600% వృద్ధి సాధించాం: స్నాప్‌డీల్ | Selling Online Offers Significant Savings: Snapdeal | Sakshi
Sakshi News home page

600% వృద్ధి సాధించాం: స్నాప్‌డీల్

Published Fri, Jan 2 2015 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

600% వృద్ధి సాధించాం: స్నాప్‌డీల్

600% వృద్ధి సాధించాం: స్నాప్‌డీల్

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ గత ఏడాది 600 శాతం వృద్ధిని సాధించింది. భారత్‌లో గత ఏడాది అత్యంత వేగంగా వృద్ధి సాధించిన ఈ కామర్స్ సంస్థగా నిలిచామని స్నాప్‌డీల్ పేర్కొంది. ఎంకామర్స్ రంగంలో తమదే అగ్రస్థానమని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ బహాల్ పేర్కొన్నారు.

గత ఏడాది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన అగ్రశ్రేణి ఐదు కంపెనీల్లో తమది ఒకటని స్నాప్‌డీల్ వినియోగదారులు, వ్యాపార భాగస్వాములకు రాసిన లేఖలో ఆయన వివరించారు. గత ఏడాది తమకు అద్భుతమైన సంవత్సరమని తెలి పారు. మొత్తం ఆర్డర్లలో 65 శాతం ఆర్డర్లు మొబైల్ ఫోన్ల ద్వారానే వచ్చాయని పేర్కొన్నారు.

షోరూమ్‌ల్లో విక్రయించగలిగే అన్ని వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించగలమనే విశ్వాసంతో, కార్లు, బైక్‌లను కూడా ఆన్‌లైన్‌లో ఆఫర్ చేశామని వివరించారు.  500కు పైగా విభిన్నమైన కేటగిరీల్లో 50 లక్షలకు పైగా ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement