న్యూఢిల్లీ: 200 డాలర్ల(రూ.13 వేలు) పరిమితితో ఎస్‌బీఐ జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డుల్లో మార్పులు చేసి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 9.1 కోట్ల మేర ఖర్చు చేసిన సంఘటన బ్యాంకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. యలమంచిలి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ తరఫున ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్నారై బ్రాంచ్ 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని జారీచేసింది.
సందీప్ కుమార్ అనే వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్‌లో మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో రూ. 9.1 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి కంపెనీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒరకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్‌లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంపై ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment