స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను సరిదిద్దాలి | Adjust the scale of finance | Sakshi
Sakshi News home page

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను సరిదిద్దాలి

Published Sat, Jan 21 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను సరిదిద్దాలి

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను సరిదిద్దాలి

నాబార్డుకు మంత్రి హరీశ్‌రావు సూచన

  • ఈ పద్ధతిలో రైతులకు పంట రుణాలు సరిగా అందడం లేదు
  • దాంతో ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది
  • ‘నోట్ల రద్దు’తో పంట రుణాలిచ్చేందుకు బ్యాంకుల వెనుకంజ
  • జీఎస్‌డీపీలో వ్యవసాయ వాటా పెరిగింది: ఈటల
  • త్వరలో నాలుగో విడత రుణమాఫీ: పోచారం
  • నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కచ్చితంగా లేకపోవడం వల్ల రైతులకు సరిగా రుణాలు అందడం లేదని  భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాలని నాబార్డుకు సూచించారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు పంట రుణాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయాయన్నారు. జాతీయ వ్యవ సాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌ను విడుదల చేసిన సందర్భంగా జరిగిన సెమినార్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కచ్చితంగా లేకపోవడం వల్ల రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం మొక్కజొన్న వేసే రైతుకు అవసరమైన రుణం కన్నా తక్కువగా వచ్చే పరి స్థితి ఉందని.. దీనిని సరిదిద్దాలని నాబార్డుకు సూచించారు. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వడం లేదని, రుణం తీసుకునే రైతుల నుంచి బ్యాంకులు బీమా ప్రీమియం కోసం 6 శాతం కోత విధించడంతో వారు గగ్గోలు పెట్టారని చెప్పారు. పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్, హాకా వంటి సంస్థలకు మూలధనం లేకపోవడంతో ధాన్యం సేకరణలో ఇబ్బందులు వస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం కంది పంట దిగుబడి వస్తోందని, మూలధనం లేక ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయలేకపోతున్నాయని చెప్పారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిం చాల్సి వస్తోందని... దళారులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకుం టున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాబార్డు సహకరించాలని కోరారు.

భూముల అభివృద్ధికి సహకరించండి
కొమ్రం భీం ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లిచ్చినా అక్కడి రైతులు వ్యవసాయ భూములను సాగు చేసుకునే పరిస్థితి లేదని.. ఆ భూములను చదును చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు చెప్పారు. చదును చేయడానికి ఒక్కో ఎకరానికి రూ.6 నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుందని, ఇందుకు నాబార్డు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డెయిరీ, చేపల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిం దని.. చేపల పెంపకం ద్వారా రాష్ట్రానికి ఏడాదికి రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ రబీ సీజన్‌లో గతంలో కంటే మంచి దిగుబడులు వస్తాయన్నా రు. ఇక కేంద్రం గోదాముల నిర్మాణానికి సబ్సిడీ కింద రెండ్రోజుల క్రితం రూ.235 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.

జీఎస్‌డీపీలో పెరిగిన వ్యవసాయ వాటా..
జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో వ్యవసాయ వాటా గతంలో మైనస్‌లో ఉంటే.. ఇప్పుడు 4 శాతంగా ఉందని ఆర్థికమంత్రి ఈట ల రాజేందర్‌ పేర్కొన్నారు. జీడీపీలో వ్యవసా య రంగ వాటాను 17% నుంచి 22% పెంచే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ రంగంలో ఉత్పత్తి పెరిగితే ఆదాయం నేరుగా గ్రామీణ ప్రజల చేతుల్లో ఉంటుందని.. ఐటీ, పారిశ్రా మిక రంగాల అభివృద్ధి పెరిగితే కొద్దీ మంది చేతుల్లోనే ఉంటుందన్నారు. రుణాలు తీసు కునే పరిస్థితి కాకుండా డిపాజిట్లు చేసే పరిస్థితి రైతుకు రావాలన్నదే తమ అభిమతమని వ్యవ సాయ మంత్రి పోచారం పేర్కొన్నారు. త్వరలో నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తామన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులకు నాబార్డు సంపూర్ణంగా సహకరిస్తోందని, సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయరంగం ముందుకు సాగుతుందని సీఎస్‌ ఎస్పీ సింగ్‌ పేర్కొన్నారు. సమావేశంలో నాబార్డు సీజీఎం పి.రాధాకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement