NRI Branch
-
అమెరికాలో ‘కాళేశ్వరం’ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాలు అమెరికాలో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సమితి యూఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం–మిన్నెసొటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో మిన్నెసొటాలో ఎడెన్ప్రయరీలో ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ప్రతినిధి ఎర్రబెల్లి ప్రేమ్, టీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ ప్రాంతీయ ప్రతినిధి కాచం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు చేపూరి భవాని రామకృష్ణ, మాటా వ్యవస్థాపకుడు అల్లమనేని నిరంజన్, భీమా రవి, పాతూరి యోగేందర్, ముదిరెడ్డి రాజవెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో తెలంగాణ రైతుల చిరకాలవాంఛ నెరవేరనుందన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని 40 లక్షల ఎకరాల్లో 2 పంటలకు సాగునీరు అందుతుందన్నారు. -
కార్డు లిమిట్ 13 వేలు.. ఖర్చు 9 కోట్లు
న్యూఢిల్లీ: 200 డాలర్ల(రూ.13 వేలు) పరిమితితో ఎస్బీఐ జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డుల్లో మార్పులు చేసి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 9.1 కోట్ల మేర ఖర్చు చేసిన సంఘటన బ్యాంకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ తరఫున ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్నారై బ్రాంచ్ 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని జారీచేసింది. సందీప్ కుమార్ అనే వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్‌లో మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్సైట్లలో రూ. 9.1 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి కంపెనీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒరకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్‌లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంపై ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
కొత్త ప్రాంగణంలోకి ఎస్బీహెచ్ ఎన్నారై బ్రాంచ్
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై బ్రాంచ్‌ను వేరే ప్రాంతానికి మార్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది. 1992, నవంబర్‌లో ఫతే మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ఇప్పుడు హిమాయత్ నగర్‌కు మారింది. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ మార్పు చేసినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. కొత్త ప్రాంగణంలో ఈ ఎన్నారై శాఖను ఎస్బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, వి. విశ్వనాధన్(సీజీఎం, ఆర్బీ), అనిల్ మల్హోత్ర(జనరల్ మేనేజర్, పీబీ), దేవేంద్ర కుమార్(జీఎం, హైదరాబాద్ నెట్వర్క్), ఎస్.సి. ధావన్ (డీజీఎం, మెట్రోజోన్), హర్షవర్థన్ మాడభూషి(జనరల్ సెక్రటరీ, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్), టి. సుధాకర్ రెడ్డి(బ్రాంచ్ హెడ్) తదితరులు పాల్గొన్నారు.