అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్‌స (ఎన్డీయే)లోని అన్ని పార్టీలు పెద్ద నోట్ల ఉపసంహరణ, సర్జికల్ దాడులపై ప్రధాని మోదీ వెంట నిలిచారుు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం సోమవారం జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాలపై విపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని మిత్ర పక్షాలు ప్రకటించారుు. నోట్ల ఉపసంహరణ విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదనీ, నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న మహాయుద్ధం సరైన ఫలితాన్ని ఇస్తుందని భేటీ అనంతరం సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.