నేటి నుంచి వాణిజ్య విద్యుదుత్పత్తి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి సంస్థ నిర్మించిన 1,200 (2X600) మెగావాట్ల తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల తొలి యూనిట్ కి సంబంధించిన కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ (సీవోడీ) ప్రక్రియ ఆది వారం పూర్తయింది. సింగరేణి, తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల అధికారుల సమక్షంలో యూనిట్-1కి సం బంధించిన సీవోడీ పరీక్ష ఆదివారం విజయవంతం గా ముగిసిందని సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రకటించింది. 612 మెగావాట్ల విద్యుత్‌ను ఎలాంటి ఆటం కం లేకుండా ఉత్పత్తి చేశామని పేర్కొంది.
ఈ నేపథ్యంలో జైపూర్ విద్యుత్ కర్మాగారంలో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సత్వరంగా ప్లాంట్ నిర్మాణం పూర్తికి దిశానిర్దేశం చేసిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నేటి నుంచి వాణిజ్యపరంగా విద్యుత్ అమ్మకాలు
2013 మార్చిలో సింక్రనైజేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి యూనిట్-1 ద్వారా 460 మిలియన్ యూని ట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఈ విద్యుత్‌ను గజ్వేల్‌లోని పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే ఈ నెల 22 నుంచి ఆదివారం వరకు 72 గంటల పాటు సీవోడీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించ డం ద్వారా ఈ యూనిట్ వాణిజ్యపర విద్యుదుత్పత్తికి అర్హత సాధించింది. దీంతో సోమవారం నుంచి యూనిట్-1 విద్యుత్‌ను తెలంగాణ డిస్కంలకు అధికారికంగా సింగరేణి విక్రయించనుంది.
‘సింగరేణి’ సీవోడీ విజయవంతం
Published Mon, Sep 26 2016 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement