రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో పొట్టచేతబట్టుకుని ముంబైకి వలస వెళ్లిన రాష్ట్ర కూలీలను ‘నోటు’ కష్టాలు చుట్టుముట్టారుు. చేద్దామంటే పనుల్లేవు.. కొందరు పనులకు తీసుకెళుతున్నా పాత పెద్ద నోట్లే ఇస్తున్నారు.. అవి చెల్లవు.. చేతుల్లో చిల్లర డబ్బుల్లేవు.. చిల్లర కోసం ప్రయత్నిస్తే రెక్కల కష్టం కమీషన్ల పాలవుతోంది.. తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోదామన్నా కష్టమైన పరిస్థితి.