స్నాప్‌డీల్ చేతికి మార్ట్‌మొబీ | Snapdeal acquires Hyderabad-based MartMobi | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్ చేతికి మార్ట్‌మొబీ

Published Tue, May 26 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

స్నాప్‌డీల్ చేతికి మార్ట్‌మొబీ

స్నాప్‌డీల్ చేతికి మార్ట్‌మొబీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటైన స్నాప్‌డీల్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ కంపెనీ మార్ట్‌మోబీ.కామ్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు ఎంత ధర చెల్లించిందనేది మాత్రం రెండు సంస్థలూ వెల్లడించలేదు. ప్రస్తుతానికి ధర చెప్పలేమని మార్ట్‌మోబీ వ్యవస్థాపకుడైన సత్య కృష్ణ గన్ని తనను సంప్రతించిన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. మార్ట్‌మోబీ అందించే సేవలపై ఇటీవలే ‘సాక్షి స్టార్టప్ డైరీ’ కాలమ్‌లో ప్రచురించడం తెలిసిందే. ఎం-కామర్స్ చేస్తున్న సంస్థలకు వెబ్‌సైట్లు, యాప్‌లను ఈ సంస్థ తయారు చేస్తుంది.

ఇప్పటికే యూఎస్, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, సింగపూర్ వంటి 20 దేశాలకు చెందిన సంస్థలకిది వెబ్‌సైట్లు, యాప్‌లు తయారు చేసింది. తాజా డీల్ అనంతరం ఇకపై స్నాప్‌డీల్‌లో వస్తువులు విక్రయించే సెల్లర్లకు మాత్రమే ఈ సంస్థ ప్రత్యేకంగా వెబ్‌సైట్లు, యాప్‌లు తయారు చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement