ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లఘించిన బ్యాంకుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ తాజాగా 'పేటీఎమ్ పేమెంట్స్' బ్యాంక్‌కు భారీ జరిమానా విధించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లఘించిన కారణంగా పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ రూ. 5.39 కోట్లు పెనాల్టీ విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 46(4)(i), 47A(1)(c) నిబంధనల ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్ లైసెన్స్‌కు సంబంధించిన RBI మార్గదర్శకాలను, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విఫలం కావడాన్ని గుర్తించడంతో ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment