COD
-
రూ.2000 నోటు: అమెజాన్ షాకింగ్ అప్డేట్, తెలుసుకోండి!
Rs. 2000 Note Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యూజర్లకు చేదువార్త అందించింది. రెండు వేల నోటుకు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ (COD) సేవలపై 2000 నోట్లను అంగీకరించడాన్ని ఇకపై నిలిపివేయనుంది. సెప్టెంబర్ 19 నుండి 2000 కరెన్సీ నోట్లను నగదుగా స్వీకరించడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఉత్పత్తిని థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా డెలివరీ చేస్తే, వీటిని అంగీకరిస్తున్నట్టు వెల్లడించింది. (ఉద్యోగులకు షాక్: గూగుల్‌లో మళ్లీ తొలగింపుల పర్వం) ఆర్బీఐ 2000 కరెన్సీ నోట్లును చలామణినుంచి ఉపసంహరించుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ సేవకు అంగీకరించింది. బ్యాంకుల్లో రూ. 2000 మార్పిడికి గడువు సమీపిస్తున్న తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంటి వద్ద నుంచే రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పించిన సంగతి తెలిసిందే. కాగా 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాటిని చెలామణి నుండి తొలగించింది. ఒకవేళ మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2.72 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు అందాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 25 న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం , చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి లేదా మార్పిడి అయ్యాయి. -
ఈ-కామర్స్‌కు ‘నోటు’ పోటు
-
ఈ-కామర్స్‌కు ‘నోటు’ పోటు
• క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల తాత్కాలిక నిలిపివేత.. • నియంత్రణల విధింపు న్యూఢిల్లీ: మోదీ సర్కారు రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ-కామర్స్ కంపెనీల వ్యాపారంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు నగదు రూపంలో చెల్లింపులు (సీఓడీ) చేసే ఆర్డర్ల డెలివరీకి బ్రేక్ పడింది. అమెజాన్, పేటీఎం తదితర ఆన్లైన్ విక్రయ సంస్థలు సీఓడీ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారుు. అరుుతే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి మరికొన్ని సంస్థలు సీఓడీ ఆర్డర్ విలువపై పరిమితులు విధించారుు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం ఈ-కామర్స్ లావాదేవీల్లో 70 శాతం నగదు రూపంలోనే జరుగుతున్నారుు. దీనిబట్టి చూస్తే, పెద్ద నోట్ల రద్దు ఉదంతం ఈ కంపెనీలకు కొంతకాలంపాటు ఎదురుదెబ్బేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘కొత్త ఆర్డర్లకు సంబంధించి క్యాష్ చెల్లింపులను తాత్కాలికంగా ఆపేశాం. అరుుతే, మంగళవారం(8న) అర్థరాత్రికి ముందు సీఓడీ ఆర్డర్‌ను చేసిన కస్టమర్లకు మాత్రం డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా చెల్లుబాటు అయ్యే డినామినేషన్లలో మాత్రమే చెల్లింపులకు అనుమతిస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు సీఓడీ ఆర్డర్ల విలువను రూ.1,000; రూ.2,000కు మాత్రమే పరిమితం చేశారుు. అది కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లించాలని సూచించారుు. ఉబెర్, బిగ్‌బాస్కెట్‌లు కూడా తక్కువ డినామినేషన్లలోనే చెల్లింపులు జరపాలని కోరారుు. -
‘సింగరేణి’ సీవోడీ విజయవంతం
నేటి నుంచి వాణిజ్య విద్యుదుత్పత్తి ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి సంస్థ నిర్మించిన 1,200 (2X600) మెగావాట్ల తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల తొలి యూనిట్ కి సంబంధించిన కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ (సీవోడీ) ప్రక్రియ ఆది వారం పూర్తయింది. సింగరేణి, తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల అధికారుల సమక్షంలో యూనిట్-1కి సం బంధించిన సీవోడీ పరీక్ష ఆదివారం విజయవంతం గా ముగిసిందని సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 612 మెగావాట్ల విద్యుత్‌ను ఎలాంటి ఆటం కం లేకుండా ఉత్పత్తి చేశామని పేర్కొంది. ఈ నేపథ్యంలో జైపూర్ విద్యుత్ కర్మాగారంలో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సత్వరంగా ప్లాంట్ నిర్మాణం పూర్తికి దిశానిర్దేశం చేసిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి వాణిజ్యపరంగా విద్యుత్ అమ్మకాలు 2013 మార్చిలో సింక్రనైజేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి యూనిట్-1 ద్వారా 460 మిలియన్ యూని ట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఈ విద్యుత్‌ను గజ్వేల్‌లోని పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే ఈ నెల 22 నుంచి ఆదివారం వరకు 72 గంటల పాటు సీవోడీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించ డం ద్వారా ఈ యూనిట్ వాణిజ్యపర విద్యుదుత్పత్తికి అర్హత సాధించింది. దీంతో సోమవారం నుంచి యూనిట్-1 విద్యుత్‌ను తెలంగాణ డిస్కంలకు అధికారికంగా సింగరేణి విక్రయించనుంది.