Minister POCHARAM
-
పంట రుణాలు రూ.42,494 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.42,494 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. గతేడాది లక్ష్యం కంటే ఇది రూ.2,741 కోట్లు అదనం. ఈ మేరకు 2018–19 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్ల బ్యాంకు రుణాలివ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా 42.47 శాతం, అంటే రూ.58,063 కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇస్తారు. ఇందులో పంట రుణాలు రూ. 42,494 కోట్లు. ఇందులో 60 శాతం ఖరీఫ్‌లో, 40 శాతం రబీలో ఇస్తారు. రూ.15,569 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,798 కోట్ల విద్యా రుణాలు, రూ.6,011 కోట్ల గృహ రుణాలు కూడా ఇస్తారు. పంట రుణాల్లో అధికంగా వరికి 19.52 లక్షల రైతులకు రూ.18,796 కోట్లిస్తారు. 8.09 లక్షల మంది పత్తి రైతులకు రూ.8,279 కోట్లు, 1.44 లక్షల మిరప రైతులకు రూ.1,141 కోట్లు, 3.86 లక్షల మొక్కజొన్న రైతులకు రూ.3 వేల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 96 వేల మందికి రూ.2,639 కోట్లు, ఉద్యాన పంటల సాగు, మొక్కల పెంపకానికి రూ.1,140 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.846 కోట్లు ఇస్తారు. గత యాసంగిలో 65 శాతమే గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా బ్యాంకులు రూ.21,025 కోట్లు (88.15 శాతం) ఇచ్చాయి. 88 శాతం, రబీలో 65 శాతం రుణాలిచ్చినట్టు వెల్లడించారు. గతేడాది వానాకాలం కానీ యాసంగిలో మాత్రం రూ.15,901 కోట్లకు గాను రూ.10,384 కోట్లే (65 శాతం) రైతులకు అందినట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. దాంతో రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. రూ.10,714 కోట్ల వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు రూ.7320.07 కోట్లు (68.32 శాతం) ఇచ్చారు. వ్యవసాయ మౌలిక వసతుల రుణాల లక్ష్యం రూ.1,323.03 కోట్లయితే రూ.391 కోట్లతో బ్యాంకులు సరిపెట్టాయి. రాష్ట్రానికి అగ్రస్థానంలో బ్యాంకర్లకూ పాత్ర: ఈటల రైతుబంధు పథకంతో రైతులందరినీ బీమా పరిధిలోకి తెచ్చామని ఈటల అన్నారు. రుణ ప్రణాళికను విడుదల చేశాక ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్రామాల్లోని గీత కార్మికులు, ఇతర వర్గాలకూ బీమా ఉందని గుర్తు చేశారు. గ్రామాల్లోని ఇతర పేదలకూ జీవిత బీమా అందేలా మరో పథకాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. ‘‘రైతు బంధుతో బ్యాంకుల్లో నగదు కొరత కాస్త తగ్గింది. దేశంలో ఈ పథకం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. కొత్త రాష్ట్రం అనేక అద్భుతాలు సాధించి నంబర్‌వన్‌గా నిలవడంలో బ్యాంకర్ల పాత్ర కూడా ఉంది. వారికి ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు. రూ.5 వేల కోట్లు అందుబాటులో ఉంచాలని కేందాన్ని కోరితే రూ.3 వేల కోట్లే ఇచ్చారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఢిల్లీకి పోతే స్పందన ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అనేవారు. ఇప్పుడు ఆ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందుందని కాగ్ కూడా ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుంది. ఈ ఏడాది 10 లక్షల ఎకరాల స్థిర ఆయకట్టు ఇస్తాం. గతంలో రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అనేవారు, ఇప్పుడు తెలంగాణ అంటున్నారు. ఏపీలో 43 లక్షల టన్నుల వరి పండితే, తెలంగాణలో 55 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది’’అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను పెంచాలని బ్యాంకర్లను కోరారు. వాటిల్లో ఉద్యోగుల సంఖ్యనూ పెంచాలన్నారు. ‘‘గ్రామీణ యువతకు గ్యారంటీ లే కుండా రుణాలివ్వండి. అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. చిన్న పరిశ్రమలకు బ్యాంక్ డిపాజిట్ లేకుండా రుణాలివ్వండి. కుల వృత్తులకు రుణాలివ్వండి. చిన్న వృత్తులకు రూ.1,500 కోట్ల సబ్సిడీ ఇవ్వబోతున్నాం. వారి కి బ్యాంకులు రూ. 2–3 వేల కోట్లివ్వాలి’’అని కోరారు. మోకాలి చికిత్స వల్ల ఆస్పత్రిలో ఉన్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడా రు. ‘రైతుబంధు’లో సహకరించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
రైతులకు సబ్సిడీపై 5 వేల ట్రాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రైతులకు సబ్సిడీపై ఐదువేల ట్రాక్టర్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాపార విస్తరణలో భాగంగా జాన్ డీర్ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం మంత్రి పోచారంతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ వ్యవసాయ పరికరాలపై దేశంలోనే అత్యధిక సబ్సిడీ అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గత ఏడాది రైతులకు సబ్సిడీపై 3వేల ట్రాక్టర్లు అందించామని ఆయన వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. విత్తనం వేయడం నుండి పంట కోత వరకు అంతా యంత్రాలతోనే జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయన్నారు. వరి కోత యంత్రాలు పూర్తిగా విజయవంతం అయ్యాయన్నారు. మిగతా పంటలకు కూడా కోత యంత్రాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్నకు కూలీల కొరత ఎక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న నూర్పిడి యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. కాగా, నాణ్యతతో పాటు అందుబాటు ధరలో యంత్రాలను రైతులకు అందించాలని ఆయన కంపెనీ ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు అనుగుణంగా జాన్ డీర్ ఉత్పత్తులను అందిస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్, జాన్ డీర్ కంపెనీ ప్రతినిధులు డగ్లస్ రాబర్ట్స్, సతీశ్ నాడిగర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ శాఖలో 1,446 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ శాఖలో 1,446 పోస్టులను భర్తీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పుట్టా మధుకర్, అల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరూరి రమేశ్‌లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తమ శాఖలో ఇప్పటివరకు 1,311 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), 114 వ్యవసాయాధికారులు, 18 జూనియర్ అసిస్టెంట్లు, మూడు టైపిస్టు పోస్టులను భర్తీ చేశామన్నారు. అలాగే నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు, ఒక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. 4 ఔటర్ రింగ్‌రోడ్లు: మంత్రి తుమ్మల సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఆరూరి రమేశ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు ఔటర్ రింగ్రోడ్లకు సంబంధించి అడిగిన ప్రశ్నలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బదులిచ్చారు. గజ్వేల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌లకు ప్రభుత్వం ఔటర్ రింగ్రోడ్లను మంజూరు చేసిందన్నారు. సూర్యాపేటృ అశ్వారావుపేట, కోదాడృమహబూబాబాద్లకు జాతీయ రహదారి మంజూరైందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రోడ్లకు ఏదో ఒకవైపు కాకుండా రెండు వైపులా భూమిని సేకరించాలన్నారు. ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రాష్ట్రంలో 496 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని ఇంధన, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 81.32 కోట్ల మొక్కలు నాటాం: జోగు రామన్న హరితహారం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 81.32 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సభ్యులు మనోహర్‌రెడ్డి, రవీంద్రకుమార్, గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. నాటిన మొక్కల మనుగడను పర్యవేక్షించేందుకు జియో రిఫరెన్సింగ్ నిమిత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. చెక్‌డ్యాంలపై సభ్యులు చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్య, పుట్టా మధుకర్‌లు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. వివిధ గ్రాంట్ల కింద రాష్ట్రంలో రూ. 273.60 కోట్లతో 105 చెక్‌డ్యాంలను, వంతెనల నిర్మాణం చేపట్టామన్నారు. అందులో 24 పూర్తయ్యాయన్నారు. పాత పెన్షన్ స్కీమ్‌నే వర్తింపజేయాలి 1.20 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్ స్కీమ్‌నే వర్తింప చేయాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీనిపై సీఎం పునరాలోచన చేయాలన్నారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నదన్నారు. 10 లక్షల ఎకరాలకు ఎర్ర తెగులు సోకిందన్నారు. దీంతో అటువంటి పత్తికి ధర రావడంలేదన్నారు. పత్తికి రూ. 8 వేలు ధర చెల్లించాలని ఆయన కోరారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో మాదాని కురువ, మాదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని సభ్యుడు చిన్నారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలి వర్షాలకు పత్తిలోని విత్తనాలు మొలకెత్తాయని టీఆర్ఎస్ సభ్యుడు అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. దీంతో దళారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పత్తికి బోనస్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పూరిగుడిసెకు లక్ష కరెంటు బిల్లా? జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన పూరి గుడిసెకు ఏకంగా రూ.1.05 లక్షల కరెంటు బిల్లు రావడాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి లేవనెత్తారు. అధికారుల నిర్వాకంపై ఆమె మండిపడ్డారు. బిల్లు కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అక్కడి బిల్ కలెక్టర్ హెచ్చరించడం శోచనీయమని చెప్పారు. దీంతో ఆ కుటుంబ యజమాని చనిపోయాడన్నారు. అయినా ఇప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా అదే గ్రామంలో రూ. 95 వేలు, రూ. 65 వేలు కరెంటు బిల్లులు వచ్చినవారున్నారని తెలిపారు. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ పూర్తి పరిశీలన చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
జిల్లాల్లో ఆవిర్భావ సంబురాలు
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఆవిర్భావ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఘనంగా జరి గాయి. కొత్త జిల్లాలు ఏర్పాటై అక్టోబర్ 11 నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల సముదా యాలకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట, సిరిసిల్లల్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థా పనలు చేయగా, మిగిలిన చోట మంత్రులు చేశారు. నిజామాబాద్‌లో కలెక్టర్ కార్యాలయ భవనానికి, కామారెడ్డిలో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల భవన సముదాయాలకు మంత్రి పోచారం శంకుస్థాపన చేశారు. ఎంపీ కవిత పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి, జనగామలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు శంకుస్థాపన చేశారు. జనగామలో జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధి రాయగిరి వద్ద జిల్లా కలెక్టర్ సమీకృతశాఖల భవన సముదాయాలకు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌లో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి భూమి పూజ చేశారు. వనపర్తిలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మా ణాలకు హోం మంత్రి నాయిని శంకుస్థాపనలు చేశారు. జగిత్యాల జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ కవితతో కలసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా వేడుకలు హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమంలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. నేడు సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సాక్షి, సూర్యాపేట: సీఎం కేసీఆర్ గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణంలోని గొల్లబజార్‌లో నిర్మించిన డబు ల్ బెడ్రూం ఇళ్లను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభిస్తారు. ఆ తర్వాత కుడకుడలో కొత్త సమీకృత కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యా లయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చివ్వెంల పీహెచ్‌సీని సందర్శిస్తారు. వట్టికమ్మం పహాడ్‌లో నిర్మిం చిన 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, చందు పట్లలో మిషన్‌భగీరథ పథకాన్ని ప్రారంభి స్తారు. ఆ తర్వాత చందుపట్లలోని మోడల్ అంగన్వాడీ, హాస్టల్‌ను సీఎం సందర్శించే అవకాశం ఉంది. ఆయా కార్యక్రమాల తర్వాత సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. -
‘పోచారం’ ఎత్తు పెంచితే ముప్పు తప్పదు
హవేలి ఘణాపూర్ (మెదక్): పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచితే పొలాలకు ముప్పు తప్పదని మెదక్, కామారెడ్డి జిల్లాల రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం అభయార ణ్యంలో బుధవారం వీరంతా సమావేశమ య్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎత్తును పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ప్రాజెక్టు ఎత్తుతో మెదక్ జిల్లా హవేలి ఘణాపూర్ మండల పరిధిలోని రాజ్‌పేట, పోచమ్మ రాల్, కొత్తపల్లి, బూర్గుపల్లి, కామారెడ్డి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని వదల్పర్తి, శెట్టిపల్లి సంగారెడ్డి, పొల్కం పేట పరిధిలోని వేల ఎకరాల పంట పొలా లు నీట మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోచారం ప్రాజెక్టు నిండినప్పుడు పలు గ్రామాల్లోని పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయశాఖ మంత్రి పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచబోమని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. రైతు విధానాలకు వ్యతిరేకంగా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తే రైతులందరం పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
రుణ మాఫీ శాశ్వత పరిష్కారం కాదు
సాక్షి, అమరావతి: వ్యవసాయ సంక్షోభానికి రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కష్టాల్లో చిక్కుకున్న రైతులకు అప్పుల మాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమేన న్నారు. నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వ్యవసాయ విధానంలోనే మౌలిక మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించా రు. వ్యవసా య రంగంలో ప్రగతి ఉన్నప్పటికీ.. వస్తున్న ఫలితాలు రైతుకు అనుకూలంగా లేవని చెప్పారు. తాను పండించే పంటకు తానే ధర నిర్ణయించుకునే స్థాయికి రైతు ఎదగాల్సి ఉందని, అందుకు ప్రభుత్వ విధానాలు దోహదపడాలని సూచించారు. మీడియా కూడా వ్యవ సాయ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతు తలెత్తుకొని బతకాలి: పోచారం రైతు తలెత్తుకుని బతికే రోజు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు పథకాలు రూపొందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రకృతి సేద్య ప్రముఖుడు పాలేకర్ విధానాలతో ఆరేళ్లుగా ప్రకృతి సాగుతో పలు రకాల కూరలు, పండ్లు పండిస్తు న్న కుంచనపల్లి రైతు ఆరుమళ్ల సాంబిరెడ్డి వ్యవసాయ క్షేత్రంపై పోచారం మక్కువ చూపారు. సాక్షి సాగుబడి పేజీలో ఇటీవల ఆయనపై రాసిన ప్రత్యేక కథనాన్ని చదివిన పోచారం.. నేరుగా సాంబిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. విజయవాడకు వస్తూనే సమీపంలోని కుంచనపల్లికి వెళ్లి సాంబిరెడ్డి పొలాన్నీ, సాగుబడి తీరును చూసివచ్చినట్టు తెలిపారు. సభలో తెలంగాణ ప్రభుత్వం, రైతునేస్తం మధ్య విత్తన ధృవీకరణ సంస్థకు సంబంధించి అవగాహనా ఒప్పందం కుదిరింది. నీలివిప్లవం, రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచిక, సేంద్రియ మొబైల్ యాప్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, వ్యవ సాయ మంత్రి సోమిరెడ్డి, వ్యవసాయ పరిశోధన, నిర్వహణ జాతీయ మండలి (నారమ్) డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధికి అవార్డు అగ్రి జర్నలిజంలో సాక్షి తెలంగాణ బ్యూరో ప్రతినిధి బొల్లోజు రవి అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పోచా రం, సోమిరెడ్డి తదితరులు ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ రైతుల పక్షాన ఆయన రాసిన పలు విశ్లేషణాత్మక కథనాలకు ఈ అవార్డును బహూకరించినట్టు నిర్వా హకులు ప్రకటించారు. జర్నలిజంలో అవార్డులు స్వీకరించిన వారిలో రూరల్ మీడియా ఎడిటర్ శ్యాంమోహన్, ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేస్తున్న రంగారెడ్డి జిల్లా రైతు మనోహరాచారి, ఎ.పద్మావతి (టీవీ–1), బస్వోజు మల్లిక్, భాగవతుల బుజ్జిబాబు (ఈటీవీ), జి.నాగేశ్వరరెడ్డి (ఆకాశవాణి), ఈవూరి రాజారత్నం (టీవీ–5) ఉన్నారు. వనజీవి రామయ్యగా ఖ్యాతి గాంచిన దరిపల్లి రామయ్యకు ప్రకృతి రత్న, వ్యవ సాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు కృషిరత్న అవార్డును అందజేశారు. -
కాంగ్రెస్‌వి సిగ్గులేని వ్యాఖ్యలు
రైతు నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర పోచారం, హరీశ్‌రావు ఫైర్ సాక్షి, సిద్దిపేట: ‘స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి పాలించిన నాయకులెవ్వరూ రైతుల గురించి ఆలోచించలేదు. తెలంగాణ రైతుల కంట కన్నీరు తుడిచి వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అర్థం చేసుకోలేని కాంగ్రెస్ నాయకులు సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారు’అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో జరిగిన గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రైతు సమితుల ఏర్పాటుపై కోర్టుకెళ్లిన కాంగ్రెస్ నాయకులకు కోర్టు తీర్పు చెంపపెట్టు అయిందన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి అర్హులైన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.4 వేల చొప్పున అందచేస్తామని, కావాలంటే, కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, భట్టివిక్రమార్కలకు కూడా అందిస్తామని ఎద్దేవా చేశారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో జై తెలంగాణ అన్నందుకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే నోరు మెదపని నాయకులు.. ఇప్పుడు మాట్లాడటం శోచనీయం అన్నారు. ఆశా, ఏఎన్ఎంల సేవలు భేష్: హరీశ్ ‘ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న ప్రజలే నేడు.. నేను పోను బిడ్డో ప్రైవేట్ దవాఖానకు..’ అంటున్నారని, ఇదంతా వైద్యారోగ్యశాఖ కృషి ఫలితమేనని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చమత్కరించారు. సిద్దిపేట ఐఎంఏ హాల్లో ఏఎన్ఎంలకు ట్యాబ్స్ పంపిణీ, వాటి వినియోగం శిక్షణ ముగింపునకు మంత్రి అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ప్రభుత్వ వైద్యం అందించడంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు విశేషంగా పని చేస్తున్నారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం పల్లెల్లోకి చేరవేయడంలో ఆరోగ్య కార్యకర్తల సేవలు అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలకు 4,500 ట్యాబ్స్ అందచేశామని, తొలిగా పంపిణీని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించామని చెప్పారు. -
నేడు ఢిల్లీలో సీఎంకు ఉత్తమ రైతు అవార్డు
సీఎం తరఫున అవార్డు స్వీకరించనున్న మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్–2017 ఉత్తమ రైతు అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఢిల్లీలో అందుకోనున్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. భారత ఆహార వ్యవసాయ మండలి (ఐసీఎఫ్ఏ) సీఎం కేసీఆర్‌ను గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికచేసిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు ఈ అవార్డు ఇస్తున్నట్టు ఐసీఎఫ్ఏ తెలిపింది. 2008 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నామని పేర్కొంది. -
1 నుంచి గ్రామ రైతు సంఘాలు
ఉద్యాన మహోత్సవం–2017 ప్రారంభంలో పోచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 10,800 రెవెన్యూ గ్రామాలను 3,600 యూనిట్లుగా విభజించి సెప్టెంబర్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు గ్రామ రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 10 నుంచి 14 వరకు మండల రైతు సమన్వయ సంఘాలు.. అలాగే జిల్లా, రాష్ట్ర సమన్వయ సంఘాలూ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు భూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘తెలంగాణ ఉద్యాన మహోత్సవం 2017‘ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు అప్పుల బారినుంచి బయటపడి ఆత్మహత్యల్లేని తెలంగాణ సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని.. రైతు సమగ్ర సర్వే వివరాల ఆధారంగా 2018, మే 15 నాటికి ఎకరాకు రూ. 4 వేల నగదును రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. ఉద్యాన రైతులకూ నగదు సాయం చేస్తామని వివరించారు. అవసరమైన కూరగాయలను ఇంట్లోనే పండించుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. ఇళ్ళలో కూరగాయలు పండించేందుకు అధునాతన, సాంకేతిక పద్ధతులను ఉద్యాన శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఉద్యాన పంటలతోనే రైతులు అధిక ఆదాయం పొందుతారని, 50 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే వచ్చే లాభానికన్నా 15 లక్షల ఎకరాల్లో పండించే ఉద్యాన పంటల ఆదాయం ఎక్కువని మంత్రి విశ్లేషించారు. అందుకే ప్రభుత్వం భారీ రాయితీలు కల్పించి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. కాగా, ఉద్యాన మహోత్సవం ఈ నెల 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉత్పత్తులతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేశాయి. -
నకిలీ విత్తనాలు అమ్మితే కొట్టుకుంటూ తీసుకెళ్లాలి
వ్యవసాయ మంత్రి పోచారం వ్యాఖ్య హైదరాబాద్: నకిలీ విత్తనాలు విక్రయించే వారి చేతులకు బేడీలు వేసి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ రూ. 6.19 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న విత్తన నాణ్యత పరీక్ష ప్రయోగశాల భవనానికి మంగళవారం మండలి చైర్మన్ స్వామి గౌడ్‌తో కలిసి ఆయన భూమిపూజ, శంకుస్థాపన చేశారు. విత్తనాలలో కల్తీని నిరోధించేందుకు త్వరలోనే సమగ్రమైన విత్తన చట్టం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. దేశంలో తెలంగాణ విత్తనాలు అంటే కళ్లు మూసుకుని కొనేలా విత్తన నాణ్యత ఉండాలని సూచించారు. ఈ ప్రయోగశాల వల్ల తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం అయ్యేలా కృషి చేయాలని పోచారం కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, ఎం.జగన్మోహన్, డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్ సాగు.. 1.08 కోట్ల ఎకరాలు
- 2017–18 కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయశాఖ లక్ష్యం - గతేడాది కంటే రెండున్నర లక్షల ఎకరాలు పెరగనున్న వరి - ఖరీఫ్, రబీ విత్తన సరఫరా లక్ష్యం 10 లక్షల క్వింటాళ్లు - ఈ ఏడాది భారీగా ఆహారాధాన్యాల ఉత్పత్తి: పోచారం సాక్షి, హైదరాబాద్: తాజా ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగును వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ సారి మరో ఆరు లక్షల ఎకరాలు అదనంగా సాగు చేయాలని, రబీ పంటల సాగును కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు కలిపి 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 2017–18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం విడుదల చేశారు. గత ఖరీఫ్‌లో వరి 22.15 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి రెండున్నర లక్షల ఎకరాలు అదనంగా 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఇక గత రబీ సాగు విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు కాగా.. వచ్చే రబీలో 37.62 లక్షలకు పెంచనున్నారు. పప్పులు, మొక్కజొన్న లక్ష్యం తగ్గింపు 2017–18 వ్యవసాయ సం వత్సరంలో 90.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2016–17లో వరి ఉత్పత్తి లక్ష్యం 55.43 లక్షల టన్నులుకాగా.. 2017–18లో 58.11 లక్షల టన్నులకు పెంచింది. అయితే పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం తగ్గింది. 2016–17లో పప్పు ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 5.78 లక్షల టన్నులుండగా.. ఈసారి 4.69 లక్షల టన్నులకు పరిమితం కానుంది. ఇందులో 2016–17లో కంది లక్ష్యం 2.24 లక్షల టన్నులుకాగా 2.03 లక్షల టన్నులకు.. మొక్కజొన్న లక్ష్యం 31.24 లక్షల టన్నుల నుంచి 27.01 లక్షల టన్నులకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మిరప లక్ష్యం 2.69 లక్షల టన్నులు, పత్తి 32.28 లక్షల టన్నులుగా నిర్ధారించారు. అవసరమైన స్థాయిలో విత్తనాలు ఈ ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్లు, రబీలో 4 లక్షల క్వింటాళ్లు.. మొత్తంగా 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పేర్కొంది. 2016–17లో ఈ రెండు సీజన్లకు కలిపి సరఫరా చేసింది 7.5 లక్షల క్వింటాళ్లు మాత్రమే. ఇక ఈ సారి ఎరువుల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించారు. 2016–17 ఖరీఫ్‌లో 17.30 లక్షల టన్నుల ఎరువుల సరఫరా లక్ష్యంగా పెట్టుకోగా.. 2017–18 ఖరీఫ్‌లో 16.20 లక్షల టన్నులే సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇక రబీ ఎరువుల సరఫరా లక్ష్యాన్ని 12.50 లక్షల టన్నుల నుంచి 12 లక్షల టన్నులకు తగ్గించారు. 90.89 లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. ఖరీఫ్, రబీల్లో కలిపి 90.89 లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసినట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయానికి రూ.5,755 కోట్లు కేటాయించామని.. విత్తన సబ్సిడీ కోసం రూ.139 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం రూ.337 కోట్లు ఇచ్చామని చెప్పారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులపై ప్రీమియం భారం తగ్గించేందుకు ఈ ఏడాది రూ. 224 కోట్లు.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కోసం రూ.343 కోట్లు కేటాయించామన్నారు. 10 విత్తన క్షేత్రాల పరిధిలో 407 హెక్టార్లలో వరి, కందులు, శనగ, పెసర, మినుములు, వేరుశెనగ తదితర పంటలకు సంబంధించి 17,464 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనం పండించేలా ప్రణాళిక రూపొందిం చామన్నారు. ఇక కౌలు రైతుల పేర్లను సమగ్ర రైతు సర్వేలో నమోదు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. -
జూన్ 10 నాటికి రైతు సర్వే పూర్తి
అధికారులకు మంత్రి పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతు సమగ్ర సర్వేను జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పోచారం.. అక్కడి నుంచి ప్రతి రోజూ టెలి కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ఏఈవోలు నమోదు చేస్తున్న వివరాలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రతిరోజూ సమీక్షించాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను శనివారం ఆదేశించారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ సమగ్ర రైతు సర్వే కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా 100 లైన్ల సామర్థ్యంతో టెలి కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. -
రైతులకు పూర్తిస్థాయి రుణాలు ఇవ్వండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ కోసం రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశంలోనూ, అనంతరం విలేకరులతోనూ ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము మొత్తాన్ని విడుదల చేసిందని, రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు అందజేయాలని మంత్రి కోరారు. రుణమాఫీ నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని, ఈ విషయంలో బ్యాంకు బ్రాంచీలు చొరవ తీసుకోవాలని అన్నారు. ఏవైనా డాక్యుమెంట్లు బ్యాంకుల వద్ద ఉంటే వెంటనే ఆయా రైతులకు అందజేయాలని సూచించారు. రైతులకు పంటల బీమా అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 23.02 లక్షల మంది రైతులు పంటరుణాలు తీసుకుంటే అందులో కేవలం 6.7 లక్షల మంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లిం చాలన్నారు. రబీలో 13.50 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 2.23 లక్షల మంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. పంటల ప్రీమియం చెల్లింపునకు గడువు తేదీలు ముందే ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందువల్ల గడువు తేదీల కంటే ముందే రైతులకు రుణాలు ఇవ్వాలని, అందుకోసం అవసరమైతే ఏఈవోలు రైతుల నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొని బ్యాంకులకు అందజేస్తారన్నారు. కొన్ని బ్యాంకులు ప్రీమియం సొమ్ము రైతుల నుంచి సేకరించినా బీమా కంపెనీలకు చెల్లించడంలేదని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను సరిగా అమలు చేయడంలేదని అన్నారు. . రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 816 కోట్లు రుణాలు ఇచ్చాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి మాట్లాడుతూ 2016–17లో కేవలం 15 శాతమే బీమా ప్రీమియం చెల్లించారని, వచ్చే ఖరీఫ్ నుంచి 40 శాతం వరకు చెల్లించేలా చూడాలని కేంద్రం ఆదేశించిందని వివరించారు. రెండు, మూడు నెలల్లో మరో 500 ఏఈవో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వివిధ బ్యాంకుల ప్రతి నిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పావులా వడ్డీ, వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్) పథకాల నుంచి రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయని, కనీ సం జీవో కూడా జారీ చేయకపోతే ఎలా అని మంత్రి పోచారాన్ని నిలదీశారు. దీంతో మంత్రి స్పందిస్తూ త్వరలో అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తామని హామీయిచ్చారు. -
అదిగదిగో కాళేశ్వరం!
ఇంజనీర్‌గా అవతారమెత్తిన మంత్రి హరీశ్‌రావు - నిజామాబాద్ జిల్లా వాసులకు పవర్ ప్రజెంటేషన్ - ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపంపై విశదీకరణ - 900 కోట్లతో మిడ్‌మానేరు టూ పోచంపాడుకు గ్రీన్ సిగ్నల్ - తిలకించిన మంత్రి పోచారం, ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్దిపేటజోన్: భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇంజనీర్‌గా అవతారమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర రూపాన్ని పవర్ ప్రజెం టేషన్ ద్వారా సుమారు గంటపాటు నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు, రైతులకు వివరించారు. దేవుడు కరుణిస్తే డిసెంబర్ వరకు లక్ష్యాన్ని అధిగమిస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా వెంకటాపూర్ గ్రామశివారులో కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గోదావరి జలాలను తెలంగాణకు మళ్లించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని, తుమ్మిడిహట్టి ప్రాంతాన్ని మార్చి సులభతరంగా, ముంపు లేకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించి అన్నారం, సుందిల్ల ప్రాంతాల్లో బ్యారేజీల ద్వారా గోదా వరి నీటిని ఒడిసి పట్టే విధానాన్ని వివరించారు. గోదావరి నదిలోని 35 టీఎంసీల నీటిని 3 బ్యారేజీల ద్వారా తరలించి సాగునీటినందిం చే బృహత్తర కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేసి 200 టీఎంసీలతో 18 లక్షల ఎకరాలతోపాటు, ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, సింగూరు, నిజాంసాగర్ల మరో 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టుకు మొత్తంగా 36 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి గందమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఫ్లోరైడ్ ప్రాంతాలైన భువనగిరి, ఆలే రు, తుంగతుర్తి, నకిరేకల్ ప్రాంతాలకు గోదా వరి జలాలను తరలించే ఆలోచనను మ్యాప్ ద్వారా వివరించారు. సిద్దిపేట జిల్లాలో కొండపొచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తరలించి అక్కడి రిజర్వాయర్ నుంచి గ్రావిటి పద్ధతి ద్వారా శామీర్‌పేట చెరువును నింపే ఆలోచనను రైతులకు విశదీకరించారు. మల్లన్నసాగర్ నుంచి హల్దీవాగుకు, అక్కడి నుంచి మంజీరా ద్వారా నిజాంసాగర్‌కు నీరందించి ఇందూరు జిల్లా రైతాంగానికి సాగునీటిని ముంగిట్లోకి తెస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, నిజాంసాగర్‌ను గంగమ్మ తల్లితో జలకళ సంతరింపచేస్తామని హరీశ్ వివరించారు. డిసెంబర్‌లోగా లక్ష్యాన్ని అధిగమిస్తాం కాలం కలిసొస్తే డిసెంబర్లోనే నీరు తెచ్చి ఉత్తర తెలంగాణ జిల్లాలకు కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు అనుసంధానం చేసి లిప్ట్ ప్రక్రియ ద్వారా నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి, ప్రాంతాలకు నీరందించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు 900 కోట్లతో మిడ్‌మానేరు నుంచి పోచంపాడుకు వరద కాలువల సాగునీటిని అందించే ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, హన్మంత్షిండేతోపాటు నిజామాబాద్‌కు చెందిన వెయ్యి మంది ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
20 మంది డీఏవోలపై వేటు!
తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయ నిర్ణయం సమర్థత చూపించడం లేదని కొందరు కలెక్టర్ల నుంచి ఫిర్యాదులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 20 జిల్లాల వ్యవసాయ బాస్‌లను తప్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. సంబంధిత నిర్ణయంపై ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పచ్చజెండా ఊపడంతో అందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. వారి స్థానంలో జూనియర్ అధికారులనైనా నియమించాలని యోచిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ఆ శాఖ వర్గాలను కలవరపెడుతోంది. సమర్థత చూపించకపోవడం వల్లే... రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక గతంలోని వ్యవసాయ సంయుక్త సంచాలకుల (జేడీఏ) పోస్టులను జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో)గా నామకరణం చేశారు. అలా డీఏవోలే జిల్లా వ్యవసాయ బాస్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక జేడీఏ క్యాడర్ లేకపోయినా పలువురు డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), అసిస్టెంట్ డైరెక్టర్ల (ఏడీ)ను సీనియారిటీ ఆధారంగా డీఏవోలుగా నియమించారు. అయితే జిల్లాలు ఏర్పాటై ఇన్నాళ్లైనా కూడా 20 మంది వరకు సమర్థత చూపించడం లేదన్న ఫిర్యాదులు కొందరు కలెక్టర్ల నుంచి వస్తున్నాయి. కలెక్టర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు డీఏవోలు సెలవులపై వెళ్లినట్లు తెలిసింది. కలెక్టర్ల ఒత్తిడి భరించలేక కొందరు డీఏవోలు తమను బదిలీ చేయమని కూడా వ్యవసాయ ఉన్నతాధికా రులకు విన్నవించుకుంటున్నారు. సమర్థంగా పనిచేసే ముగ్గురు డీఏవోలు కూడా ఇదే విధంగా కోరుతున్నట్లు తెలిసింది. సీఎం ఆదేశాలు పాటించకపోవడం కూడా.. సీఎం కేసీఆర్ 10 రోజుల క్రితం వ్యవసా యాధికారులందరినీ పిలిపించి హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలను, రైతులకు అందించే సేవలపై వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీలకు రైతుకు ఎకరాకు రూ. 8 వేల పెట్టుబడి ఇచ్చే పథకంపై ఆయన నొక్కి చెప్పారు. అందుకు అధికారులు చేయాల్సిన విధులను వివరించారు. రైతు సమాచారాన్ని వచ్చే జూన్ 10 నాటికి అందజేయాలని ఆదేశించారు. కానీ చాలామంది డీఏవోలు పనిచేయడంలేదని నిర్ధారణకు వచ్చారు. 20 మంది తూతూమం త్రంగా పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రక్షాళన చేయకుంటే సీఎం నిర్ణయాలు అమలు చేయడం సాధ్యంకాదని వ్యవ సాయశాఖ అంచనాకు వచ్చింది. ఆగమేఘాల మీద వారిపై వేటు వేయాలని నిర్ణయించింది. -
నాకూ రిటైర్మెంట్ సమయం వచ్చింది
మంత్రి పోచారం వ్యాఖ్య బాన్సువాడ: తనకూ రిటైర్మెంట్ సమయం దగ్గరపడిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సు వాడ ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛంద ఆరోగ్య నేస్తాన్ని ప్రారంభించారు. తనతో కలిసి పాఠశాలలో చదివిన స్నేహితులను గుర్తు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మిత్రులంతా రిటైరయ్యారని, కానీ తాను ఇంకా రిటైర్ కాకుండా ప్రజాసేవ చేస్తున్నానని పేర్కొన్నారు. -
10 వేల ఎకరాల్లో పంట నష్టం
అకాల వర్షాల నష్టంపై రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్లు, అకాల వర్షాల కారణంగా 10,760 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ప్రధానంగా వ్యవసాయ పంటలకు 7,762 ఎకరాల్లో, ఉద్యాన పంటలకు 2,998 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. రంగారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి, పెద్దపల్లి, కరీంనగర్, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లోని 19 మండలాలకు చెందిన 75 గ్రామాల్లో నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ బుధవారం పేర్కొంది. మామిడి తోటలకు 2,324 ఎకరాల్లో, కూరగాయల తోటలకు 577 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మిరప, అరటి, సపోట, ద్రాక్ష తదితర తోటలకూ నష్టం జరిగింది. ఉద్యాన పంటలకు రూ.2.05 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ వెల్లడించింది. వరికి 2,032 ఎకరాల్లో, మొక్కజొన్నకు 5,655 ఎకరాల్లో నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ తెలిపింది. మరోవైపు సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగళ్ల వానలకు గ్రీన్‌హౌస్‌లు ధ్వంసమయ్యాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి గ్రామంలో ఎల్లారెడ్డి అనే రైతు అరెకరంలో జెరబిర పూల సాగు చేపట్టారు. వడగళ్ల వానలకు గ్రీన్హౌస్ పూర్తిగా ధ్వంసమైందని, దీంతో రూ.2.50 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాగే కీసరలోనూ ఒక రైతు గ్రీన్హౌస్ పూర్తిగా ధ్వంసమైంది. ఇలా కొన్నిచోట్ల గ్రీన్హౌస్ నిర్మాణాలు కూలిపోయాయి. పాలీషీట్లు చిరిగిపోయాయి. అయితే కొన్నింటికి బీమా సౌకర్యం ఉన్నా మొదటి ఏడాదికే పరిమితం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గ్రీన్హౌస్పై వేసే పాలీషీట్కు కేవలం ఏడాదికే బీమా సౌకర్యం ఉంది. ఏడాది దాటితే వాటికి బీమా పరిహారం ఉండదని రైతులు చెబుతున్నారు. మూడు రోజులు వడగళ్ల వర్షాలు.. మరో మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నష్టం వివరాలను అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. -
అప్పుడే రైతుకు రుణ విముక్తి
⇒ పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం పెరగాలి.. ⇒ ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలి ⇒ వ్యవసాయ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం.. ఈ మూడు పెరిగితేనే రైతులు రుణ విముక్తులవుతారని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్)లో సోమవారం జరిగిన ‘వ్యవసాయంలో నైపుణ్యాభివృద్ధి’పై వర్క్‌షాప్‌ను పోచారం ప్రారంభించారు. మొత్తం 8 రాష్ట్రాల నుంచి 400 మంది వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయంపై వచ్చే ఆదాయం రైతుల జీవన వ్యయానికే సరిపోతుంటే ఇక వారి కుటుంబాలకు మెరుగైన జీవితం ఎలా అందుతుందని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి కానీ అంతే మొత్తంలో రైతుల ఆదాయాలు పెరగలేదని పేర్కొన్నారు. డిపాజిట్ చేయడానికి రైతులు రావాలి.. కేంద్ర బడ్జెట్లో ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలను పెంచుతున్నారని, అసలు రుణమే అవసరం లేకుండా సొంతంగా పెట్టుబడుల ను సమకూర్చుకోగలిగే స్థితికి రైతులు చేరుకోవాలని ఆకాంక్షించారు. రైతులు రుణాల కోసం కాదు లాభాలను డిపాజిట్ చేయడానికి బ్యాంకులకు వచ్చే రోజు రావా లన్నారు. 1947లో 50 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశ ఆహారధాన్యాల దిగుబడులు 2017లో 272 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరడం సంతోషమన్నారు. అయితే సగటు దిగుబడులను ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయని తెలిపారు. పాలీహౌస్‌లకు ప్రోత్సాహం రాష్ట్రంలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రోత్సాహం కల్పిస్తుందని పోచారం తెలిపారు. ఎకరాకు రూ.40 లక్ష లు ఖర్చు కాగా.. రూ.30 లక్షలు సబ్సిడీగా సమకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 1,000 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి అను మతులిచ్చామని వెల్లడించారు. వచ్చే ఏడా ది 3,000 ఎకరాల్లో నిర్మించడానికి సహకా రం అందించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరగా.. ఆయన అంగీకరించా రని తెలిపారు. వ్యవసాయ రంగం బాగుప డాలంటే సాంకేతికత, పెట్టుబడులు, యాంత్రీకరణ పెరగాలని పేర్కొన్నారు. -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ విభాగం ప్రారంభం హైదరాబాద్: ఆహార ధాన్యాల కొరత రానీయకుండా చర్యలు తీసుకుంటూనే రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహి స్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే రైతులకు పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ హాకా భవనంలో తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ విభాగాన్ని పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లో ఎక్కడ సేంద్రియ సాగు చేస్తున్నట్లు తెలి సినా స్వయంగా ఆ రైతుల వ్యవసాయ క్షేత్రా లను సందర్శించి వారి వివరాలు తెలుసుకుం టున్నట్లు చెప్పారు. సేంద్రియ సాగు ప్రారంభించిన మొదటి రెండేళ్లు దిగుబడి తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పద న్నారు. మూడో ఏడాది నుంచి దిగుబడి పెరగడంతోపాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తి వస్తుందని పేర్కొన్నారు. సేంద్రియ ఎరువు లతో పండించిన ఆహారోత్పత్తులు వాడుతు న్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన ఉత్పత్తులకు మార్కె ట్ సదుపాయం కల్పిం చాలని రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యం కోసం కోట్ల నిధులు ఖర్చు.. దిగుబడి పెంచాలన్న లక్ష్యంతో రైతులు అడ్డగోలుగా వాడుతున్న రసాయన ఎరువు లు, పురుగు మందులతో ఆహార ఉత్పత్తుల న్నీ కలుషితమవుతున్నాయన్నారు. మారుతు న్న జీవన విధానాలతో గాలి, నీరు కలుషితం అవుతోందని.. తినే ఆహార పదార్థాల్లో రసాయన అవశేషాలు ఉండడంతో రోగాల పాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి మారాలంటే సేంద్రియ సాగు ఒక్కటే పరిష్కారమన్నారు. ప్రజా రోగ్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతీ పంట కాలనీల్లోని 50 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ధ్రువీకరణతో సేంద్రియ రైతులు పండించే ఉత్ప త్తులకు మంచి ధర రానుందన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ సేంద్రియ సాగు పెంచేలా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. సేంద్రియ ఆహార పంటలకు ప్రత్యేకంగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన పోస్టర్, కరపత్రాలు, సీడీని మంత్రి ఆవిష్కరించారు. సేంద్రియ సాగులో రైతులకు ఓపిక ఉండాలి సేంద్రియ సాగు ప్రారంభించిన మొదటి మూడేళ్లు దిగుబడి తగ్గినా క్రమంగా లాభదా యకంగా ఉంటుందని పలువురు రైతులు వివరించారు. సేంద్రీయ పద్ధతుల్లో తాము సాగుచేస్తున్న పంటలకు సంబంధించిన ఇబ్బందులు, దిగుబడులు తదితర వివరా లను వారు పంచుకున్నారు. నిజామాబాద్ లోని సుభాష్‌నగర్‌కి చెందిన రైతు వెంకట్‌రెడ్డి తాను పచ్చిరొట్ట ఎరువుతో సాగు చేసి ఎకరానికి 35 బస్తాల వడ్లు పండించినట్లు తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు ధ్రువీకరణ రావడంతో తమకు భరోసా పెరిగినట్లు రైతులు తెలిపారు. -
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను సరిదిద్దాలి
నాబార్డుకు మంత్రి హరీశ్‌రావు సూచన ఈ పద్ధతిలో రైతులకు పంట రుణాలు సరిగా అందడం లేదు దాంతో ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది ‘నోట్ల రద్దు’తో పంట రుణాలిచ్చేందుకు బ్యాంకుల వెనుకంజ జీఎస్డీపీలో వ్యవసాయ వాటా పెరిగింది: ఈటల త్వరలో నాలుగో విడత రుణమాఫీ: పోచారం నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్ విడుదల సాక్షి, హైదరాబాద్: పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కచ్చితంగా లేకపోవడం వల్ల రైతులకు సరిగా రుణాలు అందడం లేదని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాలని నాబార్డుకు సూచించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు పంట రుణాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయాయన్నారు. జాతీయ వ్యవ సాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను విడుదల చేసిన సందర్భంగా జరిగిన సెమినార్లో హరీశ్‌రావు మాట్లాడారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కచ్చితంగా లేకపోవడం వల్ల రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మొక్కజొన్న వేసే రైతుకు అవసరమైన రుణం కన్నా తక్కువగా వచ్చే పరి స్థితి ఉందని.. దీనిని సరిదిద్దాలని నాబార్డుకు సూచించారు. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వడం లేదని, రుణం తీసుకునే రైతుల నుంచి బ్యాంకులు బీమా ప్రీమియం కోసం 6 శాతం కోత విధించడంతో వారు గగ్గోలు పెట్టారని చెప్పారు. పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్, హాకా వంటి సంస్థలకు మూలధనం లేకపోవడంతో ధాన్యం సేకరణలో ఇబ్బందులు వస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం కంది పంట దిగుబడి వస్తోందని, మూలధనం లేక ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయలేకపోతున్నాయని చెప్పారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిం చాల్సి వస్తోందని... దళారులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకుం టున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాబార్డు సహకరించాలని కోరారు. భూముల అభివృద్ధికి సహకరించండి కొమ్రం భీం ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లిచ్చినా అక్కడి రైతులు వ్యవసాయ భూములను సాగు చేసుకునే పరిస్థితి లేదని.. ఆ భూములను చదును చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు చెప్పారు. చదును చేయడానికి ఒక్కో ఎకరానికి రూ.6 నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుందని, ఇందుకు నాబార్డు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డెయిరీ, చేపల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిం దని.. చేపల పెంపకం ద్వారా రాష్ట్రానికి ఏడాదికి రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ రబీ సీజన్లో గతంలో కంటే మంచి దిగుబడులు వస్తాయన్నా రు. ఇక కేంద్రం గోదాముల నిర్మాణానికి సబ్సిడీ కింద రెండ్రోజుల క్రితం రూ.235 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. జీఎస్డీపీలో పెరిగిన వ్యవసాయ వాటా.. జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో వ్యవసాయ వాటా గతంలో మైనస్‌లో ఉంటే.. ఇప్పుడు 4 శాతంగా ఉందని ఆర్థికమంత్రి ఈట ల రాజేందర్ పేర్కొన్నారు. జీడీపీలో వ్యవసా య రంగ వాటాను 17% నుంచి 22% పెంచే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ రంగంలో ఉత్పత్తి పెరిగితే ఆదాయం నేరుగా గ్రామీణ ప్రజల చేతుల్లో ఉంటుందని.. ఐటీ, పారిశ్రా మిక రంగాల అభివృద్ధి పెరిగితే కొద్దీ మంది చేతుల్లోనే ఉంటుందన్నారు. రుణాలు తీసు కునే పరిస్థితి కాకుండా డిపాజిట్లు చేసే పరిస్థితి రైతుకు రావాలన్నదే తమ అభిమతమని వ్యవ సాయ మంత్రి పోచారం పేర్కొన్నారు. త్వరలో నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులకు నాబార్డు సంపూర్ణంగా సహకరిస్తోందని, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయరంగం ముందుకు సాగుతుందని సీఎస్ ఎస్పీ సింగ్ పేర్కొన్నారు. సమావేశంలో నాబార్డు సీజీఎం పి.రాధాకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
- మంత్రి పోచారం వెల్లడి - వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ - రైతులకు నిరంతర విద్యుత్: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్: వ్యవసాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని రెడ్డిహాస్టల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా హాజరై న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్‌ను, వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి టెలిఫోన్ డైరీని, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్‌గౌడ్ టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ... గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయరంగ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాట య్యాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్ని అవాంత రాలను అధిగమించి పురోగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులు రుణాలు పొందగా, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింది మాత్రం 6 లక్షల మంది రైతులేనని అన్నారు. రుణాలు పొందిన రైతులు కచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేలా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు కృషి చేయాల న్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత నిరంతరాయంగా విద్యుత్ అందించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అధిక శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే సీఎంలు కావడంతో తెలంగాణ ప్రాంతం, ప్రజలు నిర్లక్ష్యానికి గురైన విషయం వాస్తవమేనని జి. చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటున్నా దానిని నాలుగు దఫాలుగా విభజించడంతో రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడానికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరు వాత కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయ రంగానికేనని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారా యణ, అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు పెంచుతాం
కాంట్రాక్టు డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు కడియం హామీ - నగరంలో ఖాళీ కుండల ప్రదర్శన తగ్గింది: మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు త్వరలో పెంచుతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం శాసనసభలో సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, సండ్ర వెంకటవీరయ్య తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం 19 ఫిబ్రవరి 2016న కాంట్రాక్టు, ఇతర సర్వీసుల రెమ్యునరేషన్ ఏ విధంగా పెంచాలో తెలు పుతూ జీవో 14 విడుదల చేసింది. ప్రస్తుతం ఇస్తున్న దానికి 50 శాతం పెంచి ఇవ్వాలని పేర్కొంది. జీవో 409 ద్వారా కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు రూ.18 వేల నుంచి రూ.27 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చాం. త్వరలోనే డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు పెంచుతాం ’ అని కడియం పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియపై కొంతమంది ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడం, ఈ కేసులో తీర్పు ఇచ్చేవరకు రెగ్యులరైజేషన్ చేయొద్దని కోర్టు చెప్పడంతో అది నిలిచిపోయిందని వివరించారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రోజూ నీటి సరఫరాకు ప్రణాళిక: కేటీఆర్ రాష్ట్రంలో తాగునీటి సరఫరా గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగైందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఖాళీ కుండల ప్రదర్శనలు జరిగేవని, ప్రస్తుతం అవి తగ్గాయని అన్నారు. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల మున్సిపాల్టీల సర్కిళ్ల కోసం రూ.1900 కోట్ల వ్యయంతో నీటి సరఫరా మెరుగుదల ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. హడ్కో నుంచి రూ.1700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు సమకూర్చు కొని పనులు చేపట్టామని, 2018 ఫిబ్రవరి నాటికి అవి పూర్తవుతాయని పేర్కొన్నారు. ఎం ఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాల, బీజేపీ సభ్యులు లక్ష్మణ్, చింతల రాంచం ద్రారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. మరింత నీటి సరఫరా కోసం శామీర్‌పేట, రాచకొండలో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని, మొదటగా శామీర్‌పేట రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నగరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న 19 చోట్లకు తరలిస్తామని వెల్లడించారు. చిన్న పరిశ్రమలకు చేయూత ఇక చిన్న, మధ్యతరహా పరిశ్రామలపై అడిగిన మరో ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధాన మిస్తూ, చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉద్యోగాలు చిన్నతరహా పరిశ్రమల నుంచి వస్తున్నందున వాటికి ఆర్థిక చేయూత ఇవ్వాలని ఆర్బీఐని కోరామని, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు పారిశ్రామిక ఆరోగ్య క్లినిక్‌ల విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. దీనికి ఒక సీఈవోను నియమించడంతోపాటు రూ.100 కోట్ల మూలనిధిని ప్రభుత్వం సమకూర్చనుందని చెప్పారు. ఇక పరిశ్రమల స్థాపనకు భూములు తీసుకొని, వాటిని ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని, ఇప్పటికే పలు సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖలో 1,311 పోస్టుల భర్తీ: పోచారం వ్యవసాయ శాఖలో 1,311 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీటి తోపాటే ఉద్యానవన విభాగంలో 70 పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే నాలుగు వ్యవసాయ పాలి టెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు, ప్రతి కళాశాలలో 30 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించి నట్లు మంత్రి పోచారం తెలిపారు. -
మండలిలో ప్రశ్నోత్తరాలు
ప్రభుత్వ స్కూళ్లలో వసతులకు 235 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం, ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడం, ఆంగ్ల మాధ్యమంలో చదివించాలన్న తల్లిదండ్రుల ఆలోచన వల్ల ఏటా లక్షన్నర మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ కట్టి, మెయిం టెనెన్స్ కింద రూ. 60 కోట్ల చొప్పున, హైస్కూళ్లకు రూ. లక్ష, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 50 వేల చొప్పున నిధులిస్తున్నామన్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేశామని ఈ అంశంపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, సభ్యులు పూల రవీందర్, రామచంద్రారావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్, పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. టీచర్ల పనితీరు బాగోలేదు: షబ్బీర్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, స్కూళ్లకు రాకుండానే సంతకాలు చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉప్పల్వాయిలో ఓ హెడ్మాస్టర్ 29 రోజులు పాఠశాలకు రాకున్నా వచ్చినట్లుగా సంతకాలు పెట్టారని.. ఇలా అనేక పాఠశాలల్లో జరుగుతోందన్నారు. ఉపాధ్యాయుల పనితీరు వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం.. దేశంలోనే చివరి స్థానంలో ఉందని, దాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో విత్తన చట్టం: పోచారం నకిలీ విత్తనాల బెడదను అరికట్టేందుకు త్వరలోనే విత్తన చట్టాన్ని తీసుకురానున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నకిలీ మిరప విత్తన విక్రయదారులపై ఇప్పటికే కఠినంగా వ్యవ హరిస్తున్నామని, పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాల కారణంగా 8,171 మంది రైతులు నష్టపోయారని, 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దీనికి కారణమైన 130 మంది విత్తన డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేసి 17 క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 2,556 మంది రైతులకు రూ. 1.57 కోట్ల నష్ట పరిహారం చెల్లించామన్నారు. హైదరాబాద్‌లో కొత్త నీటి పైప్లైన్లు: కేటీఆర్ కృష్ణా, గోదావరి నదుల నుంచి తాగునీటి సరఫరా పెంచేందుకు హైదరాబాద్‌లో కొత్త నీటి పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నీటిసరఫరా సేవలను విస్తరించేందుకు అల్వాల్, కాప్రా, ఉప్పల్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, గడ్డిఅన్నారం, రాజేంద్రనగర్, కూకట్æపల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరు సర్కిళ్లలో ఫీడర్ మెయిన్‌తో పాటు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు మొదలయ్యాయన్నారు. 2018 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. విడిగా నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు రాష్ట్రంలో నాన్‌వెజ్ మార్కెట్‌ను విడిగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. రాష్ట్రంలో చేపలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా చేపల పెంపకం, వాటిని మార్కెట్ చేయడానికి తగిన ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. -
ధ్రువీకరించిన విత్తనాలే అమ్మాలి!
• దీన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్టం చేయాలి: మంత్రి పోచారం • హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ విత్తన సదస్సు సాక్షి, హైదరాబాద్: నకిలీ, నకిలీ,నాసిరకం విత్తనాలకు కళ్లెం వేయాలంటే.. తప్పనిసరిగా ప్రభుత్వం ధ్రువీకరించిన విత్తనాలనే కంపెనీలు విక్రరుుంచేలా కేంద్రం చట్టం చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఓఈసీడీ విత్తన ధ్రువీకరణ వర్క్‌షాప్ ప్రారంభమైం ది. రెండ్రోజులపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పలు విత్తన కంపెనీలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థల అధికారులు, వివిధ దేశాలకు చెందిన విత్తన ధ్రువీకరణ నిపుణులు హాజరయ్యారు. మంత్రి పోచారం మాట్లాడుతూ విత్తన కంపెనీలు తమ విత్తనాలన్నింటినీ ధ్రువీకరణ చేసుకునేలా 1966 విత్తన చట్టం లో మార్పులు చేయాలని సూచించారు. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖ రాస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి విత్తన ధ్రువీకరణ దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్ చేయాలన్నారు. రాష్ట్రంలో వివిధ విత్తన కంపెనీలు 83 గ్రామాలను దత్తత తీసుకున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘విత్తన గ్రామం’కార్యక్రమం ద్వారా 60 వేల మంది రైతుల సహకారంతో విత్తనోత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాల కారణంగా 2,500 మంది రైతులు నష్టపోయారని.. దోషులపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 400 విత్తన కంపెనీలు రూ.4 వేల కోట్ల విలువైన విత్తనాలను సరఫరా చేస్తున్నాయని, దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలు రాష్ట్రం నుంచే వెళ్తున్నాయని చెప్పారు. 2019లో ‘ఇష్టా’సమావేశం 2019లో అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ (ఇష్టా) సమావేశం తెలంగాణలో జరుగనుం దని కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి (విత్తన) రాజేశ్కుమార్సింగ్ తెలి పారు. ఓఈసీడీ విత్తన ధ్రువీకరణ జాబితా లో మరో 42 వివిధ పంట రకాలను చేర్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ కె.కేశవులు, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, జాతీయ విత్తన సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, దక్షిణాఫ్రికాకు చెందిన ఓఈసీడీ నిపుణులు ఎడ్డి గోల్డ్సాజ్, గైహాల్ పాల్గొన్నారు. -
1,000 కోట్ల రుణం ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: ఉద్యాన సంస్థకు రూ. 1,000 కోట్లు రుణం ఇవ్వాలని.. అందుకు పూచీకత్తు ఇస్తానని స్వయానా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా చివరకు నాబార్డు చేతులెత్తేసింది. కొర్రీల మీద కొర్రీలు వేసిన నాబార్డు చివరకు అసలు మాట బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా రుణాలు తీసుకుందని.. ఇక తమ వల్ల కాదని తేల్చినట్లు తెలిసింది. రూ. వెరుు్య కోట్లు రుణం ఇవ్వడమంటే మాటలు కాదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కంగారుపడిన రాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని నాబార్డు ఉన్నతాధికారులను కలసి పరిస్థితి వివరించి ఎలాగైనా రుణం రాబట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథిని పంపాలని నిర్ణరుుంచింది. సూక్ష్మసేద్యం కోసమే ఇదంతా 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం ఈ ఏడాది రూ. 290 కోట్లు కేటారుుంచింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 190 కోట్లు కేటారుుంచగా... కేంద్రం తన వాటాగా రూ. 100 కోట్లు ఇవ్వనుంది. అరుుతే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరిపోదు. అందువల్ల నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణరుుంచిన సంగతి తెలిసిందే. అరుుతే నేరుగా రుణం తీసుకోవడానికి సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా రుణం తీసుకొని సూక్ష్మసేద్యానికి మరలించాలని నిర్ణరుుంచింది. నాబార్డు మాత్రం మొదటి నుంచీ రూ. 1,000 కోట్ల రుణంపై కొర్రీలు పెడుతూ వచ్చింది. సూక్ష్మసేద్యం పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇవ్వడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తే... రైతులు 25 శాతం చెల్లించాల్సిందేనని నాబార్డు మెలిక పెట్టింది. ఈ వివాదం సీఎం వద్దకు వెళ్లినా నాబార్డు మాత్రం వెనక్కు తగ్గలేదు.