స్కీముల్లేవు.. అన్నీ స్కామ్‌లే
సాక్షి, ఖమ్మం: ‘సింగరేణి క్లరికల్ పోస్టుల పరీక్ష పేపర్, ఎంసెట్ పేపర్ లీకైంది... వీటిని ఎవరు చేశారో.. ఇంత వరకు తేల్చలేదు. నకిలీ విత్తనాలతో మిర్చి రైతులు నిండా మునిగారు. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నోరు మెదపడం లేదు. ప్రభుత్వంలో స్కీముల్లేవు.. అన్నీ స్కాములే అవుతున్నారుు.’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నకిలీ విత్తనాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాతల ఆక్రందన ధర్నానుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు, ఆలోచన స్కామ్‌లమయంగా మారుతోందన్నారు.
నకిలీ విత్తనాల వ్యవహారంలో పోచారానికే కాకుండా.. సీఎం, ఆయన కుటుంబసభ్యులకు సంబంధం ఉందన్న అనుమానం రైతులకు కలుగుతోందని, ఇప్పటి వరకు ఏ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించకపోవడం దీనికి ఊతమిస్తుందన్నారు. నకిలీ విత్తన వ్యవహారంలో సంబంధిత మంత్రి పోచారాన్ని బర్తరఫ్ చేయాలని, సంబంధమున్న కంపెనీల యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోరుున రైతులకు పెట్టుబడితోపాటు కష్టించిన శ్రమకు పరిహారం ఇవ్వాలన్నారు ఇందిరమ్మ బిల్లుల కోసం 4లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి ఏమీ పట్టదని విమర్శించారు.