impose charge
-
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు రూ.5.39 కోట్లు జరిమానా - కారణం ఇదే!
ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లఘించిన బ్యాంకుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ తాజాగా 'పేటీఎమ్ పేమెంట్స్' బ్యాంక్‌కు భారీ జరిమానా విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లఘించిన కారణంగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ. 5.39 కోట్లు పెనాల్టీ విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 46(4)(i), 47A(1)(c) నిబంధనల ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు! పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్స్‌కు సంబంధించిన RBI మార్గదర్శకాలను, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విఫలం కావడాన్ని గుర్తించడంతో ఆర్బీఐ ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 👉 సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
రూ.2వేల లోపు చెక్‌లపై ఎస్బీఐ కార్డ్ బాదుడు..!
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత కొన్ని రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇటీవల మినిమం బ్యాలెన్స్‌పై వెసులు బాటు కల్పించిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకమీదట రూ.2వేల లోపు చెక్ పేమెంట్స్‌పై దేశంలోని అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్బీఐకు చెందిన ఎస్బీఐ కార్డ్ వడ్డనకు తెరతీసింది. భారీగా పెరుగుతున్న కార్డ్ చెక్ పేమెంట్లకు చెక్ పెట్టేందుకు ఈ చార్జీలను వసూలు చేయనుంది. ఎస్బీఐ కార్డ్ రూ.2వేల లోపు చెక్‌లపై రూ.100 చార్జీ వసూలు చేయనుంది. ముఖ్యంగా డ్రాప్ బాక్స్ లలో భారీ ఎత్తున చెక్స్ జమ అవడం, తద్వారా వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖాతాదారుకు సమాచారం అందించింది. చెక్ క్లియరెన్స్ ఆలస్యం లేట్ ఫీజుకు దారి తీస్తోందని, తాజా నిర్ణయంతో ఇక ప్రతినెల ఇక చెక్స్ సేకరణలో ఎలాంటి తప్పిదం జరగదని భావిస్తున్నట్టు ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో విజయ్ జాసుజా వ్యాఖ్యలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. అయితే ఇది ఎస్బీఐ బ్రాంచ్‌లలో చెక్‌లను బ్రాంచ్ లలో డిపాజిట్ చేసే ఖాతాదారులకు ఈ ఫీజు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే నాన్ ఎస్బీఐ చెక్ లు బ్రాంచ్‌లలో డిపాజిట్ చేసినా రూ.100 చార్జి వసూలు చేయనుంది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లలో ఎక్కడైనా రూ.2వేల లోపు నాన్ ఎస్బీఐ చెక్ డిపాజిట్లకు వడ్డన తప్పదన్నమాట. కాగా 4.3 మిలియన్ యూజర్లతో ఉన్న ఎస్బీఐ కార్డు బ్యాంకు కాదు. ఫైనాన్స్ కంపెనీలా రిజిస్టర్ అయి వున్న ఏకైక సంస్థ.