరీలోనే కాదు గత ఫిబ్రవరిలో మొట్టమొదటి బైక్ టాక్సీ డ్రైవర్‌గానూ రూపా చౌదరి పేరొందింది. వైవాహిక జీవితం దెబ్బతినడం, తల్లితండ్రులు, సోదరి మరణించడం, పదేళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్గాన్ని ఎంచుకుంది రూప. గతంలో భర్త, కొడుకుతో కలిసి కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాత్‌లో నివాసం ఉండేది. మొదట్లో ఆర్థికలేమి ఇచ్చిన ధైర్యం ఇది. ‘పోరాడి నిలవగలను అనే స్థైర్యాన్ని ఈ జాబ్ ఇస్తోంది’ అని తెలిపే రూపా ఇటీవల మరో బైక్ టాక్సీ యాప్‌లో డ్రైవర్‌గా చేరింది. ఇ–కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలు.. దక్షిణ ఢిల్లీలోని ఇరుకైన పరిసరాల్లో ఉండే ప్రియాంక సచ్దేవ అనే పంతొమ్మిదేళ్ల అమ్మాయి ప్రతిరోజూ డెలివరీ ప్యాకేజ్‌లను ఇళ్లవద్ద అందజేస్తుంటుంది. ఆరేళ్ల క్రితమే కార్గో కంపెనీ నమ్మకమైన వారితో నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఉండాలనే లక్ష్యంతో నలుగురు మహిళా డెలివరీ సిబ్బందిని ఏర్పాటు చేసుకొన్న సామాజిక సంస్థగా గుర్తింపు పొందింది. పురుష ఆధిపత్య రంగంలోకి ప్రవేశించడానికి ఎక్కువమంది మహిళలను ప్రోత్సహించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది కార్గో. అంతేకాదు, పేద అమ్మాయిలను గుర్తించి, వారికి బైక్ డ్రైవింగ్, సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇచ్చి మరీ నియామకం చేసుకుంది. వీరు మూడేళ్ల పాటు తమ సేవలను అందించారు. మిల్క్ ఉమెన్ ఇటీవల నగరంలోని ఓ పాల డెయిరీ తమ సంస్థ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి మహిళలను నియమించుకుంది. ‘మిల్క్ మెన్ కి మాత్రమే ఈ పదం ఎందుకు పరిమితం కావాలి. మగువలకూ ఈ పదం వర్తించేలా’ చేయాలనుకున్నాం అని వివరించారు డెయిరీ ఫార్మ్ నిర్వాహకులు. ‘ఒంటరిగా వెళ్లద్దు. చీకటిపడటంతోనే ఇంటికి చేరాలి...’ లాంటి మాటలన్నీ ఆడపిల్లలకు సహజంగా ఇంటి నుంచి వినిపించేవే. సమాజం నుంచి లైంగిక వేధింపుల ఘటనలు భయపెడుతూ ఉండేవే. అయితేనేం, అన్ని అడ్డుగోడలను ఛేదించగలమని తెగువ చూపుతున్న నేటి తరపు మగువలు దూసుకువస్తున్నారు. కష్టం నేర్పిన పాఠం కరోనా మహమ్మారి చేసిన యుద్ధం లో ఎందరో ఛాంపియన్లు వెలుగులోకి వచ్చారు. వారిలో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన మామిడిపెల్లి రచన ఒకరు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవడానికి హైదరాబాద్ వచ్చిన రచన పై చదువుల కోసం ఎప్పుడూ కష్టపడేది. ప్రభుత్వ పాఠశాలలో పన్నెండవ తరగతి చదువుకున్న రచన టీచర్ల సలహాతో హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులో చేరింది. బతుకు దెరువు కోసం ఇంటింటికీ తిరిగి పాలు అమ్ముతూ వచ్చింది. తన ఖర్చులు పోను మిగతా మొత్తం తల్లితండ్రులకు పంపించేది. కరోనా తర్వాత ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ జాబ్‌కి అప్లై చేసి, ఉద్యోగాన్ని పొందింది. ఫుడ్ డెలివరీ చేస్తూ చదువును కొనసాగిస్తోంది. మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు ఇప్పటిదాకా డెయిరీ ఫార్మ్స్ ఏవీ కూడా పాల ఉత్పత్తుల సరఫరాకు మహిళల్ని వినియోగించలేదు. మొదటిసారి ఈ రంగంలో డెలివరీ పార్ట్‌నర్స్‌గా మహిళల్ని పరిచయం చేయాలనుకున్నాం. ప్రస్తుతం ఏడుగురు మహిళలు మా సంస్థ తరపున రోజూ ఉదయం మిల్క్‌ను డెలివరీ చేస్తున్నారు. ఈ సంఖ్యను త్వరలోనే 50కి పెంచనున్నాం. – కిషోర్ ఇందుకూరి, సిథ్స్ ఫార్మ్ డైరీ – నిర్మలారెడ్డి -
ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రైతుల ఉత్పత్తులకు మంచి ధర అందించడం, నైపుణ్యాభివృద్ధిపై విస్తృత చర్చలు జరిగాయి. రైతుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన విప్లవాత్మక చర్యలను సీఎం జగన్ íఫ్లిప్‌కార్ట్ట్ బృందానికి వివరించారు. రైతులకు ఉత్తమ టెక్నాలజీ అందిద్దాం: సీఎం జగన్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించాం. విత్తనం అందించడం దగ్గర నుంచి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఫ్లిప్‌కార్ట్ కూడా ముందుకురావాలి. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించడంలో పాలు పంచుకోవాలి. రైతులకు మంచి టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో సహాయపడాలి. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎం యాప్ తీసుకొచ్చాం. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలి. విశాఖ మంచి వేదిక ఐటీ, ఇ–కామర్స్ పెట్టుబడులకు విశాఖపట్నం మంచి వేదిక. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఫ్లిప్‌కార్ట్‌ను కోరుతున్నా. నైపుణ్యాలను పెంపొందించేందుకు విశాఖలో ఏర్పాటు చేస్తున్న హై ఎండ్ స్కిల్ యూనివర్సిటీలో పాలు పంచుకోవాలి. రాష్ట్రం నుంచి మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్ సహకారం అందించాలి. జగన్ దార్శనిక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తాము విస్తృతం చేస్తున్న సరుకుల వ్యాపారం ద్వారా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమని, మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, అక్కడ మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని, వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. వాల్‌మార్ట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో మత్స్యఉత్పత్తుల కొనుగోళ్లు చేస్తున్నామని, దీన్ని మరింత పెంచుతామన్నారు. సీఎం దూరదృష్టి ఎంతో బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు లభించేలా అంకితభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందించారు. సమావేశంలో ఫ్లిప్‌కార్ట్ సీసీఏవో రజనీష్ కుమార్, సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ పెట్టుబడుల వివరాలు ఏటా చెప్పాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థలు ఇకపై తమకు అందే విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించిన వివరాలను .. ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తెలియజేయాల్సి రానుంది. తాము ఎఫ్‌డీఐ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తున్నామంటూ ఏటా సెపె్టంబర్ 30లోగా ఆడిటర్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిబంధనను కేంద్రం శుక్రవారం నోటిఫై చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ దిగ్గజాలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ–కామర్స్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఇది తోడ్పడగలదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీన్ని అమలు చేసే క్రమంలో ఆయా సంస్థల వ్యయాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ–కామర్స్ కంపెనీలు ఎఫ్‌డీఐ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని దేశీ వ్యాపారస్తుల సమాఖ్య సీఏఐటీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పుష్కలంగా విదేశీ పెట్టుబడుల ఊతంతో ఈ–కామర్స్ కంపెనీలు అడ్డగోలు డిస్కౌంట్లు ఇస్తూ చిన్న వ్యాపారాలను దెబ్బ తీస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
అమెజాన్ అతిపెద్ద క్యాంపస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. గచ్చిబౌలిలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఆఫీస్ స్పేస్ 18 లక్షల చదరపు అడుగులు కైవసం చేసుకుంది. మొత్తం 15,000 మంది ఉద్యోగులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. 39 నెలల్లోనే నిర్మాణం పూర్తి అయింది. ప్రతిరోజు సగటున 2,000 మంది కార్మికులు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈఫిల్ టవర్‌కు వినియోగించిన ఇనుము కంటే రెండున్నరెట్లు ఈ భవనానికి వాడారు. ఒకే సమయంలో 972 మంది వెళ్లగలిగేలా 49 లిఫ్టులున్నాయి. ఇవి సెకనుకు ఒక్కో అంతస్తును దాటతాయి. 86 మీటర్ల ఎత్తున్న ఈ భవనంలో విభిన్న రెస్టారెంట్లతో 24 గంటలూ నడిచే భారీ కెఫెటేరియా, హెలిప్యాడ్, 290 కాన్ఫరెన్స్ రూమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మాణానికి రూ. 1,500 కోట్లకుపైగా వెచ్చించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్ నుంచే.. అమెజాన్‌కు యూఎస్ వెలుపల ఇది ఏకైక సొంత భవనం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో సంస్థకు 300 క్యాంపస్‌లు ఉన్నాయి. అన్ని కేంద్రాల విస్తీర్ణం 4 కోట్ల చదరపు అడుగులు ఉంది. భారత్‌లో 13 రాష్ట్రాల్లో 50 గిడ్డంగులున్నాయి. ఇక హైదరాబాద్‌లో కంపెనీకి ఎనిమిది ఆఫీసులున్నాయి. 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి నెలకొన్నాయి. 2004లో భారత్‌లో అడుగుపెట్టిన అమెజాన్ తొలుత భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ టీమ్స్తోపాటు పెద్ద ఎత్తున కస్టమర్ సర్వీస్ ఆపరేషన్స్ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. కాగా, నూతన క్యాంపస్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు. భారత్ నుంచి ఎగుమతులకు ఊతం.. భారత్‌లో అమెజాన్‌కు 30 ఆఫీసులున్నాయి. 62,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. వీరిలో 20,000కుపైగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా 1.55 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టామని అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు ఫుడ్, రిటైల్‌లో ఖర్చు చేశామన్నారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ షోట్లర్తో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్ సెల్లింగ్ వేదిక ద్వారా ఇక్కడి చిన్న వర్తకులు విదేశాల్లో తమ ఉత్పత్తులు విక్రయించుకునే సౌలభ్యం కల్పించాం. 50,000 మంది విక్రేతలు 14 కోట్ల ఉత్పత్తులు అమ్మకానికి ఉంచారు. ఇప్పటి వరకు రూ.7,000 కోట్ల విలువైన ప్రొడక్టులు ఎగుమతి అయ్యాయి. వచ్చే మూడేళ్లలో ఇది రూ.35,000 కోట్లకు చేరుతుందని ఆశిస్తున్నాం. ఈ–కామర్స్ రంగంలో మందగమనం లేదు’ అని వివరించారు. ఆఫీసులో లోపలి ప్రదేశం ఉద్యోగులకు ఆటవిడుపు. ఇండోర్ క్రికెట్ విశాలమైన కార్యాలయం క్యాంపస్‌లో భారీ కెఫెటేరియా -
లోకల్ బ్రాండ్లకు.. ‘పిక్ ఎన్ హుక్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్ కంపెనీ ‘పిక్ ఎన్ హుక్’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. మార్చి నుంచి ఈ వస్తువులన్నీ అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా ‘పిక్ ఎన్ హుక్’ ఫౌండర్ సీఈఓ మోనిష్ పత్తిపాటి ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో తన అనుభవాల్ని పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... ‘‘స్థానికంగా ఉండి, సొంతంగా వ్యాపారం చేయాలన్నదే నా కల. అందుకు తగ్గట్టే నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేశాక 2016లో ‘పిక్ ఎన్ హుక్’ను ఆరంభించాం. రూ.కోటి పెట్టుబడితో మా నాన్నగారు ప్రసాద్ పత్తిపాటి సాయంతో ఆరంభించాం. ఆయనే చైర్మన్‌గా వెన్నంటి నడిపిస్తున్నారు. అనతికాలంలోనే లక్ష మందికిపైగా కస్టమర్లు వచ్చారు. 1,000కి పైగా వెండర్లు తమ ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పై విక్రయిస్తున్నారు. మంచి ధర.. వేగంగా డెలివరీ అనే రెండంశాలే మా ప్రత్యేకత. ఈ ఏడాది మార్చి నుంచి కొత్త రూపుతో రంగంలోకి దిగుతున్నాం. యాప్‌తో పాటు వెబ్‌సైట్‌కు కూడా మరిన్ని ఫీచర్లు జోడిస్తాం. ఉత్పత్తుల శ్రేణి పెంచుతున్నాం. ఫ్రాడ్ డెలివరీని నిలువరించి క్వాలిటీ చెక్ వ్యవస్థను పటిష్టం చేశాం. తద్వారా ఫిర్యాదులు అర శాతం లోపే ఉంటున్నాయి. ప్రొడక్టుల ధరను సెల్లర్లే నిర్ణయిస్తారు. ఇక నిధుల విషయానికి వస్తే ప్రస్తుతానికి సొంత వనరులే ఖర్చు చేస్తున్నాం. నిధుల సమీకరణ గురించి మార్చి చివరికల్లా ఒక స్పష్టత వస్తుంది. పోటీ ఎంతున్నా ఈ రంగంలో నిలదొక్కుకుంటామన్న ధీమా ఉంది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్లాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల్ని మా ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తున్నాం. లోకల్ బ్రాండ్స్‌ను దేశ, విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకు రావాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని మోనిష్ వివరించారు. -
కార్డు లిమిట్ 13 వేలు.. ఖర్చు 9 కోట్లు
న్యూఢిల్లీ: 200 డాలర్ల(రూ.13 వేలు) పరిమితితో ఎస్బీఐ జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డుల్లో మార్పులు చేసి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 9.1 కోట్ల మేర ఖర్చు చేసిన సంఘటన బ్యాంకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ తరఫున ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్నారై బ్రాంచ్ 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని జారీచేసింది. సందీప్ కుమార్ అనే వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్‌లో మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్సైట్లలో రూ. 9.1 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి కంపెనీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒరకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్‌లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంపై ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
ఆఫర్లలో.. పోటాపోటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మునుపెన్నడూ లేనంతగా ఈ సారి పండుగల సీజన్లో ఈ–కామర్స్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఆఫ్‌లైన్ మార్కెట్ కూడా డిస్కౌంట్లలో నువ్వానేనా అంటోంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విక్రేతలు ఆఫర్లు కురిపిస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం మాల్ వంటి ఈ–కామర్స్ సంస్థలకు దీటుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్, టీఎంసీ, రిలయన్స్ డిజిటల్, బిగ్ సి, లాట్, సంగీత, ఐటీ మాల్, ఈజోన్, సోనోవిజన్, పై ఇంటర్నేషనల్ తదితర రిటైల్ చైన్లు కోట్లాది రూపాయల విలువైన బహుమతులు, భారీ డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి. రూపాయి చెల్లించి ఏ ఉత్పత్తినైనా తీసుకెళ్లొచ్చంటూ కస్టమర్లను ఊరిస్తున్నాయి. తయారీ కంపెనీలిచ్చే ఆఫర్లకు తోడు విక్రేతలూ బహుమతులందిస్తుండడం విశేషం. పోటాపోటీగా బహుమతులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ రిటైల్ చైన్లు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తో పాటు దాదాపుగా ప్రధాన నగరాలన్నిటికీ విస్తరించాయి. పండుగల సీజన్ కోసం ఇవి అబ్బురపరిచే బహుమతులను ప్రకటిస్తున్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ రూ.కోటి క్యాష్ ప్రైజ్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు కిలో బంగారం, 10 ఆల్టో 800 సీసీ కార్లను అందిస్తోంది. హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్‌తో టీఎంసీ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లు రూ.10 లక్షల నగదు, 25 కిలోల వెండి, ఒక కిలో బంగారం గెలుపొందొచ్చు. ప్రైస్ చాలెంజ్‌తో మెట్రో హోల్‌సేల్ సవాల్ విసురుతోంది. సోనీ నూతన శ్రేణి టెలివిజన్లపై విలువైన బహుమతులను అందుకోవ చ్చు. శామ్సంగ్, ఎల్జీ, లాయిడ్, డెల్, ప్యానాసోనిక్, హాయర్, వర్ల్‌పూల్ తదితర కంపెనీల కొత్త మోడళ్లతో ఔట్లెట్లు సందడిగా మారాయి. ‘స్మార్ట్’ ఆఫర్ల వెల్లువ..: మొబైల్ ఫోన్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ దసరావళి డబుల్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. లక్కీడ్రాలో 36 హ్యుందాయ్ ఇయాన్ కార్లను బహుమతిగా గెల్చుకోవచ్చు. అక్టోబరు 21 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. లాట్ మొబైల్స్ అక్టోబరు 23 వరకు ఆఫర్లు అందిస్తోంది. లక్కీ డ్రాలో బీఎండబ్లు్య కారు, హోండా యాక్టివా స్కూటర్లు, ఏసీలు, టీవీల వంటి బహుమతులు గెలుపొందవచ్చు. గతేడాది సీజన్‌తో పోలిస్తే 50% వృద్ధి ఆశిస్తున్నట్టు బిగ్ సి, లాట్ వెల్లడించాయి. మహా పండుగ, మహా సేల్ పేరుతో కార్లు, బంగారం, దుబాయ్ ట్రిప్ వంటి బహుమతులను సంగీత మొబైల్స్ అందిస్తోంది. ప్రతి ల్యాప్‌టాప్‌పై రూ.9,999 విలువ చేసే బహుమతులను ఇస్తున్నట్టు ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. కంపెనీ ఇచ్చే ఆఫర్ దీనికి అదనమని, డౌన్ పేమెంట్, వడ్డీ లేకుండా 12 ఈఎంఐలలో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయొచ్చని చెప్పారు. -
అమెజాన్ ఏడు కొత్త వేర్‌హౌస్‌లు!
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఇది ఏడు కొత్త వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 4,000 మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించాలని అమెజాన్ భావిస్తోంది. ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూనే ఉంటాం’ అని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. తాజాగా ప్రకటించిన సెంటర్లు తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తంగా 14 కొత్త కేంద్రాల ఏర్పాటుతో తమ వేర్‌హౌస్/ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల సంఖ్య 41కి చేరుతుందని తెలిపారు. -
విశ్వాసమే విజయధ్వజమై!
వర్తమానాన్నే కాదు భవిష్యత్‌ను కూడా అంచనావేయగలిగేవారే ఉత్తమ వ్యాపారులవుతారు. మన దేశంలో ఇ–కామర్స్ అంతగా ఊపందుకోని రోజులవి. ‘ఇ–కామర్స్ మార్కెట్’కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆరోజుల్లోనే అంచనా వేశారు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటిడీ)లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కలసి చదువుకున్నారు చండీగఢ్‌కు చెందిన సచిన్, బిన్నీలు. చదువు పూర్తయిన కొంత కాలానికి ప్రసిద్ధ ఇ–కామర్స్ కంపెనీ ‘అమెజాన్’లో కొంత కాలం పనిచేశారు. ‘రెగ్యులర్ జాబ్‌లో చాలెంజింగ్ అనేది ఉండదు’ అనే విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండేది. ఆ సమయంలోనే సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనవచ్చి ఉద్యోగానికి రాజీనామా చేశారు. భారీ మొత్తంలో బడ్జెట్ లేదు. అయితే ‘భారీ బడ్జెట్’తో మాత్రమే ఒక వ్యాపారం విజయవంతం అవుతుందనే దానిపై నమ్మకం కూడా లేదు. తమ దగ్గర ఉన్న చిన్నపాటి పొదుపు మొత్తాలతో కష్టాన్ని నమ్ముకొని రంగంలోకి దిగారు. 2007లో బెంగళూరులో ‘ఫ్లిప్‌కార్ట్’ను ప్రారంభించారు.వైఫల్యాల గురించి అవగాహన ఉన్నప్పుడు విజయప్రస్థానం మొదలవుతుంది. ‘ఆన్లైన్లో ఎక్కువమంది టికెట్లు కొంటున్నప్పుడు... షాపింగ్ మాత్రం ఎందుకు చేయరు?’ అనుకున్నారు కంపెనీ మొదలు పెట్టడానికి ముందు. అయితే అప్పటికే ఉన్న కొన్ని చిన్న ఇ–మార్కెటింగ్ కంపెనీలు పెద్దగా సక్సెస్ కాలేదు. డెలివరీలు ఆలస్యం కావడం, రాంగ్ ప్రొడక్ట్ డెలివరీలు... మొదలైన కారణాలు నిలువెత్తు వైఫల్యాలుగా కనిపిస్తున్నాయి.పుస్తకాల విక్రయంతో మొదలైంది ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రస్థానం. చిన్న పట్టణం నుంచి పెద్ద పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా పుస్తకప్రియులకు మెరుగైన సేవలను అందించింది. కొరియర్ సర్వీస్ అందుబాటులో లేని చోట తపాలా శాఖ సేవలను ఉపయోగించుకుంది. ప్యాకింగ్ నుంచి కొత్త సాఫ్ట్వేర్ గురించి ఆలోచించడం వరకు ప్రతిపనీ చురుగ్గా చేసేవారు సచిన్, బిన్నీలు. పోటీదారుల కంటే ముందుండాలంటే ‘బ్యాడ్ క్వాలిటీ సర్వీస్’కు దూరంగా, ‘కస్టమర్ సర్వీస్’కు దగ్గరగా ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని ఒంటబట్టించుకుంది ఫ్లిప్‌కార్ట్. పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు గమ్యాన్ని మార్చుకునేది. తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకునేది.‘క్యాష్ ఆన్ డెలివరీ’ సౌకర్యాన్ని కలిగించడంలాంటివి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకతను చాటాయి. క్రెడిట్ కార్డు లేనివారికి, క్రెడిట్, డెబిట్ కార్డులు ఎలా ఉపయోగించాలో తెలియని వారికి, అవి ఉపయోగించడానికి సౌకర్యంగా లేని వారికి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఉపయోగపడింది. ఇప్పుడు మనదేశంలో ఎన్నో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఈ ఆప్షన్‌ను అనుసరిస్తున్నాయి. పుస్తకాల విక్రయంతో మొదలైన ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రయాణం స్వల్పకాలంలోనే మొబైల్, మూవీస్, మ్యూజిక్, గేమ్స్, కెమెరాలు, కంప్యూటర్లు... ఇలా రకరకాల విభాగాల్లోకి దూసుకెళ్లింది. కస్టమర్, సప్లయర్‌లో విశ్వాసం నింపగలగడమే తొలి విజయం అనుకొని ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించింది ఫ్లిప్‌కార్ట్. పబ్లిసిటీ కోసం లక్షలు ఖర్చు పెట్టకుండానే మౌత్ పబ్లిసిటీతో ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.నాలుగు లక్షల పెట్టుబడి, అయిదు మంది సిబ్బందితో మొదలైన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్‌తో, 4500 మంది ఉద్యోగులతో లార్జెస్ట్ ఇ–కామర్స్ పోర్టల్‌గా దేశంలో అగ్రగామిగా నిలిచింది.‘ఒక ఆలోచన రావడం... అద్భుతం. ఆ ఆలోచన ఆచరణలోకి రావడం అదృష్టం. ఆచరణ ఫలవంతం కావడం గొప్ప అదృష్టం’ అని ఫ్లిప్‌కార్ట్‌తో నిరూపించారు సచిన్, బిన్నీ ద్వయం. పేరులో నేముంది? తమ కంపెనీకి ఏ పేరు పెట్టాలనే దాని గురించి రకరకాలుగా ఆలోచించారు సచిన్, బిన్నీలు. ఏ పేరు పెట్టినా క్యాచీగా ఉండాలనుకున్నారు. ‘ఇది కేవలం పుస్తకాల విక్రయాలకు సంబంధించినదే’ అనే అర్థం ఆ పేరులో ధ్వనించకూడదు. ఆ పేరు అన్ని విభాగాలకు వర్తించేలా ఉండాలనుకుంటూ ‘ఫ్లిప్పింగ్ థింగ్స్ ఇన్ టు యువర్ కార్ట్’ అనే వాక్యాన్ని అనుకున్నారు. దీన్నే కుదించి ‘ఫ్లిప్‌కార్ట్’ పేరును ఖాయం చేశారు. పేరుకు తగ్గట్టుగానే వినియోగదారుల బండిలోకి సరుకులను వేగంగా చేరవేయడంలో విజయం సాధించారు. -
ఈ-కామర్స్‌కు ‘నోటు’ పోటు
-
ఈ-కామర్స్‌కు ‘నోటు’ పోటు
• క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల తాత్కాలిక నిలిపివేత.. • నియంత్రణల విధింపు న్యూఢిల్లీ: మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ-కామర్స్ కంపెనీల వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు నగదు రూపంలో చెల్లింపులు (సీఓడీ) చేసే ఆర్డర్ల డెలివరీకి బ్రేక్ పడింది. అమెజాన్, పేటీఎం తదితర ఆన్లైన్ విక్రయ సంస్థలు సీఓడీ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారుు. అరుుతే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి మరికొన్ని సంస్థలు సీఓడీ ఆర్డర్ విలువపై పరిమితులు విధించారుు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం ఈ-కామర్స్ లావాదేవీల్లో 70 శాతం నగదు రూపంలోనే జరుగుతున్నారుు. దీనిబట్టి చూస్తే, పెద్ద నోట్ల రద్దు ఉదంతం ఈ కంపెనీలకు కొంతకాలంపాటు ఎదురుదెబ్బేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘కొత్త ఆర్డర్లకు సంబంధించి క్యాష్ చెల్లింపులను తాత్కాలికంగా ఆపేశాం. అరుుతే, మంగళవారం(8న) అర్థరాత్రికి ముందు సీఓడీ ఆర్డర్‌ను చేసిన కస్టమర్లకు మాత్రం డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా చెల్లుబాటు అయ్యే డినామినేషన్లలో మాత్రమే చెల్లింపులకు అనుమతిస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు సీఓడీ ఆర్డర్ల విలువను రూ.1,000; రూ.2,000కు మాత్రమే పరిమితం చేశారుు. అది కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లించాలని సూచించారుు. ఉబెర్, బిగ్‌బాస్కెట్‌లు కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లింపులు జరపాలని కోరారుు. -
డిస్కౌంట్లు కావాలా.. గ్రాబ్ఆన్
♦ ఏటా రూ.100 కోట్ల కస్టమర్ల డబ్బు ఆదా ♦ ఈ-కామర్స్ కంపెనీలకు రూ.500 కోట్ల వ్యాపారం దీని ద్వారానే.. ♦ ఈ ఏడాది 10-15 మిలియన్ డాలర్ల సమీకరణ ♦ ఆ తర్వాతే ఆఫ్‌లైన్ స్టోర్లకూ గ్రాబ్ఆన్ కూపన్లు ♦ గ్రాబ్ఆన్ ఫౌండర్, సీఈఓ అశోక్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :వారాంతంలో సినిమాకెళ్లాలి.. థియేటర్‌కి చేరుకోవడానికి ఓ క్యాబ్ కావాలి! తిరిగొస్తూ రెస్టారెంట్లో భోజనం చేయాలి.. కానీ, అన్నీ తక్కువ ధరలోనే సుమీ!! ఆన్లైన్లో వెతికితే సినిమాకో సైట్.. క్యాబ్‌కి ఇంకో సైట్.. రెస్టారెంట్‌కు మరో సైట్.. ఇలా వేటికవే వేర్వేరుగా రాయితీలందిస్తున్నాయ్. సినిమా టికెట్ల మొదలు క్యాబ్, రెస్టారెంట్లు.. ఇలా ఒకటేమిటి దాదాపు 60 విభాగాల్లో డిస్కౌట్లు, ఆఫర్లు, కూపన్లందించే సంస్థ దొరికితే.. ఇంకేముంది!! అచ్చం ఇదే వ్యాపార సూత్రంగా మలుచుకొని సేవలందిస్తుంది గ్రాబ్ఆన్.ఇన్! మరిన్ని వివరాలు గ్రాబ్ఆన్ ఫౌండర్, సీఈఓ అశోక్ రెడ్డి వరీధి రెడ్డి మాటల్లోనే.. గ్రాబ్ఆన్ ఎలా ప్రారంభమైందో చెప్పడానికంటే ముందు నా గురించి కొంత చెప్పాలి. మొదట్లో మాది ల్యాండ్‌మార్క్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ. ఇందులో ఇన్స్పైర్ ల్యాబ్స్ పేరిట కొత్త ఆలోచనతో ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించేవాళ్లం. కొంత పెట్టుబడితో వారి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చేవాళ్లం. అలా ఓ ఏడాది భాను రాజు, స్పందన్ జగ్గుమంత్రి, సీతారాం కుమార్, హరిబాబు, నాగేంద్ర 5 గురు కలిసి ‘గ్రాబ్ఆన్’ గురించి చెప్పారు. ఆలోచన కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. అప్పటివరకున్న కూపన్ సంస్థలు టెక్నాలజీని అంతగా ఉపయోగించట్లేదని తెలుసుకొని.. ఈ-కామర్స్ వృద్ధిని, డిస్కౌంట్ల అవసరాన్ని ముందుగానే అంచనా వేసుకొని వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలనుకున్నా. టెక్నాలజీ అభివృద్ధి, కొంత మంది ఉద్యోగుల నియామకం తదితరాలకు రూ.10 లక్షల పెట్టుబడితో 2013 సెప్టెంబర్‌లో హైదరాబాద్ కేంద్రంగా గ్రాబ్ఆన్.ఇన్ ప్రారంభమైంది. 60 విభాగాలు.. 1,700 సంస్థలు ఆన్లైన్లో కస్టమర్లకు కూపన్లు అందించి అటు ఈ-కామర్స్ కంపెనీలకు ప్రమోషన్ చేయడమే గ్రాబ్ఆన్ పని. మా సంస్థ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్ 60కి పైగా విభాగాల్లో కూపన్లను వినియోగించుకోవచ్చు. పేటీఎం, జబాంగ్, ఉబర్, ఫ్రీచార్జ్, స్నాప్‌డీల్, స్విగ్గీ, ఓలా, బిగ్ బాస్కెట్ వంటి సుమారు 1,700 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. పేటీఎం, ఉబర్ వంటి కొన్ని కంపెనీలకు ఎక్స్‌క్లూజివ్ కూపన్లూ అందిస్తున్నాం. అంటే ఇతర కూపన్స్ కంటే వీటి కస్టమర్లకు ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్స్ లభిస్తాయన్నమాట. మా ద్వారా కొనుగోలు జరిగే ప్రతీ ఉత్పత్తిపై (1-20% వరకూ) కొంత కమీషన్ ఉంటుంది. ఏటా రూ.100 కోట్లు ఆదా..: ప్రస్తుతం రోజుకు లక్ష మంది.. నెలకు 2.5 మిలియన్ల మంది మా కూపన్లను వాడుకుంటున్నారు. వీరిలో 47 శాతం మంది రిపీటెడ్ కస్టమర్లే. మిగతావారు కొత్త కస్టమర్లు. ప్రతి నెలా 10-15% వరకు పెరుగుతున్నారు కూడా. 2017 ముగింపులోగా 25 మిలియన్ యూజర్లకు చేరుకోవాలని లక్ష్యం. గతేడాది గ్రాబ్ఆన్ కూపన్ల వినియోగం ద్వారా కస్టమర్లకు ఆదా అయిన సొమ్ము విలువ అక్షరాల రూ.100 కోట్లు. మా సంస్థ ద్వారా ఈ-కామర్స్ సంస్థలకు జరిగిన వ్యాపారం రూ.500 కోట్ల వరకుంది. ఈ ఏడాది 1,200 కోట్ల వ్యాపారానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.6 కోట్ల టర్నోవర్.. ప్రస్తుతం మా సంస్థలో 150 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇటీవలే 2,50,000 డాలర్ల పెట్టుబడులతో అమెరికాకు చెందిన ఓ హెచ్ఎన్ఐ ముందుకొచ్చారు. కానీ, మా బ్రాండ్‌ను ఇచ్చేయమన్నారు. దీంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. మళ్లీ నిధుల సమీకరణకు వెళ్తున్నాం. టెక్నాలజీ అభివృద్ధి, సేవల విస్తరణ, మరికొంత మంది ఉద్యోగుల నియామకం వంటి వాటి కోసం10-15 మిలియన్ డాలర్ల నిధులవసరమవుతాయి. ఫండింగ్ తర్వాతే ఆఫ్‌లైన్ స్టోర్లకూ మా కూపన్లను అందించాలని నిర్ణయించాం. ప్రధాన మెట్రో నగరాల్లోని స్టోర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ‘సాక్షి’ ద్వారా ప్రత్యేక ఆఫర్.. దేశంలోనే అతిపెద్ద కూపన్స్, డీల్స్ కంపెనీగా గ్రాబ్ఆన్ అవతరించడానికి కారణం.. స్ట్రాటర్జీక్ అలయెన్స్ విత్ కస్టమర్స్. ఎలాగంటే.. సాక్షి, ఫైబర్ నెట్ వంటి సంస్థలతో పాటూ పలు విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఏమవుతుందంటే.. ఉదాహరణకు సాక్షి.కామ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అడ్వటైజ్మెంట్లలో గ్రాబ్ఆన్ కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేయగానే నేరుగా గ్రాబ్ఆన్ వెబ్సైట్ లోంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది. దీంతో సాధారణ కూపన్లు, ఎక్స్‌క్లూజివ్ కూపన్ల కంటే వీరికి ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్స్ లభిస్తాయన్నమాట. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
క్లిక్ దూరంలో రిటైల్ సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంటింట్లోని సామగ్రి నుంచి ఒంటి మీద ఫ్యాషన్ వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనే రోజులివి. అయితే ఎన్ని ఈ-కామర్స్ సంస్థలొచ్చినా.. నేరుగా షాపుకెళ్లి కొనాలనుకునే వస్తువులను ప్రత్యక్షంగా చూస్తూ.. తాకుతూ కొనేస్తే ఆ అనుభూతే వేరు. నిజమే కానీ మనకు దగ్గర్లో ఏ రిటైల్ షాపులున్నాయి? అందులోని ఆఫర్లు.. ఉత్పత్తులు, సేవల వివరాలెలా తెలుసుకోవాలి?.. ఇదిగో దీనికి పరిష్కారమే వాక్‌టుషాప్.కామ్. మరిన్ని వివరాలు సంస్థ కో-ఫౌండర్ వెంకట్ మాటల్లోనే.. ♦ నాతో పాటూ గోవింద రాజుల పుట్ట, సతీష్, సంజీవ్ నలుగురం కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో వాక్‌టుషాప్ స్టార్టప్‌ను ప్రారంభించాం. వాక్‌టుషాప్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫ్‌లైన్ సంస్థలు, వాటి ఉత్పత్తులు, ఆఫర్ల గురించి ప్రచారం చేయడమే మా ప్రత్యేకత. ♦ మా సేవల విషయానికొస్తే.. మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న కస్టమర్లకు వారున్న చోటు నుంచి 2 కి.మీ. పరిధిలో ఉన్న రిటైల్ స్టోర్ల జాబితా అంతా సెల్ఫోన్లోకి వచ్చేస్తుంది. అవసరమైతే నేరుగా ఆయా సంస్థలతో చాటింగ్ చేసే వీలూ ఉంటుంది. దీంతో ఎంచక్కా కావాల్సింది నేరుగా కొనేసుకోవచ్చు. ఈ డేటాబేస్ కోసం గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నాం. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు రిటైలర్లకు అందిస్తాం. ♦ వ్యాపార విధానం విషయానికొస్తే.. వాక్టుషాప్తో ఒప్పందం చేసుకున్న రిటైల్ సంస్థలకు వారి వారి ఉత్పత్తుల ప్రదర్శన, రాయితీలు, ఆఫర్ల ప్రదర్శన కూడా చేసుకునే వీలుంటుంది. జియో ఫెన్సింగ్ సేవలను కూడా అందిస్తున్నాం. ఇదేంటంటే.. మా వద్ద రిజిస్టరైన కస్టమర్ సంబంధిత స్టోర్‌కు 200 మీటర్ల సమీపంలోకి రాగానే ఆయా స్టోర్ల వివరాలు, ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్ రూపంలో సెల్‌ఫోన్‌కు చేరతాయి. బీకాన్ పేరుతో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) అనే మరో సేవలందిస్తున్నాం. ఇదేంటంటే.. కస్టమర్ సెల్ఫోన్లో బ్లూ టూత్ ఆన్‌లో ఉంటే చాలు.. ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు మాతో ఒప్పందం చేసుకున్న స్టోర్లకు చేరువకాగానే ఆటోమెటిక్‌గా ఆ స్టోర్ వివరాలు, ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ సేవలను మ్యాక్స్, యూసీబీ సంస్థలు పొందుతున్నాయి. ♦ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పాటూ డెస్క్టాప్ల్లో కూడా సేవలందిస్తున్నాం. ప్రస్తుతం 400 రిటైలర్లు సుమారు 700 స్టోర్లు మా సంస్థలో నమోదయ్యారు. 5 వేల మంది కస్టమర్లు మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సేవలు పొందుతున్నారు. చార్జీల విషయానికొస్తే.. ఆయా సేవలను బట్టి నెలకు రూ.1,500 నుంచి రూ.10 వేల వరకున్నాయి. -
దేశీ ఈ-కామర్స్ మార్కెట్లోకి అలీబాబా!
న్యూఢిల్లీ: చైనా దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అలీ బాబా ఈ ఏడాది భారత ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనువైన అవకాశాల కోసం అన్వేషిస్తోంది. భారత ఈ-కామర్స్ రంగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అలీబాబా గ్రూప్ ప్రెసిడెంట్ జె మైకేల్ ఇవాన్స్ తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అలీబాబా గ్రూప్ గ్లోబల్ మేనేజింగ్ డెరైక్టర్ కే గురు గౌరప్పన్తో కలిసి మైకేల్ శుక్రవారం ఇక్కడ టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిశారు. అలీబాబా భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించి, దేశీ ఈ-కామర్స్ రంగంలో తనదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నట్లు ప్రసాద్ తెలి పారు. కాగా అలీబాబా ఇక్కడ పేటీఎం, స్నాప్‌డీల్‌లో పెట్టుబడులు పెట్టింది. -
స్నాప్‌డీల్ లో టీవీఎస్ బైక్స్
చెన్నై: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌తో జతకట్టింది. దీంతో టీవీఎస్ మోటార్‌కు చెందిన తొమ్మిది టూవీలర్ ఉత్పత్తులు ఇకమీదట స్నాప్‌డీల్.కామ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు స్నాప్‌డీల్ మోటార్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్లి వారికి న చ్చిన మోడల్‌ను, డీలర్‌షిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు మిచెలిన్ టైర్స్‌కు చెందిన ప్యాసెంజర్ కారు టైర్లు కూడా స్నాప్‌డీల్‌లో అందుబాటులో ఉన్నాయి. -
రీచార్జ్ కాదు.. డబ్బులూ రావు!!
♦ అర్ధంతరంగా నిలిచిపోతున్న లావాదేవీలు ♦ వాలెట్లలో ఉండిపోతున్న కస్టమర్ల సొమ్ము ♦ తప్పనిసరిగా దాన్లోనే వాడాల్సిన అగత్యం ♦ నిర్బంధ కొనుగోళ్లకు తెరతీస్తున్న ఈ-కామర్స్ కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సారథి ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ఓ మొబైల్ కంపెనీకి చెందిన ప్రీపెయిడ్ కనెక్షన్ వాడుతున్నాడు. ఎప్పుడు రీచార్జి చేయాలన్నా ఏదో ఒక ఔట్లెట్లోనో, దగ్గర్లోని సూపర్ మార్కెట్లోనో చేయించేస్తుంటాడు. కాకపోతే ఇపుడు ఆన్లైన్లో బోలెడన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిద్వారా రీచార్జి చేయిస్తే కాస్త అదనపు టాక్‌టైమ్ కూడా వస్తుందన్న ఆఫర్లు చూసి... ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవటంతో ఆన్లైన్లోనే చేయిద్దామని ఫిక్సయ్యాడు. అనుకున్నదే తడవుగా ఓ యాప్ ద్వారా రీచార్జ్ చేయటానికి ప్రయత్నించాడు. ఆన్లైన్ పేమెంట్‌ను ఎంచుకుని... తన ఆన్లైన్ బ్యాంకు ఖాతా నుంచే పేమెంట్ చేశాడు. కాకపోతే సరిగ్గా నగదు చెల్లించిన తరవాత ఆ యాప్ స్లో అయిపోయింది. ‘‘ప్రాసెసింగ్ ఎర్రర్’’ అంటూ వచ్చి... రీఛార్జ్ మధ్యలో ఆగిపోయింది. మొత్తానికి డబ్బులైతే చెల్లించేశాడు కానీ రీచార్జ్ మాత్రం జరగలేదు. పోనీ తన డబ్బులు తిరిగి అకౌంట్లోకి వచ్చేస్తాయి కదా!! అనుకున్నాడు. కానీ అలా రాలేదు. ఆ డబ్బులు యాప్ తాలూకు వాలెట్‌లోనే పాయింట్ల మాదిరిగా ఉండిపోయాయి. దాంతో చేయించుకుంటే మళ్లీ రీచార్జి చేయించుకోవాల్సిందే తప్ప ఆ డబ్బులు వేరేగా ఉపయోగించడానికి కుదరదు. తక్షణం రీచార్జి అవసరం కనక దగ్గర్లోని షాప్‌లో చేయించేసుకున్నాడు. కానీ వ్యాలెట్‌లో డబ్బులు మాత్రం అలాగే ఉండిపోయాయి. అదీ కథ. నిజానికిది సారథి ఒక్కడి సమస్యే కాదు. చాలామంది వినియోగదారులకు ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ముందుగా అలవాటు చేసి... సాధారణంగా టెలికం సంస్థలన్నీ తమ సొంత వెబ్సైట్ల ద్వారా కూడా రీచార్జ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటిద్వారా రీచార్జ్ చేసినపుడు ఒకవేళ మధ్యలో ఫెయిలైతే చెల్లించిన సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలోకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు ప్రాసెసింగ్‌లో కాస్త ఆలస్యమైనా... అయితే రీచార్జ్ కావటమో, లేదంటే డబ్బులు వెనక్కి తిరిగి రావటమో జరుగుతుంది. కానీ వ్యాలెట్లు, మొబైల్ రీచార్జి యాప్‌ల విషయంలో మాత్రం ఇలా జరగటంలేదు. ఈ విషయంలో వినియోగదారుకు ముందుగా సూచన చేయటమో, హెచ్చరించటమో కూడా లేదు. ‘‘మొదట్లో ఈ యాప్‌ల ద్వారా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రీచార్జి లావాదేవీలు సాఫీగా సాగేవి. డిస్కౌంట్లు కూడా ఇస్తూ కస్టమర్లను బాగా అలవాటు చేశాక ఇపుడు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి’’ అని ఓ వినియోగదారుడు వాపోయాడు. వాలెట్లో కస్టమర్ డబ్బు.. వాలెట్లో ఉన్న డబ్బులను వాడుకోవాలంటే ఒక వస్తువును ఆన్లైన్లో కొనాలి. ఇప్పుడీ వెబ్సైట్లు ఈ-కామర్స్ కంపెనీల మాదిరిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఏదైనా వస్తువు కొనాలంటే వాలెట్లో ఉన్న డబ్బులు సరిగ్గా సరిపోయే అవకాశం ఉండదు కనక మరికొంత నగదును జోడించాలి. ఇక కొన్ని యాప్‌లలో గనక పాయింట్ల రూపంలో డబ్బులు ఉండిపోతే... మళ్లీ రీచార్జి మాత్రమే చేయించుకోవాలి. రీఛార్జి ఎంతపడితే అంత చేయించలేం. దానిక్కూడా కొంత జోడించటమో... లేకపోతే అందులో ఇంకా కొంత డబ్బు ఉండిపోవటమో జరుగుతుంది. అలా ఉండిపోయిన పక్షంలో మరోసారి రీచార్జి చేయించడానికి మరికొంత జోడించాలి. ఇలా కస్టమర్లను ఎప్పటికీ తమ యాప్‌పైనే ఆధారపడేలా చేయటమన్నది వీటి వ్యాపార వ్యూహాల్లో ఒకటని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘ఈ మధ్య నేను రూ.150 రిచార్జ్ చేయబోతే ఆ డబ్బులు కాస్తా వాలెట్‌లోకి పోయాయి. రీచార్జి అత్యవసరం కావటంతో నేరుగా టెలికం పోర్టల్ నుంచే పని పూర్తి చేశా. ఆ డబ్బులు మాత్రం ఇప్పటికీ అందులోనే ఉన్నా యి’’ అని సురేష్ అనే మరో వినియోగదారుడు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. -
వాచీల కొనుగోళ్లలో వరంగల్ టాప్
అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 65% ఈ-బే రిటైల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ హెడ్ నవీన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్లో వాచీలను కొనుగోలు చేయడంలో చిన్న నగరాల హవా నడుస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ ఈ-బే వాచీల అమ్మకాల్లో టాప్-5 రాష్ట్రాల్లో మెట్రో నగరం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రాలవారీగా చూస్తే కర్ణాటకలో హసన్, గుల్బర్గా, రాయిచూర్, మహారాష్ట్రలో లాతూర్, కరద్, సాంగ్లి, ఢిల్లీలో నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్, కాకినాడ, నర్సాపూర్, తమిళనాడులో నాగర్‌కోయిల్, సెంబాకం, దిండిగల్లు ముందు వరుసలో ఉన్నాయి. ఈ-బే మొత్తం వాచీల అమ్మకాల్లో వీటి వాటా 60 శాతంగా ఉందని కంపెనీ రిటైల్ ఎక్స్‌పోర్ట్స్, లైఫ్‌స్టైల్ విభాగం హెడ్ నవీన్ మిస్ట్రీ తెలిపారు. ఆన్లైన్లో అతిపెద్ద వాచ్మాల్ను ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. టాప్‌లో అర్మానీ.. కంపెనీ విక్రయిస్తున్న వాచీల్లో అంతర్జాతీయ బ్రాండ్లు 65 శాతం కైవసం చేసుకున్నాయి. టాప్-5 బ్రాండ్లలో అర్మానీ, ఫాసిల్, గెస్, టైటాన్, ఫాస్ట్ట్రాక్లు ఉన్నాయి. వాచ్ పరిశ్రమ భారత్‌లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ.5,250 కోట్లుంది. ఇందులో ఆన్లైన్ వాటా 35 శాతం వృద్ధితో రూ.200 కోట్లుంది. ఈ-బే 21 శాతం వాటాను దక్కించుకుందని కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ గిరీష్ హురియా తెలిపారు. ‘ఈ-బే సైట్లో వాచీలకు పురుషులు సగటున రూ.6,300, మహిళా కస్టమర్లు రూ.3,150 ఖర్చు చేస్తున్నారు. 44 శాతం కస్టమర్లు మొబైల్ ద్వారా ఆర్డర్లు ఇస్తున్నారు. కనీసం 30 శాతం డిస్కౌంట్‌తో 200 బ్రాండ్లలో 65 వేలకుపైగా మోడళ్లను వాచ్మాల్లో అందుబాటులోకి తెచ్చాం’ అని తెలిపారు. ఈ-బే మొత్తం ఆన్లైన్ కస్టమర్లలో 43 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు.