సహకార బ్యాంకులకు అవకాశం
నోట్ల విషయంలో ప్రధాని పునరాలోచించాలి: పోచారం
సాక్షి, మెదక్: నోట్ల రద్దుపై ప్రధాని మోదీ పునరాలోచించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు దాచుకున్న డబ్బుల కోసం సద్దులు కట్టుకుని బ్యాం కుల వద్ద బారులు తీరుతున్నట్లు చెప్పారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, ట్రాన్‌సపోర్టు తదితర శాఖల ఆదాయం సగానికి తగ్గినట్లు వివరిం చారు. సహకార బ్యాంకులకు నోట్లు మార్పిడి చేసుకునే అవకాశం కేంద్రం కల్పించకపోవటం బాధాకరమన్నారు. ఈ చర్య సహకార బ్యాంకులకు రైతులను దూరం చేసేలా ఉందన్నారు.
రాష్ట్రంలోని 60 శాతం మంది రైతులు సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉంటారని తెలిపారు. సహకార బ్యాం కులకు డబ్బులు మార్చుకునే రైతులు తమ అకౌంట్‌ల నుం చి రూ.50 వేల వరకు డబ్బు లు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆర్‌బీఐ గవర్నర్‌కు లేఖ రాసినట్లు వివరించారు. రబీలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరిం చారు. త్వరలోనే రైతులకు బ్యాం కుల ద్వారా రుణాలు మంజూరు చేరుుస్తామన్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు దళారులను ఆశ్రరుుంచి మోసపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు లాభం చేకూరేలా నూతన మార్కెటింగ్ విధానం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి ఉన్నారు.