కొత్త ప్రాంగణంలోకి ఎస్‌బీహెచ్ ఎన్నారై బ్రాంచ్ | The new campus esbihec NRI Branch | Sakshi
Sakshi News home page

కొత్త ప్రాంగణంలోకి ఎస్‌బీహెచ్ ఎన్నారై బ్రాంచ్

Published Sat, Jan 24 2015 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

కొత్త ప్రాంగణంలోకి ఎస్‌బీహెచ్ ఎన్నారై బ్రాంచ్

కొత్త ప్రాంగణంలోకి ఎస్‌బీహెచ్ ఎన్నారై బ్రాంచ్

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై బ్రాంచ్‌ను వేరే ప్రాంతానికి మార్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది. 1992, నవంబర్‌లో  ఫతే మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ఇప్పుడు హిమాయత్ నగర్‌కు మారింది. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించడానికి ఈ మార్పు చేసినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.

కొత్త ప్రాంగణంలో ఈ ఎన్నారై శాఖను ఎస్‌బీహెచ్ ఎండీ శంతను ముఖర్జీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, వి. విశ్వనాధన్(సీజీఎం, ఆర్‌బీ), అనిల్ మల్హోత్ర(జనరల్ మేనేజర్, పీబీ), దేవేంద్ర కుమార్(జీఎం, హైదరాబాద్ నెట్‌వర్క్), ఎస్.సి. ధావన్ (డీజీఎం, మెట్రోజోన్), హర్షవర్థన్ మాడభూషి(జనరల్ సెక్రటరీ, ఎస్‌బీహెచ్ ఆఫీసర్స్ అసోసియేషన్), టి. సుధాకర్ రెడ్డి(బ్రాంచ్ హెడ్) తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement