రూ.2వేల లోపు చెక్‌లపై ఎస్‌బీఐ కార్డ్‌ బాదుడు..! | SBI Card to impose charge on payments made by cheque | Sakshi
Sakshi News home page

రూ.2వేల లోపు చెక్‌లపై ఎస్‌బీఐ కార్డ్‌ బాదుడు..!

Published Tue, Apr 18 2017 3:01 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

రూ.2వేల లోపు చెక్‌లపై ఎస్‌బీఐ కార్డ్‌ బాదుడు..!

రూ.2వేల లోపు చెక్‌లపై ఎస్‌బీఐ కార్డ్‌ బాదుడు..!

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గత కొన్ని రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇటీవల మినిమం బ్యాలెన్స్‌పై వెసులు బాటు కల్పించిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా తాజాగా మరో  సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకమీదట  రూ.2వేల లోపు   చెక్‌ పేమెంట్స్‌పై  దేశంలోని అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐకు  చెందిన  ఎస్‌బీఐ కార్డ్‌ వడ్డనకు తెరతీసింది.  భారీగా పెరుగుతున్న కార్డ్‌ చెక్‌ పేమెంట్లకు  చెక్‌ పెట్టేందుకు ఈ  చార్జీలను వసూలు చేయనుంది.

 ఎస్‌బీఐ కార్డ్‌  రూ.2వేల లోపు చెక్‌లపై రూ.100 చార్జీ  వసూలు చేయనుంది. ముఖ్యంగా  డ్రాప్‌ బాక్స్‌ లలో  భారీ ఎత్తున  చెక్స్‌ జమ అవడం, తద్వారా   వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాతాదారుకు సమాచారం అందించింది.  చెక్‌  క్లియరెన్స్‌ ఆలస్యం లేట్‌ ఫీజుకు దారి తీస్తోందని, తాజా నిర్ణయంతో ఇక ప్రతినెల  ఇక చెక్స్‌ సేకరణలో ఎలాంటి తప్పిదం జరగదని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈవో విజయ్‌ జాసుజా వ్యాఖ్యలను ఉటంకిస్తూ  టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్ట్‌ చేసింది. 

అయితే ఇది ఎస్‌బీఐ  బ్రాంచ్‌లలో చెక్‌లను  బ్రాంచ్‌ లలో డిపాజిట్‌ చేసే ఖాతాదారులకు ఈ  ఫీజు వర్తించదని స్పష్టం చేశారు.  అలాగే నాన్‌ ఎస్‌బీఐ చెక్‌ లు బ్రాంచ్‌లలో డిపాజిట్‌ చేసినా  రూ.100 చార్జి వసూలు చేయనుంది.  దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ లలో ఎక్కడైనా రూ.2వేల లోపు  నాన్‌ ఎస్‌బీఐ చెక్‌ డిపాజిట్లకు వడ్డన తప్పదన్నమాట.

కాగా  4.3 మిలియన్ యూజర్లతో ఉన్న ఎస్‌బీఐ కార్డు  బ్యాంకు కాదు. ఫైనాన్స్‌ కంపెనీలా రిజిస్టర్‌ అయి వున్న  ఏకైక సంస్థ.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement