Hyderabad: Brother Molested His Sister For Last 3 Years, Details Inside - Sakshi
Sakshi News home page

Hyderabad: మూడేళ్లుగా చెల్లెలిపైనే అఘాయిత్యం..

Published Fri, Sep 2 2022 10:45 AM | Last Updated on Fri, Sep 2 2022 11:25 AM

Hyderabad: Brother Molested Sister For Last 3 Years - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ దారుణం నగరంలో వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కుటుంబం హిమాయత్‌నగర్‌లో స్థిరపడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019లో బాలిక వయస్సు 16 సంవత్సరాలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రోహన్‌ నాయుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారూ పట్టించుకోలేదు.  

దీనిని అసరగా తీసుకున్న రోహన్‌ నాయుడు చెల్లిని భయపెడుతూ అప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు లైంగిక దాడిచేశాడు. ఇదిలా ఉండగా జూన్‌లో బాధితురాలు నేపాల్‌కు వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. అయినా ఆమెను ఫోన్‌చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఆగస్టు 30న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రోహన్‌నాయుడుపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.   
చదవండి: గుజరాత్‌లో కారు బీభత్సం.. ఆరుగురు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement